Satyabhama Movie: 90 పర్సెంట్ @ 35 డేస్ - కాజల్ స్పీడ్ మామూలుగా లేదు
Kajal Aggarwal Satyabhama movie update: కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'సత్యభామ'. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
Kajal Aggarwal Satyabhama 35 days long schedule finished: తెలుగు ప్రేక్షకులు చందమామ అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ కాజల్ అగర్వాల్. కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్లు చేశారామె. అలాగే, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేశారు. కానీ, ఇప్పుడు ఆవిడ రూట్ మార్చినట్లు అర్థం అవుతోంది. యాక్షన్, ఫిమేల్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
'సత్యభామ'గా కాజల్ అగర్వాల్
Satyabhama Movie 2024: కాజల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సినిమా 'సత్యభామ'. ఆమెకు జోడీగా యువ హీరో నవీన్ చంద్ర నటిస్తున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడు శశికిరణ్ తిక్క చిత్ర నిర్మాణంలో అడుగు పెట్టారు. అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్', 'గూఢచారి' సినిమాలతో ఆయన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 'సత్యభామ'కు ఆయన సమర్పకులు. అంతే కాదు... స్క్రీన్ ప్లే అందించారు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
35 రోజుల్లో 90 శాతం చిత్రీకరణ పూర్తి
Satyabhama movie shooting update: 'సత్యభామ' షూటింగ్ కొన్ని రోజుల ముందు మొదలైంది. నవంబర్, డిసెంబర్ నెలలో శరవేగంగా చిత్రీకరణ జరిగింది. ''35 రోజుల పాటు సాగిన షెడ్యూల్‌తో 90 శాతం సినిమా పూర్తి చేశాం. కాజల్ అగర్వాల్, ఇతర ఆర్టిస్టులు పాల్గొనగా... ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్లు తెరకెక్కించాం. కాజల్ ఎప్పుడూ కనిపించని యాక్షన్ అవతార్‌లో 'సత్యభామ' సినిమాలో కనిపిస్తారు. కాజల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో శ్రమించి ఈ యాక్షన్ సీక్వెన్సులు కంప్లీట్ చేశారు. బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం'' అని అన్నారు.
Also Read: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే
'సత్యభామ' టీజర్ విషయానికి వస్తే... హత్యకు గురైన అమ్మాయి ప్రాణాలు కాపాడాలని సత్యభామ (కాజల్) ప్రయత్నిస్తుంది. అయితే ఆ అమ్మాయి బతకదు. ఆ కేసును సత్యభామ నుంచి మరొకరికి బదిలీ చేస్తారు. 'ఈ కేసు నీ చేతుల్లో లేదు' అని పోలీస్ ఉన్నతాధికారి ప్రకాష్ రాజ్ చెబుతారు. తన చేతుల్లో ఓ యువతి ప్రాణాలు పోయాయని, అప్పటి నుంచి గిల్ట్ ఫీలింగ్‌తో సత్యభామ బాధ పడుతుంది. అమాయకపు యువతి ప్రాణాలు తీసిన హంతకులు కోసం వేట మొదలు పెడుతుంది. తన దారికి అడ్డు వచ్చిన విలన్లను చిత్తకొడుతుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం కూడా బావుంది. షీరోయిజం ఎలివేట్ చేసింది.
Also Read: పెళ్లికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?
కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ : అవురమ్ ఆర్ట్స్, కథనం & చిత్ర సమర్పణ : శశి కిరణ్ తిక్క, నిర్మాతలు : బాబీ తిక్క - శ్రీనివాసరావు తక్కలపెల్లి, సహ నిర్మాత : బాలాజీ, ఛాయాగ్రహణం : జి విష్ణు, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, దర్శకత్వం: సుమన్ చిక్కాల.