By: ABP Desam | Updated at : 28 Aug 2023 01:37 PM (IST)
Image Credit: OG team/Twitter
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే అప్‌డేట్ ఇచ్చింది ‘OG’ టీమ్. రొటీన్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఎందుకని అనుకున్నారో ఏమో.. ఏకంగా స్నీక్-పీక్‌తోనే థ్రిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ‘‘ఫస్ట్ లుక్ లేదు. ఆకలితో ఉన్న చిరుత కోసం సెప్టెంబరు 2 వరకు వేచి చూడండి’’ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో పవన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
పవన్ కళ్యాణ్ - సుజిత్ కాంబోలో ‘OG’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మూవీ టీమ్ మొదటి నుంచి ఫ్యాన్స్ కోసం ‘ఓజీ’పై ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫస్ట్ లుక్ కూడా త్వరలోనే వస్తుందని అంతా భావించారు. అయితే, ఇందుకు భిన్నంగా ‘ఓజీ’ టీమ్ స్పందించడం గమనార్హం. ఇటీవల రిలీజ్ చేసిన ఓ పోస్టర్‌లో పవర్ స్టార్ తన గ్యాంగ్‌తో ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ స్టైలిష్‌గా కనిపించారు. దీంతో నెక్ట్స్ అప్‌డేట్ కోసం ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
NO FIRST LOOK… Wanted to give an adrenaline rush with the visuals and BGM. 💥G.
— Suresh Kondeti (@santoshamsuresh) August 28, 2023
Let’s await for THE #HUNGRYCHEETAH ON SEPTEMBER 2nd. Get your screens and woofers ready. 🔥🔥 #TheyCallHimOG @DVVMovies @PawanKalyan @sujeethsign @priyankaamohan @MusicThaman pic.twitter.com/SBnEDw44I6
ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్‌గా ‘OG’ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత టైటిల్ మారుస్తారని అంతా భావించారు. అయితే, ‘OG’ టైటిలే బాగుందనే టాక్ రావడం, పవన్ ఫ్యాన్స్‌లో కూడా ‘ఓజీ’ టైటిల్‌పై ఆసక్తి చూపడంతో దాన్ని మార్చాలనే ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. ఈ సినిమాకి ‘దే కాల్ హిమ్ ఓజి’ (They Call Him OG) అనే టైటిల్‌నే ఫిక్స్ చేసినట్లు సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో కూడా ‘OG’ టైటిల్ ఉంది. పవర్ స్టార్ చేతిలో గన్ ఉంది. మరి, అదే టైటిల్ ఉంటుందా.. లేదా మార్చుతారా అనేది తెలియాలంటే సెప్టెంబరు 2 వరకు వెయిట్ చేయాల్సిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాతో గత శుక్రవారం(జూలై 28) ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి తేజ తో కలిసి పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే, ‘నెట్‌ఫ్లిక్స్’లో మాత్రం టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రభాస్‌తో 'సాహో' వంటి యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజిత్‌కు కూడా ఇప్పుడు ఒక హిట్ కావాలి. అతడి టేకింగ్ చాలా రిచ్‌గా ఉంటుంది. దీంతో ‘సాహో’ ఫ్లాపైనా, అతడి టేకింగ్‌పై ఉన్న నమ్మకంతో పవన్ ఆయనకు ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. అభిమానులు కూడా సుజీత్ తప్పకుండా పవర్ స్టార్‌ను ఇందులో పవర్‌ఫుల్‌గా చూపిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే సినిమా కోసం బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీ, కోలీవుడ్ నుంచి యంగ్ విలన్ అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి వంటి నటీ, నటులను కీలక పాత్రల కోసం తీసున్నారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Read Also: ‘భగవంత్ కేసరి’ సెట్‌లో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ, శ్రీలీలతో సీరియస్ డిస్కషన్ - పిక్ వైరల్
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి
AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు ! గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?
TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?
Breaking News Live Telugu Updates: బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్ విల్లా లడ్డూ
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
/body>