సీనియర్‌ నటి శోభన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

ఒకప్పుడు వెండితెరపై స్టార్‌ హీరోయిన్‌ అలరించారు

అంతేకాదు అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు

శోభన నటి మాత్రమే కాదు ప్రతిభవంతురాలైన క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా

నాగార్జున, వెంకటేష్‌, చిరింజీవి వంటి స్టార్‌ హీరోలతో నటించి అలరించారు

ఇక నటిగా శోభన రెండు సార్లు జాతీయ అవార్డు, ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు

సినిమాల్లో అందమైన హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదట

ఓ హీరోని ప్రేమించిన ఆమె అతడు నో చెప్పడంతో ఇక సింగిల్‌గానే ఉండిపోయిందని టాక్‌

ఇకపోతే శోభన దాదాపు 18 ఏళ్ల తర్వాత కల్కి సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే

చివరిగా శోభన 2006లో వచ్చిన ‘గేమ్‌’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత మరే సినిమా చేయలేదు