అన్వేషించండి

Month Of Madhu Trailer : ఇండియన్ భార్యాభర్తల మధ్యలో అమెరికన్ అమ్మాయి - నెలలో ఏమైంది మధు?

'కలర్స్' స్వాతి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మంత్ ఆఫ్ మధు'. రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూశారా?

నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి ('కలర్స్' స్వాతి) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మంత్ ఆఫ్ మధు' (Month Of Madhu Movie). అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రోగ్రాంలో ట్రైలర్ విడుదల చేశారు. సినిమా చూడాలనే ఆసక్తి ట్రైలర్ పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.  

అమెరికాలో ఇండియన్... ఇండియాలో అమెరికన్!
'మంత్ ఆఫ్ మధు' ట్రైలర్ లేదా కథ గురించి చెప్పాలంటే.... ముఖ్యంగా మూడు పాత్రల గురించి చెప్పాలి. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి భార్యాభర్తలుగా నటించారు. వాళ్ళను పక్కన పెడితే... శ్రేయా నవేలి మరో పాత్ర చేశారు. ఆమె పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్ మొదలైంది. 

అమెరికా నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిగా శ్రేయా నవేలి కనిపించారు. ఆమె తల్లి పాత్రను మహేష్ బాబు సోదరి మంజుల చేశారు. ''మధు... నువ్వు ఏం చేయాలో చెప్పను. ఒక్క వారం పద్దతిగా ఉండు'' అని ఆమె చెప్పే మాటతో ట్రైలర్ మొదలైంది. తర్వాత మంజులతో రుచితా సాధినేని ''మధును చూస్తే భయం వేస్తోంది. అక్కడ (అంటే అమెరికాలో) పెరిగింది కదా! కొద్దిగా ఫాస్టుగా ఉన్నా నీ భయానికి లైనులో ఉంటుందనుకున్నా. ఎవరితో ఏదైనా మాట్లాడేస్తుంది. తను ఆ లైన్ ఎప్పుడో క్రాస్ చేసింది'' అని చెబుతుంది. 

మంజుల, రుచిత సంభాషణ మధ్యలో మధు పాత్రను దర్శకుడు పరిచయం చేశారు. ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడే ఓ అమ్మాయిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు అనిపించింది. మీ శృంగార జీవితం ఎలా ఉందని ఓ అమ్మాయిని ప్రశ్నిస్తుంది. 'నేను బావున్నానా? నన్ను కూడా పెళ్లి చేసుకో' అని ఓ అబ్బాయిని అడుగుతుంది. దమ్ము కొడుతుంది. మందు తాగుతుంది. 

'తిండి మీద కంట్రోల్ లేదు. ఒంటి మీద ధ్యాస లేదు. నాకు సిగ్గేస్తుంది. నీ జన్మకు కారణం అయినందుకు' అని కుమార్తె మధు (శ్రియా నవేలి)ని తల్లి మంజుల తిడుతుంది. 'అమెరికాలో అందరూ నన్ను ఇండియన్ అని అనుకుంటున్నారు. ఇక్కడ అందరూ అమెరికన్ లా చూస్తున్నారు. నాకు ఇక్కడే ఉండాలని ఉంది. మనుషులను కలవాలని ఉంది. అర్థం చేసుకోవాలని ఉంది' అని శ్రేయ చెప్పే డైలాగ్ ఆమె పాత్ర స్వభావాన్ని తెలిపేలా ఉంది. అప్పుడు ఆమెకు తండ్రి ఓ నెల టైమ్ ఇస్తాడు. 

ముందుకు బానిసైన నవీన్ చంద్ర... 
భర్తను ప్రేమించే భార్యగా స్వాతి  రెడ్డి!
'మంత్ ఆఫ్ మధు' సినిమాలో మధు... మధుసూదన్ రావు పాత్రలో నవీన్ చంద్ర కనిపించారు. బాధతో మద్యానికి బానిసైన వ్యక్తిగా అతడిని చూపించారు. నవీన్ చంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పాత్రలో స్వాతి రెడ్డి కనిపించారు. వాళ్ళిద్దరి మధ్య కోర్టులో కేసు ఏమిటి? భర్తతో భార్య ఎందుకు అడ్జస్ట్ కాలేకపోయింది? మధు, మధుసూదన్ రావు మధ్య పరిచయం తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   

Also Read : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?

'మంత్ ఆఫ్ మధు' ట్రైలర్ ప్రత్యేకత ఏమిటంటే... ఏదో సినిమా ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ కలగదు. మన మధ్య పాత్రలను తెరపై చూసిన అనుభూతి కలుగుతుంది. అంత సహజంగా దర్శకుడు శ్రీకాంత్ నాగోతి పాత్రలను మలిచారు. ఎమోషనల్ & ఇంటెన్స్ ఫిల్మ్ అనేది అర్థం అవుతోంది. 

Also Read  నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!

విమర్శకుల ప్రశంసలు పొందిన 'భానుమతి & రామకృష్ణ' తర్వాత శ్రీకాంత్ నాగోతి రచన, దర్శకత్వంలో వస్తున్న సినిమా 'మంత్ ఆఫ్ మధు'. యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ సంస్థలపై సినిమా రూపొందింది. సుమంత్ దామ సహ నిర్మాత, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget