Salaar Collections : 'సలార్' ర్యాంపేజ్ - 12 రోజుల్లోనే 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్ - అక్కడ రికార్డులే రికార్డులు
Salaar : ప్రభాస్ 'సలార్' మూవీ తాజాగా నైజాం ఏరియాలో రూ.100 కోట్లు కలెక్ట్ చేసి 'బాహుబలి 2' రికార్డ్ ని బ్రేక్ చేసింది.
Salaar Collections : టాలీవుడ్ దగ్గర హీరో ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయారు. భారతీయ సినీ చరిత్రలో ఒక్క సినిమాతో ఈ రేంజ్ లో పాపులారిటీ మరే హీరోకి రాలేదేమో. ‘బాహుబలి’తో ప్రభాస్ మార్కెట్ పదింతలు పెరిగింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభాస్ డిజాస్టర్ సినిమాలకు కూడా భారీ కలెక్షన్స్ రావడంతో రెబల్ స్టార్ మార్కెట్ ఏమాత్రం చెక్కుచెదరలేదని తాజాగా 'సలార్' మరోసారి నిరూపించింది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే రూ.180 కోట్లు కలెక్ట్ చేసి ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 650 కోట్ల మార్క్ దాటింది. ఇండియా వైడ్ గా రూ.400 కోట్లు కలుగట్టిన ఈ సినిమా తాజాగా నైజాంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సలార్ కేవలం నైజాం ఏరియాలోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి 'బాహుబలి 2' రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. 'బాహుబలి 2' తర్వాత మళ్లీ ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ నైజాం ఏరియాలో రూ.100 కోట్లు కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. నైజాంలో 'బాహుబలి 2' మూవీ ఫుల్ రన్ లో రూ.112 కోట్ల గ్రాస్ రూ.68 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబడితే, 'సలార్' కేవలం 12 రోజుల్లోనే ఈ రికార్డుని బ్రేక్ చేసింది. సలార్ నైజాం రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.90 కోట్లకు దక్కించుకున్నారు.
నైజాం ఏరియాలో రూ.95 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా ప్రస్తుతం రూ.70 కోట్ల షేర్ సాధించింది మరో రూ.20 కోట్ల వరకు రాబడితే నైజాంలో బ్రేక్ ఈవెన్ అయినట్లే. ఈ రూ.20 కోట్లను మరో వారం రోజుల లోపు రాబట్టాల్సి ఉంటుంది ఎందుకంటే సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ పోటీలో సలార్ కి కలెక్షన్స్ రావడం కష్టం. మరి దాని కంటే ముందే బ్రేక్ ఈవెన్ అవుతుందేమో చూడాలి. కాగా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.230 కోట్ల వరకు గ్రాస్ ను రూ.147 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది.
బుధవారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కోటి ఇరవై లక్షల వరకు వసూళ్లను రాబట్టడం విశేషం. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.650 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.800 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేజీఎఫ్ సినిమాని నిర్మించిన హోంబలే సంస్థ సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్స్ గా నటించారు. శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించారు.
Also Read : 90 పర్సెంట్ @ 35 డేస్ - కాజల్ స్పీడ్ మామూలుగా లేదు