అన్వేషించండి

Agnimitra Paul: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి

Who Is Agnimitra Paul: పశ్చిమ బెంగాల్‌లో కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వంలో ఏకైక (ప్రస్తుతానికి) మహిళా మంత్రిగా అగ్నిమిత్ర పాల్ నిలిచారు. గతంలో బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్‌గా చేశారని తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమ బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా అగ్నిమిత్ర పాల్.
  • ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించి, శ్రీదేవి వంటి నటీమణులకు దుస్తులు రూపొందించారు.
  • 2019లో బీజేపీలో చేరి, అసన్సోల్ దక్షిణం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
  • 23 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఆమెపై ఎటువంటి నేరం రుజువు కాలేదు.

Know About Agnimitra Paul: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సరికొత్త శకం మొదలైంది. భారతీయ జనతా పార్టీ తొలిసారి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఐదుగురు సైతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో అగ్నిమిత్ర పాల్ ఒకరు. మంత్రిగా ఆవిడ ఓ రికార్డు క్రియేట్ చేశారు. అది ఏమిటి? అసలు ఎవరీ అగ్నిమిత్ర పాల్? ఆమెపై క్రిమినల్ కేసుల సంగతి ఏమిటి? వంటి అంశాలతో పాటు రాజకీయ ప్రయాణం గురించి తెలుసుకోండి.   

బీజేపీ క్యాబినేట్‌లో ఏకైక మహిళ...!
Only Lady Minister In West Bengal BJP Government 2026: పశ్చిమ బెంగాల్‌లో కొలువు దీరిన మొట్టమొదటి బీజేపీ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా మంత్రిగా అగ్నిమిత్ర పాల్ రికార్డు సృష్టించారు. ఆమె వయసు 51 సంవత్సరాలు. శనివారం (మే 9న) ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు అగ్నిమిత్ర పాల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు సీనియర్ బీజేపీ నాయకులు దిలీప్ ఘోష్, అశోక్ కిర్తానియా, క్షుదీరామ్ తుడు, నిసిత్ ప్రామాణిక్ సైతం మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో నూతన బెంగాల్ క్యాబినెట్‌లో అగ్నిమిత్ర పాల్ ఏకైక మహిళా మంత్రిగా నిలిచారు. నిజానికి... ఆవిడ కెరీర్ రాజకీయ నాయకురాలిగా కాదు, ఫ్యాషన్ డిజైనర్‌గా మొదలైంది. శ్రీదేవి, హేమా మాలిని వంటి హీరోయిన్లతో పాటు హిందీ సినిమాలకు కూడా ఆవిడ పని చేశారు.

ఇంగా... అగ్నిమిత్ర ఫ్యాషన్ బ్రాండ్...
శ్రీదేవి, హేమా మాలినిలకు కాస్ట్యూమ్స్!
కోల్‌కతా ఫ్యాషన్ ప్రపంచంలో అగ్నిమిత్ర పాల్ ఒక లెజెండ్. సొంతంగా ఫ్యాషన్ బ్రాండ్ 'ఇంగా' (Inga)ను ప్రారంభించి, విజయవంతంగా నడిపారు. బాలీవుడ్ దిగ్గజ హీరోయిన్లు శ్రీదేవి, హేమమాలిని తదితరులకు దుస్తులు డిజైన్ చేశారు. బెంగాల్ నుంచి వచ్చి హిందీలో హీరోగా ఎదిగిన మిథున్ చక్రవర్తికి కూడా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఇంకా హేమా మాలిని కుమార్తె ఈషా డియోల్, సోనాల్ రావత్, వినయ్ పాఠక్, కేకే మీనన్ వంటి సెలబ్రిటీలకూ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. 

బెంగాల్ ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ 'కాంతా'కు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తీసుకోవడంలో అగ్నిమిత్ర పాల్ కృషి ఎంతో ఉంది. ఆవిడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తొలుత బోటనీ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేశారు.

బెంగాల్ నేల తల్లి బిడ్డగా గుర్తింపు...
బీజేపీలో అగ్నిమిత్ర ప్రయాణం తెలుసా? 
అగ్నిమిత్ర పాల్ 2019లో బిజెపిలో చేరారు. ఆ తర్వాత బీజేపీ మహిళా మోర్చాలో చేరి, పార్టీలో పట్టును పెంచుకున్నారు. ఆమె రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరంగా సాగింది. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత అగ్నిమిత్ర పాల్ సొంతం. అయితే... 2026 అసెంబ్లీ ఎన్నికలు ఆమెకు మరింత గుర్తింపు తెచ్చాయి. ప్రచారంలో కీలక పాత్ర పోషించి, పార్టీలో అత్యంత గుర్తింపు పొందిన మహిళా నాయకులలో ఒకరిగా ఎదిగారు.

