అన్వేషించండి

Standup Comedy Controversy: ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !

Himanshu Jangra Fired : గురుగ్రామ్‌కు చెందిన వెబ్ డెవలపర్ హిమాన్షు కేవలం రూ. 370 బిర్యానీ జోక్ కారణంగా ఉద్యోగం కోల్పోయారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన స్టాండప్ కామెడీ వీడియో ఎందుకు వివాదం అయిందంటే?

370 Rupees Biryani Joke  Controversy:  సోషల్ మీడియా యుగంలో నోరు జారితే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో చెప్పడానికి గురుగ్రామ్‌కు చెందిన ఒక యువ టెక్కీ ఉదంతమే తాజా ఉదాహరణ. ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే నిర్వహించిన ఒక లైవ్ 'క్రౌడ్-వర్క్'  షోలో, హిమాన్షు జంగ్రా   అనే వెబ్ డెవలపర్ సరదా కోసం చేసిన ఒక వ్యాఖ్య అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. తాను కేవలం రూ. 370 ఖర్చు పెట్టి తినిపించిన చికెన్ బిర్యానీకి ప్రతిఫలంగా.. డేటింగ్‌కు వచ్చిన మహిళపై లైంగిక హక్కును ఆశించినట్లు చేసిన ఆ వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, నెటిజన్ల ఆగ్రహానికి దారితీసింది.

అసలు ఏం జరిగిందంటే..?  

'క్రౌడ్-వర్క్'  కామెడీ షోలో కమెడియన్ అడిగిన ప్రశ్నకు హిమాన్షు సమాధానమిస్తూ.. తాను ఇటీవల తనకంటే వయసులో కాస్త పెద్దదైన ఒక మహిళతో డేటింగ్‌కు వెళ్లానని చెప్పాడు. అక్కడ ఇద్దరూ కలిసి రూ. 370 విలువైన ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ తిన్నట్లు పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా, "పైసా వసూల్ కర్నా పడేగా" అంటే పెట్టిన డబ్బును ఎలాగైనా రికవర్ చేసుకోవాలి  అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. కేవలం తక్కువ ఖర్చు పెట్టినంత మాత్రాన ఆ మహిళ నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించవచ్చనే అర్థం వచ్చేలా అతడు చేసిన ఈ వ్యాఖ్యను కమెడియన్ కూడా నవ్వి, మరింత యాంప్లిఫై  చేశాడు.   

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

ఈ షోకి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో అప్‌లోడ్ అవ్వడమే ఆలస్యం.. విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూ. 370 బిర్యానీని ఒక మీమ్‌గా మారుస్తూనే, హిమాన్షు మానసిక స్థితిని తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలను ఒక వస్తువులా, కేవలం లావాదేవీల కోణంలో చూసే ఇటువంటి ప్రెడేటరీ  మనస్తత్వాన్ని హాస్యం పేరిట ఎలా సమర్థిస్తారంటూ మహిళా సంఘాలు, నెటిజన్లు నిలదీశారు. జోక్ ముసుగులో ఉన్నది ముమ్మాటికీ రేపిస్ట్ మైండ్‌సెట్  అంటూ నెట్టింట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.

హిమాన్షును ఉద్యోగం నుంచి తీసేసిన కంపెనీ

ఈ వివాదం కాస్తా హిమాన్షు పని చేస్తున్న స్టార్విక్ డిజైన్  అనే గురుగ్రామ్ ఆధారిత కంపెనీ దృష్టికి వెళ్ళింది. ఈ వైరల్ వీడియో వల్ల తమ సంస్థ ప్రతిష్ట, గౌరవానికి తీవ్ర భంగం వాటిల్లిందని యాజమాన్యం భావించింది. సోషల్ మీడియాలో వస్తున్న ఒత్తిడి, నెటిజన్ల ఆందోళనల నేపథ్యంలో స్టార్విక్ డిజైన్ సంస్థ తక్షణమే స్పందించి హిమాన్షును ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మహిళల పట్ల ఇటువంటి భావజాలం ఉన్న వ్యక్తిని తమ సంస్థలో కొనసాగించలేమని స్పష్టం చేసింది.  

ఆఫీసులో గుడ్ బాయ్ హిమాన్షు

అయితే, ఈ వ్యవహారంలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. హిమాన్షుకు ఆఫీసులో ఎలాంటి బ్యాడ్ రికార్డ్ లేదు. కార్యాలయంలో అతడి ప్రవర్తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, ఇప్పటివరకు అతడు ప్రొఫెషనల్‌గానే వ్యవహరించాడని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ, బయట సమాజంలో మహిళల పట్ల అతడికున్న చులకన భావం, కంపెనీ ఇమేజ్‌ను దెబ్బతీయడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యాజమాన్యం స్పష్టం చేసింది. డిజిటల్ ప్రపంచంలో క్షణకాలపు ఆనందం కోసం వేసే తప్పుడు అడుగులు కెరీర్‌ను ఎలా బూడిద పాలు చేస్తాయో చెప్పడానికి ఈ  బిర్యానీ వివాదం  ఒక హెచ్చరికగా నిలిచింది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Intermittent Fasting Risks: మీరు 16:8 ఉపవాసం పాటిస్తున్నారా? ముందు పరిశోధనలు చెప్పేది వినండి!
మీరు 16:8 ఉపవాసం పాటిస్తున్నారా? ముందు పరిశోధనలు చెప్పేది వినండి!
Rajpal Yadav: మళ్ళీ జైలుకు బాలీవుడ్ నటుడు... ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
మళ్ళీ జైలుకు బాలీవుడ్ నటుడు... ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
Embed widget