By: Satya Pulagam | Updated at : 26 Sep 2023 02:20 PM (IST)
షారుఖ్ ఖాన్... 'సైంధవ్'లో శ్రద్ధా శ్రీనాథ్, వెంకటేష్... 'హాయ్ నాన్న'లో నాని, మృణాల్... 'ఎక్స్ట్రా'లో నితిన్, శ్రీ లీల... 'సలార్'లో ప్రభాస్
Salaar movie Release On December 22nd : డిసెంబర్ 22న 'సలార్' విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి 'ఈ డిసెంబర్ ఇంతకు ముందులా ఉండదు' అని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేయడంతో 'సలార్' విడుదలపై అందరికీ క్లారిటీ వచ్చింది.
డిసెంబర్ 22న 'సలార్' విడుదల వార్త తెలిసి హిందీ ఇండస్ట్రీ జనాలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ తేదీకి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'డంకీ' వస్తుందని, ఆ సినిమా విడుదల తేదీ ఎప్పుడో వెల్లడించారని పోస్టులు చేయడం స్టార్ట్ చేశారు. 'పఠాన్', 'జవాన్'... ఈ ఏడాది షారుఖ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొట్టినా, 'ఆదిపురుష్' ఫస్ట్ డే కలెక్షన్స్ (రూ. 135 కోట్లు) కంటే 'జవాన్' ఫస్ట్ డే కలెక్షన్స్ (రూ. 125 కోట్లు) తక్కువ. భారీ ఓపెనింగ్స్ సాధించే హీరోల సినిమాలు ఒకే రోజు రావడం మంచిది కాదని కొందరి అభిప్రాయం! పైగా, డిసెంబర్ 20న హాలీవుడ్ సినిమా 'ఆక్వా మ్యాన్' రిలీజ్ ఉంది. ఆ సినిమాకు మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఆదరణ ఉంటుంది.
ప్రభాస్ 'సలార్' వర్సెస్ షారుఖ్ ఖాన్ 'డంకీ' డిస్కషన్ ఎక్కువ జరుగుతోంది. పాన్ ఇండియా రిలీజులు కాబట్టి ఆ పోటీ గురించి చర్చకు రావడం కామన్. అయితే... 'సలార్' రిలీజ్ డేట్ న్యూస్ అందరి కంటే ఎక్కువ తెలుగు చిత్రసీమకు షాక్ ఇచ్చింది. ఆల్రెడీ క్రిస్మస్ సీజన్ మీద నాలుగు తెలుగు సినిమాలు కర్చీఫ్ వేశాయి. ఇప్పుడు 'సలార్' వస్తే... ఆ సినిమాలు ముందుకో, వెనక్కో వెళ్ళాలి.
ఇప్పుడు వెంకీ, నాని, నితిన్ పరిస్థితి ఏమిటి?
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'హాయ్ నాన్న'ను డిసెంబర్ 21న... వెంకటేష్ 'సైంధవ్', సుధీర్ బాబు 'హరోం హర' చిత్రాలను డిసెంబర్ 22న... నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'ను డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు గతంలో వెల్లడించారు. ఈ సినిమాలు అన్నిటినీ పాన్ ఇండియా రిలీజ్ చేయాలనేది ప్లాన్. ప్రభాస్ సినిమా ఉండగా... ఇతర భాషల ప్రేక్షకులు మరో తెలుగు హీరో సినిమాను పట్టించుకుంటారా? అనేది సందేహమే.
Also Read : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?
డిసెంబర్ 22న గనుక 'సలార్' వస్తే... ఆ రోజుకు ముందు, వెనుక మిగతా సినిమాలు రావడం కష్టం. మినిమమ్ మూడు సినిమాలు అయినా సరే వెనక్కి వెళ్ళాలి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకు 'సలార్' విడుదల తేదీ గురించి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అధికారికంగా చిత్ర బృందం నుంచి వచ్చే మాట కోసం క్రిస్మస్ సీజన్ మీద కన్నేసిన మిగతా హీరోలు, దర్శక - నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. 'సలార్'తో పాటు వస్తే బాక్సాఫీస్ బరిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం పెద్ద టాస్క్. హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లను మరో సినిమాతో పంచుకోవాలి.
Also Read : నవంబర్లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' పాయల్, అజయ్ భూపతి సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
తెలుగు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం... 'సలార్'తో పాటు ఓ సినిమా, తర్వాత సంక్రాంతికి మరో సినిమా, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఇంకో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఏది ఏమైనా సరే డైనోసార్ ముందు తమ సినిమాను నిలపడం మంచిది కాదని చాలా మంది నిర్మాతలు భావిస్తున్నారు. షారుఖ్ ఖాన్ 'డంకీ'ని వాయిదా వేస్తే బావుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు ఆశిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
Namo Movie: నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!
Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!
‘మంగళవారం’ ఓటీటీ స్ట్రీమింగ్, ‘బ్రహ్మాస్త్ర 2’ అప్డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Brahmanandam: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>