The Raja Saab Teaser Leak: ప్రభాస్ 'రాజా సాబ్' మూవీ టీంకు షాక్ - ఆన్‌లైన్‌లో టీజర్ విజువల్స్ లీక్.. నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్
The Raja Saab: ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ టీంకు టీజర్ రిలీజ్‌కు ముందే షాక్ తగిలింది. టీజర్ విజువల్స్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం కలకలం రేపింది. ఆ కంటెంట్ షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని టీం హెచ్చరించింది.

Prabhas's The Raja Saab Teaser Leaked: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ 'ది రాజాసాబ్'. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 16న టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా.. మూవీ టీంకు తాజాగా షాక్ తగిలింది.
టీజర్ లీక్
టీజర్ రిలీజ్‌కు ముందే ఈ మూవీకి లీకుల బెడద మొదలైంది. టీజర్ విజువల్స్ కొన్ని తాజాగా ఆన్‌లైన్‌లో లీక్ కాగా.. మూవీ టీం దీనిపై స్పందించింది. లీక్ కంటెంట్ షేర్ చెయ్యొద్దని.. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 'రాజాసాబ్'కు సంబంధించి అనధికార కంటెంట్, వీడియోలు షేర్ చేసిన వారి సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. మూవీ టీం ఎంతో శ్రమించి ఆడియన్స్‌కు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు కష్టపడుతుందని తెలిపింది. ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్, ఆడియన్స్ అంతా సహకరించాలని కోరింది.
ప్రభాస్, మారుతి కాంబో అంటేనే ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. మూవీలో ప్రభాస్ లుక్స్ అదిరిపోగా ఫస్ట్ టైమ్ ఆయన హారర్ కామెడీ జానర్‌లో నటిస్తుండడంతో 'రాజా సాబ్' కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 16న టీజర్ రిలీజ్ కోసం భారీ ఈవెంట్ ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తుండగా.. జాతీయ మీడియాకు కూడా ఇన్విటేషన్స్ అందినట్లు సమాచారం. ఇదే ఈవెంట్‌లో మూవీ కోసం వేసిన ఓ భారీ సెట్‌ను చూపిస్తారనే ప్రచారం సాగుతోంది.
ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. రిద్ధికుమార్, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే నాలుగు సాంగ్స్ పూర్తయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంచనాలకు మించి..
ఈ మూవీలో డార్లింగ్ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అంతకు మించి.. వన్ పర్సెంట్ ఎక్కువే ఇస్తామని ఇటీవలే డైరెక్టర్ మారుతి ఓ ఈవెంట్‌లో చెప్పారు. రాజులకే రాజు ప్రభాస్ రాజని.. ఈ మూవీతో తన పని మాట్లాడుతుందని అన్నారు. ప్రభాస్‌పై తనకున్న లవ్‌ను ఈ మూవీలో చూస్తారని హైప్ క్రియేట్ చేయగా టీజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న డైలాగ్ ప్రభాస్ నోటి నుంచి టీజర్‌లో వింటామనే వార్త కూడా మరో లెవల్‌కు తీసుకెళ్లింది.
ఇలాంటి సమయంలో టీజర్ విజువల్స్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం మూవీ టీంకు ఆందోళన కలిగించింది. ఇప్పటివరకూ ఏదైనా మూవీ రిలీజ్ అయిన గంటల్లోనే ఆన్‌లైన్‌లో లీక్ కావడం చూశాం. కానీ ప్రభాస్ మూవీ టీజర్ రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో విజువల్స్ ప్రత్యక్షం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.



















