Pawan Kalyan: ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దు - మూవీ రివ్యూయర్స్, పైరసీలపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్
OG Success Meet: ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దని... కళను అందరూ అభిమానించాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. 'OG' సక్సెస్ ఈవెంట్‌లో రివ్యూయర్స్, పైరసీ చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Pawan Kalyan Speech In OG Success Meet: కళకు ధ్వేషం ఉండకూడదని... ఫ్యాన్ వార్స్ ఆపేయాలంటూ తన అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులకు సూచించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'OG' సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన ప్రకాష్ రాజ్, ఫ్యాన్ వార్ ఇతర అంశాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
లవ్ వారిపై చూపించాలి
పాలిటిక్స్‌లోకి వెళ్లిన తర్వాత సినిమాలపై అంతగా ఆసక్తి చూపలేదని... అక్కడ సక్సెస్ సాధిస్తే మళ్లీ 'OG'తో సక్సెస్‌ను డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చూపించారని ప్రశంసించారు పవన్. 'OGను ఇంత రిసీవ్ చేసుకున్న అభిమానులకు థాంక్స్. మీ ప్రేమంతా నా కంటే కూడా సుజీత్, తమన్‌పైనే చూపించాలి. అందరి హీరోల అభిమానుల అందరినీ ప్రేమించాలి. కళను ప్రేమించాలి. ఏ లాంగ్వేజ్ హీరో కానీ అభిమానులు వారి కష్టం, వర్క్ ఎంజాయ్ చేయాలి.
Kannadigas : Tearing PK & other heroes Banners & creating language fanwars
— OG 🐉🚩 (@whencutt_2) October 1, 2025
Meanwhile @PawanKalyan reaction on #KantaraChapter1 BAN..
He always support Artists & Cinema no matter what !!!! pic.twitter.com/C8dmrOSR2P
ఇంకో హీరోను ఎవరైనా ధ్వేషిస్తున్నారంటే మనసు సరిగ్గా లేదని అర్థం. అందరి హీరోల అభిమానులతో పాటు నా అభిమానులకు కూడా అడ్వైజ్ ఏంటంటే స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. ఓ సినిమాకు ఎంత కష్టపడి పని చేస్తాం అనేది వర్క్ చేసే వారికే తెలుస్తుంది. ఫ్యాన్ వార్స్‌లో దయచేసి సినిమాను చంపెయ్యొద్దు. సినిమాకు షార్ట్ లైఫ్ అయిపోయింది. ప్రతీ ఒక్కరినీ, వారి కష్టాన్ని గుర్తించి ప్రశంసించాలి. అంతే తప్ప ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే ఎవరికీ మంచిది కాదు. ఇది నా రిక్వెస్ట్. అందరి హీరోలను, వారి అభిమానులను నేను గౌరవిస్తాను. మంచి సినిమాలు ఆహ్వానిద్దాం. ఆనందిద్దాం.' అని చెప్పారు.
రివ్యూయర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కానీ, యూ ట్యూబ్‌లో కానీ రివ్యూస్ ఇచ్చేస్తున్నారని ఇది సరి కాదని పవన్ అన్నారు. 'సినిమా బాగుందో లేదో ఫస్ట్ రెండున్నర గంటలు చూడాలి. అందరూ సినిమాను చూడడం మానేసి అందరూ రివ్యూయర్స్‌లా మారిపోయారు. ఈ కల్చర్ ఎక్కడో ఒక చోట పోవాలి. ఓ సినిమాను మూవీ టీం, ప్రొడ్యూసర్స్ ఎన్నో ఆశలతో కోట్లు పెట్టి తీస్తారు. హరిహర వీరమల్లుకు నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు.
అత్తారింటికి దారేది సినిమా రిలీజ్‌కు ముందే నెట్‌లో వచ్చేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?. 40, 50 కోట్లు వడ్డీలు కట్టాలి. ఎక్కడ నుంచి కడతాం. దాని డబ్బులు కాటమరాయుడు వరకూ కడుతూనే ఉన్నా. ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం. చూసేందుకు వెలుగులు, జిలుగులు ఉంటాయి. కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో ఎవరికీ తెలియదు. రివ్యూలు ఇచ్చే వారు ఆలోచించి చేయాలి. సినిమాను చంపెయ్యొద్దు. మీరు ఎంత మంది పొట్ట కొడుతున్నారో మీకు అర్థం కావడం లేదు. సినిమాను కక్ష కట్టి చంపేస్తే నిర్మాతలు వెనుకడుగు వేస్తారు. ఓ మూవీ తీయాలంటే ఎన్నో ఇబ్బందులు పడతాం. అలాంటి టైంలో OG నాకు బలాన్ని ఇచ్చింది.' అని చెప్పారు పవన్.





















