Siddharth-Aditi Rao Hydari: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్
Aditi Rao Hydari-Siddharth Wedding: అదితి రావు హైదరి, సిద్ధార్థ్‌లు పెళ్లి పీటలు ఎక్కారు. సౌత్ ఇండియా సంప్రదాయం ప్రకారం సింపుల్‌గా గుడిలో వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది.
Aditi Rao Hydari and Siddharth Wedding: టాలీవుడ్ హీరోహీరోయిన్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. గత మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఈ కొత్త జంట. కేవలం ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి సింపుల్‌గా జరిగింది. సౌత్ ఇండియా సంప్రదాయ పద్దతిలో వనపర్తి గుడిలో సింపుల్‌గా వీరి పెళ్లి వేడుక జరిగింది.
వీరి నిశ్చితార్థం కూడా ఇదే గుడిలో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం అదితి రావు హైదరి ఫోటోలు షేర్ చేస్తూ అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చింది. "నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే.. నా నక్షత్రాలన్నీ నువ్వే. శాశ్వతంగా నా సోల్‌మేట్‌గా ఎప్పటికే కలిసి నవ్వుతూ, ఎదుగుదాం. ఎటర్నల్ లవ్ అండ్ లైట్. మిస్టర్ అండ్ మిసెస్ అదు-సిద్ధు" అంటూ వారిద్దరు ఇప్పుడు భార్యభర్తలు అయినట్టు వెల్లడించింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ కొత్త జంటకు నెట్టింట శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ ప్రముఖులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నిశ్చితార్థం లాగే పెళ్లి కూడా ఎలాంటి హడావుడి, ఆర్భాటం లేకుండ ఈ జంట పెళ్లి చేసుకోని అందరికి షాకిచ్చారు.
View this post on Instagram
View this post on Instagram
మార్చిలో నిశ్చితార్థం
కాగా కొనేళ్లుగా సీక్రెట్‌గా రిలేషన్‌లో ఉన్న వీరు ఈ ఏడాది మార్చి చివరి నెలలలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి సమాచారం, ప్రకటన లేకుండా సైలెంట్‌గా తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ వనపర్తి జిల్లాలోని ఓ గుడిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరు అదితి-సిద్ధులు రింగులు మార్చుకున్నారు. కాగా అదితి-సిద్ధార్థ్‌లు తొలిసారి జంటగా మహా సముద్రం మూవీలో నటించారు. ఈ మూవీ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
మహాసముద్రం మూవీతో పరిచయం
అయితే వీరి రిలేషన్ ఈ జంట ఎప్పుడు బయటకు చెప్పలేదు. సీక్రెట్‌గా వెకేషన్స్, డేటింగ్ వెళుతూ మీడియాకు చిక్కారు. దీంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. కానీ ఎప్పుడు తమ రిలేషన్‌ను ఈ జంట బయటకు చెప్పకుండ మీడియాను దాటేస్తూ వచ్చింది. అలా కొన్నేళ్లు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అందరిని సర్‌ప్రైజ్ చేశారు. ఇక ఎంగేజ్‌మెంట్ సైలెంట్‌గా జరిగినా.. పెళ్లి మాత్రం హడావుడి ఉంటుందని ఫ్యాన్స్ అంతా ఆశించారు. కానీ పెళ్లి కూడా అదే గుడిలో సైలెంట్ కానిచ్చేసింది ఈ ప్రేమజంట.
Also Read: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...