అన్వేషించండి

Monkey Man: ‘మంకీ మ్యాన్’ విడుదలకు ఇండియాలో అడ్డంకులు, అనుమతి ఇవ్వని సీబీఎఫ్‌సీ - అదే కారణమా?

Monkey Man: హాలీవుడ్‌లో హీరోగా పేరు తెచ్చుకున్న దేవ్ పటేల్.. మొదటిసారి డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన చిత్రమే ‘మంకీ మ్యాన్’. కానీ ఈ మూవీని ఇండియాలో విడుదల చేయడానికి సీబీఎఫ్‌సీ అనుమతి ఇవ్వలేదు.

Monkey Man Release Date In India: బ్రిటిష్ నటుడు దేవ్ పటేల్.. ఎక్కువగా ఇండియన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమాల్లోనే నటిస్తాడు. ఇప్పటికే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న దేవ్.. మొదటిసారిగా దర్శకుడిగా మారి ‘మంకీ మ్యాన్’ను తెరకెక్కించాడు. డైరెక్ట్ చేయడంతో పాటు తానే హీరోగా కూడా నటించాడు. ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ‘మంకీ మ్యాన్’ సిద్ధమయ్యింది. కానీ ఇండియాలో మాత్రం ఈ మూవీ రిలీజ్‌కు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఏప్రిల్ 19న ఈ సినిమాను ఇండియాలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నా.. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ దీనికి అడ్డుపడుతున్నట్టు సమాచారం.

సీబీఎఫ్‌సీ అడ్డు..

ఇండియాలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ‘మంకీ మ్యాన్’ విడుదలకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీలో క్రూరమైన హింసను చూపించారని, అభ్యంతరకమైన సీన్స్ కూడా ఉన్నాయని సీబీఎఫ్‌సీ చెప్తోంది. అంతే కాకుండా ఇందులో హిందూ పురాణాలకు, శాస్త్రాలకు సంబంధించిన ప్రస్తావన కూడా ఉందని, దాని కారణంగా కూడా ‘మంకీ మ్యాన్’ ఇండియన్ రిలీజ్‌కు సీబీఎఫ్‌సీ ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఏప్రిల్ 5న ‘మంకీ మ్యాన్’ విడుదలయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇండియాలో మాత్రమే ఈ మూవీ రిలీజ్ అవ్వకపోవడంతో దేవ్ పటేల్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

పోటీ వద్దని..

ఇండియాలో ఒక డబ్బింగ్ సినిమా విడుదల కావాలంటే ముందుగా ఇక్కడి సినిమాలతో క్లాష్ అవ్వకుండా చూస్తారు మేకర్స్. ప్రస్తుతం బాలీవుడ్‌లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ‘బడే మియా చోటే మియా’, అజయ్ దేవగన్ హీరోగా చేసిన ‘మైదాన్’లకు ‘మంకీ మ్యాన్’ పోటీగా రాకూడదు అనే ఉద్దేశ్యంతోనే దీనిని కావాలని వాయిదా పడేలా చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 19న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. సీబీఎఫ్‌సీ నుండి అనుమతి లేక ఆలస్యం అయ్యింది. దీంతో ఏప్రిల్ 26న ‘మంకీ మ్యాన్’ను థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.

ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్..

కొన్నాళ్ల క్రితమే ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో కథ సారాంశం ఏంటో స్పష్టంగా చూపించారు. కానీ సినిమాలో మాత్రం హిందుత్వాన్ని చాలా సున్నితంగా చూపించారని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. అంతే కాకుండా రాజకీయ పార్టీల అంశం వచ్చినప్పుడు అది బీజేపీని ఉద్దేశించినట్టుగా ఉందని సమాచారం. అందుకే సినిమాలో చూపించిన పార్టీ జెండాల రంగుల మార్చమని సీబీఎఫ్‌సీ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ‘మంకీ మ్యాన్’లోని ఆరెంజ్ పార్టీ జెండాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. మేకర్స్.. బీజేపీని ఉద్దేశించే ఇలా చేశారా అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పాలిటిక్స్‌కు సంబంధించి, హిందూ పురాణాలకు సంబంధించిన చాలావరకు సీన్స్, డైలాగ్స్ కట్ చేసిన తర్వాతే.. ‘మంకీ మ్యాన్’ ఇండియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: చిరు లీక్స్ - ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌పై మెగాస్టార్ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Embed widget