సిద్ధార్థ్‌లు - అదితి పెళ్లి

స్టార్‌ హీరోహీరోయిన్‌ సిద్ధార్థ్‌లు - అదితి రావు హైదరి మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు

Published by: Sneha Latha

రహస్యంగా పెళ్లి

కేవలం ఇరు కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ లవ్‌బర్ట్స్‌ ఏడడుగులు వేశారు

వనపర్తి గుడిలో

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలోని ఓ గుడిలో సింపుల్‌గా సౌత్‌ ఇండియా సంప్రదాయ పద్దతిలో వీరి వివాహ వేడుక జరిగినట్టు తెలుస్తోంది

మార్చిలో నిశ్చితార్థం

నాలుగేళ్లు సీక్రెట్‌ డేటింగ్‌ ఉన్న వీరిద్దరు ఈ ఏడాది 2024 మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే

ఇద్దరి మధ్య ఏడేళ్ల వ్యత్యాసం

ప్రస్తుతం సిద్ధార్థ్‌ వయసు 45, అదితి రావు హైదరి వయసు 37 ఏళ్లు, వీరిద్దరి మధ్య ఏడేళ్ల ఏజ్‌ గ్యాప్ ఉంది

ఇద్దరికి పెళ్లై విడాకులు

ఇద్దరికి ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే, గతంలో సిద్దార్థ్‌, అదితిలకు వేరువేరుగా పెళ్లై విడాకులు అయ్యాయి

ఆ చిత్రంతో పరిచయం

అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం(2021) చిత్రం సమయంలో సిద్ధార్థ్‌-అదితిలు తొలిసారి కలుసుకున్నారు

నాలుగేళ్లు డేటింగ్‌

మహాసముద్రం మూవీ టైంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా నాలుగేళ్లు వీరిద్దరు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్నారు

బాయ్స్‌తో హీరోగా

'బాయ్స్‌' సినిమాతో సిద్ధార్థ్‌ టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వువస్తానంటే నేనొద్దాంటానా చిత్రాలతో స్టార్‌ హీరోగా మారాడు

సమ్మోహనంతో అదితి ఎంట్రీ

సమ్మోహనం(2018) చిత్రంతో అదితి రావు హైదరి టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది, ఆ తర్వాత నాని 'వీ', మహాసముద్రం చిత్రాలతో గుర్తింపు పొందింది