Also Read: Vijay Father SA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి? ఫుల్ డీటెయిల్స్‌

వెస్ట్ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తపస్ బెనర్జీని 40,000 కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో అగ్నిమిత్ర పాల్ ఓడించారు. దాంతో ఆమె బలం అందరికీ మరింత తెలిసింది. ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె... బీజేపీ బెంగాల్ విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలిగా సేవలు అందించారు. మరి ఇప్పుడు ఆ పదవీని మరొకరికి అప్పగిస్తారా? లేదంటే మంత్రిగా విధులు చేస్తూ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తారా? అనేది చూడాలి.

Also Read: Rashmika Sister Shiman Mandanna - ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?

బీజేపీ పార్టీ వర్గాల్లో అగ్నిమిత్రను 'నేల తల్లి బిడ్డ'గా పిలుస్తారు. సువేందు అధికారి సీఎం కావడానికి ముందు... ఒకానొక సందర్భంలో పెద్దల దృష్టిలో ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు సమర్థంగా నిర్వహించగల బీజేపీ లీడర్స్ జాబితాలో ఆమె పేరు ఉన్నట్టు, పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. ఫ్యాషన్ డిజైనర్ నుంచి మంత్రిగా ఎదిగిన అగ్నిమిత్ర పాల్ ప్రయాణం ఆసక్తికరమని చెప్పాలి. అయితే ఆమె మీద 23 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసుల్లో అక్రమంగా గుమిగూడటం, నిరసనలకు సంబంధించినవి కొన్ని. అయితే ఆమె ఏ కేసులోనూ దోషిగా తేలలేదు.

Also ReadPriyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

Frequently Asked Questions

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ క్యాబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి ఎవరు?

పశ్చిమ బెంగాల్‌లో కొలువు దీరిన మొట్టమొదటి బీజేపీ క్యాబినెట్‌లో అగ్నిమిత్ర పాల్ ఏకైక మహిళా మంత్రిగా రికార్డు సృష్టించారు. ఆమె వయసు 51 సంవత్సరాలు.

అగ్నిమిత్ర పాల్ రాజకీయాల్లోకి రాకముందు ఏమి చేసేవారు?

అగ్నిమిత్ర పాల్ రాజకీయ నాయకురాలిగా కాకుండా, ఫ్యాషన్ డిజైనర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. శ్రీదేవి, హేమా మాలిని వంటి హీరోయిన్లకు, హిందీ సినిమాలకు ఆమె దుస్తులు డిజైన్ చేశారు.

అగ్నిమిత్ర పాల్‌కు రాజకీయాల్లో ఎలాంటి అనుభవం ఉంది?

అగ్నిమిత్ర పాల్ 2019లో బీజేపీలో చేరారు. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించారు.

అగ్నిమిత్ర పాల్‌పై ఏవైనా కేసులు ఉన్నాయా?

అగ్నిమిత్ర పాల్‌పై 23 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసుల్లో అక్రమంగా గుమిగూడటం, నిరసనలకు సంబంధించినవి ఉన్నాయి, అయితే ఆమె ఏ కేసులోనూ దోషిగా తేలలేదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో పెద్ద సినిమాలు - వీరభద్రుడు To భూత్ బంగ్లా... తెలుగు బోల్డ్ సిరీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో పెద్ద సినిమాలు - వీరభద్రుడు To భూత్ బంగ్లా... తెలుగు బోల్డ్ సిరీస్ డోంట్ మిస్
Rahul Ramakrishna : మీ ఫ్యాన్‌గా అడుగుతున్నా... దేశ ద్రోహిని కాదు - పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా రాహుల్ రామకృష్ణ ట్వీట్స్
మీ ఫ్యాన్‌గా అడుగుతున్నా... దేశ ద్రోహిని కాదు - పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా రాహుల్ రామకృష్ణ ట్వీట్స్
Karuppu OTT : వీరభద్రుడు ఓటీటీ రిలీజ్ డేట్ - సూర్య 300 కోట్ల మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
వీరభద్రుడు ఓటీటీ రిలీజ్ డేట్ - సూర్య 300 కోట్ల మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Peddi Collections Day 4: ఆదివారం బాక్సాఫీస్‌లో 'పెద్ది'గాడి ఊచకోత... రామ్ చరణ్ నయా రికార్డు... నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ఆదివారం బాక్సాఫీస్‌లో 'పెద్ది'గాడి ఊచకోత... రామ్ చరణ్ నయా రికార్డు... నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Smoking With Tea : టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
Embed widget