అన్వేషించండి

Pranit More Apology: నాది తప్పే... మరో ఛాన్స్ ప్లీజ్ - హిమాన్షు 370 బిర్యానీ ఎపిసోడ్‌పై ప్రణీత్ మోరే

Pranit More 370 Biryani Episode: స్టాండప్ కామెడీ షోలో హిమాన్షు జంగ్రా 370 రూపీస్ బిర్యానీ ఎపిసోడ్ నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వివాదంలో ప్రణీత్ మోర్ క్షమాపణలు చెప్పారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రణీత్ మోరే స్టాండప్ షోలో '370 బిర్యానీ' వివాదం చెలరేగింది.
  • హిమాన్షు జంగ్రా రూ.370 బిర్యానీపై మహిళను అవమానించి వీడియో వైరల్ అయ్యింది.
  • హిమాన్షును ప్రోత్సహించినందుకు ప్రణీత్ మోరే క్షమాపణలు చెప్పాడు.

బాలీవుడ్ 'బిగ్ బాస్' ప్రోగ్రామ్, స్టాండప్ కామెడీ షోలు చూసే తెలుగు ప్రేక్షకులకు ప్రణీత్ మోరే (Pranit More) తెలిసే ఉంటారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 19'లో అతడు పార్టిసిపేట్ చేశారు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా... ఇప్పుడు '370 రూపీస్ బిర్యానీ' (Rs 370 Biryani Controversy)తో పాపులర్ అయ్యాడు. ఆ ఎపిసోడ్ నేపథ్యంలో క్షమాపణలు చెబుతూ ఆయన వీడియో విడుదల చేశారు. వివాదంపై ఆయన ఏమన్నారంటే?

'370 బిర్యానీ' కాంట్రవర్సీ ఏమిటి?
అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది?
What Is 370 Biryani Controversy? Explained Here: గురుగ్రామ్‌లో ప్రణీత్ మోరే ఓ స్టాండప్ కామెడీ షో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హిమాన్షు జంగ్రా అనే ఓ టెకీ (వెబ్ డెవలపర్) వచ్చాడు. షో మధ్యలో ఓ మహిళతో తన డేటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి వివరించారు.

ఓ మహిళతో డేటింగ్‌కు వెళ్ళినప్పుడు... తాను రూ. 370 ఖర్చు చేశానని, ఆ డబ్బుతో ఆమెకు చికెన్ బిర్యానీ కొన్నానని హిమాన్షు జంగ్రా చెప్పాడు. అంతటి ఆగకుండా ఎలాగైనా తన డబ్బులు వసూలు చేసుకోవాలని, అందుకు ఆమెతో శారీరకంగా సాన్నిహిత్యాన్ని ఆశించానని తెలిపాడు. మహిళపై ఎలా చెయ్యి వేసినది, ఎలా దగ్గరకు తీసుకున్నదీ వివరించాడు. ఆ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో మహిళా లోకంతో పాటు చాలా మంది మగవాళ్ళు సైతం మండిపడ్డారు. హిమాన్షు జంగ్రాకు మహిళలపై గౌరవం లేదని, మహిళ అనుమతి / సమ్మతి లేకుండా అలా ప్రవర్తించడం సరికాదని, ఇటువంటి ప్రవర్తన సమాజానికి చాలా ప్రమాదకరమని పలువురు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివాదం పెద్దది కావడంతో హిమాన్షు జంగ్రాను ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ. ఈ వివాదంపై స్టాండప్ కామెడీ షో నిర్వాహకుడు ప్రణీత్ మోరే ఓ వీడియో విడుదల చేశారు.

Also ReadAgnimitra Paul: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి

హిమాన్షును ఆపాల్సింది... నాది తప్పే...
నన్ను తిట్టడంలో తప్పు లేదు... సారీ - ప్రణీత్ మోరే
మహిళతో ఎలా ప్రవర్తించినదీ హిమాన్షు జంగ్రా చెబుతుంటే... ప్రణీత్ మోరే క్లాప్స్ (చప్పట్లు) కొడుతూ నవ్వారు. ఓ విధంగా అతడిని ఎంకరేజ్ చేసినట్టు అయ్యింది. హిమాన్షు జంగ్రా చేసినది కామెడీ కాదని, అతడి చేష్టలకు చప్పట్లు కొట్టడం అంటే మహిళలపై దాడులను ప్రోత్సహించడమేనని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రణీత్ మోరే క్షమాపణలు చెప్పారు.

Also ReadRashmika Sister Shiman Mandanna - ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?

"నాకు ఈ విధంగా జరగాల్సిందే. ప్రజలు చూపిస్తున్న ద్వేషానికి నేను అర్హుడినే. ఆ సమయంలో ఆ వ్యక్తి (హిమాన్షు జంగ్రా)ను ఆపాల్సింది. కానీ, అతడికి మాట్లాడే అవకాశం ఇచ్చి విషయాన్ని సమస్యను మరింత జటిలం చేశా. అది నేను చేసిన అతి పెద్ద పొరపాటు. అక్కడ నేను సరైన నిర్ణయం తీసుకోలేదు. నా నిర్ణయ లోపం వల్ల ఈ వివాదం జరిగింది. నన్ను క్షమించండి'' అని ప్రణీత్ మోరే ఓ వీడియో విడుదల చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pranit More (@rj_pranit)

370 బిర్యానీ వివాదం, కామెడీ షోపై జరుగుతున్న విచారణలో అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నానని, తనను తాను మెరుగైన వ్యక్తిగా నిరూపించుకోవడానికి మరో అవకాశం ఇవ్వాలని ప్రజలకు ప్రణీత్ రిక్వెస్ట్ చేశారు.

Also ReadWho Was Kumod Raney? Why Salman Breaks Down? - స్నేహితురాలి మరణంతో సల్మాన్ కంటతడి... ఎవరీ కుముద్ రాణే? 

Frequently Asked Questions

'370 బిర్యానీ' వివాదం అంటే ఏమిటి?

గురుగ్రామ్‌లో ఓ స్టాండప్ కామెడీ షోలో హిమాన్షు జంగ్రా అనే వ్యక్తి ఒక మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. 370 రూపాయల బిర్యానీ కోసం ఆమెతో శారీరక సాన్నిహిత్యం ఆశించానని చెప్పడం ఈ వివాదానికి కారణం.

ఈ వివాదంలో ప్రణీత్ మోరే పాత్ర ఏమిటి?

ప్రణీత్ మోరే నిర్వహించిన స్టాండప్ షోలోనే ఈ సంఘటన జరిగింది. హిమాన్షు అసభ్యకరంగా మాట్లాడుతుంటే ప్రణీత్ చప్పట్లు కొట్టి నవ్వడం ద్వారా అతడిని ప్రోత్సహించాడని విమర్శలు వచ్చాయి.

'370 బిర్యానీ' వివాదంపై ప్రణీత్ మోరే ఎలా స్పందించారు?

ప్రణీత్ మోరే ఒక వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు. హిమాన్షును ఆపాల్సింది, అతడికి మాట్లాడే అవకాశం ఇచ్చి తాను పొరపాటు చేశానని అంగీకరించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget