Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. అది రాజమౌళి సినిమా రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుందని నిర్మాత నాగవంశీ తెలిపారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్న హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం' (Guntur Karam Movie). సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అయితే... ఆల్రెడీ ఈ సినిమాపై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. వాటిని మరింత పెంచేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
రాజమౌళి రికార్డులకు దగ్గరగా కలెక్షన్స్!
తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ ఫిల్మ్ మేకర్లలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. మన సినిమాను ఆస్కార్ వరకు తీసుకు వెళ్లిన ఘనత ఆయనది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' ఉన్నాయి. రికార్డులు క్రియేట్ చేశాయి. రాజమౌళి రికార్డులకు దగ్గరలో 'గుంటూరు కారం' వసూళ్లు సాధిస్తుందని గతంలో నాగవంశీ తెలిపారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నారా? అని 'మ్యాడ్' సినిమా సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ఆయనను ప్రశ్నించగా... ''కచ్చితంగా! మాకు ఆ డౌట్ ఏమీ లేదు. జనవరి 12న థియేటర్లలో చూసి ఆ రోజు సాయంత్రం మీరే చెబుతారు'' అని సమాధానం ఇచ్చారు. త్రివిక్రమ్ మాస్ సినిమా తీస్తే... ఎలా ఉంటుందో 'గుంటూరు కారం'తో చూస్తారని ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విజయ దశమికి ముందు సాంగ్ అప్డేట్!
ఆల్రెడీ విడుదలైన 'గుంటూరు కారం' మాస్ స్ట్రైక్ (వీడియో గ్లింప్స్) ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. మహేష్ బాబు మాస్ అవతారం ఘట్టమనేని అభిమానులకు చాలా అంటే చాలా నచ్చింది. అయితే... వాళ్ళు ఫస్ట్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మహేష్ బర్త్ డేకు సాంగ్ వస్తుందని ఆశిస్తే... అప్పుడు పోస్టర్లు మాత్రమే వచ్చాయి. మరి, సాంగ్ ఎప్పుడు? అని అడిగితే... ''ఇంకా డేట్ ఏమీ అనుకోలేదు. అయితే... దసరాకు ముందు అప్డేట్ ఇస్తాం'' అని నాగవంశీ చెప్పారు. ఈ సినిమాకు ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
'అరవింద సమేత వీర రాఘవ', 'అల వైకుంఠపురములో' సినిమాల తర్వాత త్రివిక్రమ్, తమన్ కలయికలో వస్తున్న చిత్రమిది. గతంలో మహేష్ బాబుకు కూడా ఆయన సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఇప్పుడు 'గుంటూరు కారం' సినిమాకు కూడా సూపర్ డూపర్ ఆల్బమ్ ఇస్తున్నారని టాక్. ఆయనను సినిమా నుంచి తప్పిస్తున్నారని ఇంతకు ముందు వార్తలు వచ్చినప్పటికీ... అటువంటిది ఏమీ లేదని తమన్ క్లారిటీ ఇచ్చారు.
Also Read : విడాకుల ప్రశ్నకు 'కలర్స్' స్వాతి సమాధానం ఏమిటో తెలుసా? - వైరల్ స్టేట్మెంట్
మహేష్ సరసన శ్రీ లీల, మీనాక్షీ చౌదరి!
'గుంటూరు కారం'లో మహేష్ బాబు సరసన యంగ్ అండ్ క్రేజీ కథానాయికలు శ్రీ లీల, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. సూపర్ స్టార్ సినిమాలో వాళ్ళిద్దరికీ అవకాశం రావడం ఇదే తొలిసారి. దాంతో ఇద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial