Bharateeyudu 2 Trailer: ఆఫీషియల్, 'భారతీయుడు 2' ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ - ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్!
Bharateeyudu 2 Trailer Release Date: లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ భారతీయుడు 2 మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది.
Bharateeyudu 2 Movie Trailer Release Date: విశ్వనటుడు కమల్ హాసన్, సన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'. హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోయిన్లు. అనౌన్స్‌మెంట్‌తోనే విపరీతమైన బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణకు ఎన్నో ఆటంకాల మధ్య పూర్తి చేసుకుంది. క్యాన్సల్ అవుతుందనుకున్న ఈ ప్రాజెక్ట్ తిరిగి పట్టాలెక్కించిన పూర్తి చేశారు. ఇక ఎట్టకేలకు మూవీ విడుదలకు రెడీ అయ్యింది. జూలై 12న 'భారతీయుడు 2'ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటన ఇచ్చేసారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు మూవీ టీం గట్టి ప్లాన్ చేసినట్టుంది. ఏకంగా ట్రైలర్‌తోనే ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. తాజాగా భారతీయుడు 2 ట్రైలర్ రలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసి అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది లైకా ప్రొడక్షన్. ముందు నుంచి ప్రచారంలో ఉన్న తేదీనే ఫైనల్ చేశారు. జూన్ 25న ట్రైలర్ గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. అన్ని భాషల్లో విడుదల కాబోతున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారని సమాచారం. కాగా ఇటీవల బయటకు వచ్చిన ఓ అప్‌డేట్ ప్రకారం.. భారతీయుడు 2 ట్రైలర్ సుమారు 2 నిమిషాలు 36 సెకన్ల నిడివి ఉందని టాక్. ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. నిజానికి శంకర్-కమల్ మూవీ అంటే బజ్ ఓ రేంజ్‌లో ఉండాలి.
Step into the grandeur with SENAPATHY! 🤞🏻🤩 The BHARATEEYUDU-2 🇮🇳 Trailer is releasing on June 25th, 2024. 🎬 Brace yourselves for the comeback. 🔥#Bharateeyudu2 🇮🇳 #Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @anirudhofficial #Siddharth @Rakulpreet @LycaProductions #Subaskaran… pic.twitter.com/PBXA1TnN0x
— Lyca Productions (@LycaProductions) June 23, 2024
కానీ భారతీయుడు 2లో విషయంలో అదేది కనిపించడం లేదు. కమల్ లుక్ పోస్టర్స్‌తో తప్పితే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆడియన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ కూడా పెద్దగా రెస్పాన్స్ అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ విషయంలో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. అసలు ఇది శంకర్ సినిమానేనా.. మూవీకి ఎలాంటి హైప్ లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్‌డేట్స్ విషయంలో శంకర్ ఎందుకు ఇలా పట్టినట్టు ఉంటున్నారంటూ అభిమానుల్లో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో వారంత ఖుష్ అవుతున్నారు. మరి థియేట్రికల్ ట్రైటర్ అయినా ఆడియన్స్, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవుతుందో లేదో చూడాలి. ఈ సినిమాలో.. హీరో సిద్దార్థతో పాటు ఎస్ జే సూర్య, బాబీ సింహ, ప్రియ భవాని శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని వంటి స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమా.. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రివీల్ చేసిన కీరవాణి