Kantara Chapter 1 Vs Sequels: రిషబ్ శెట్టి తెలివైన ఎత్తుగడ... రాజమౌళి, సుక్కు, నీల్ రూటులో వెళ్ళలేదు
Rishab Shetty's Kantara Chapter 1: పాన్ ఇండియా హిట్ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీసిన హిట్ కొట్టిన దర్శకుల లిస్టులో రిషబ్ శెట్టి కూడా చేరారు. అయితే ఆయన రాజమౌళి, సుక్కు, నీల్ రూటులో వెళ్ళలేదు.

ఈ ఏడాది (2025)లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో 'కాంతార ఛాప్టర్ 1' ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీయడం అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడంతో అంచనాలు ఉంటాయి. ఆ తర్వాత సినిమా తీసి మెప్పించడం సులువు కాదు. 'బాహుబలి 2', 'పుష్ప 2', 'కేజీఎఫ్ 2'... పాన్ ఇండియా లెవల్ సక్సెస్ సాధించిన సెకండ్ పార్ట్స్ ఇవే. ఇప్పుడు ఈ లిస్టులో 'కాంతార ఛాప్టర్ 1' కూడా చేరింది. అయితే... ఈ సినిమా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే...
మౌళి, నీల్, సుక్కు రూటులో రిషబ్ వెళ్ళలేదు!
How Kantara Chapter 1 is different from Baahubali 2, Pushpa 2 And KGF 2: 'బాహుబలి 2' దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, 'పుష్ప 2' దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి, 'కేజీఎఫ్ 2' దర్శకుడు ప్రశాంత్ నీల్ రూటులో 'కాంతార ఛాప్టర్ 1' దర్శకుడు, కథానాయకుడు రిషబ్ శెట్టి వెళ్ళలేదు.
'బాహుబలి 2', 'పుష్ప 2', 'కేజీఎఫ్ 2' సినిమాలు గమనిస్తే... మొదటి పార్టులో ఉన్న క్యారెక్టర్లు రెండో పార్టులో కంటిన్యూ అయ్యాయి. హీరోలు, విలన్లు వాళ్లే. కథ కూడా మొదటి పార్టు నుంచి కంటిన్యూ అయ్యింది. కొత్త విలన్లు యాడ్ అయినా పాత విలన్లు సైతం ఉన్నారు. మొదటి పార్టును మించి కథ, కథనాల్లో ప్రత్యేకత చూపించారు. అయితే... 'కాంతార'కు, 'కాంతార ఛాప్టర్ 1'కు చాలా డిఫరెన్స్ ఉంది.
Also Read: అప్పుడు జైలర్, ఇప్పుడు కాంతార ఛాప్టర్ 1... బాలయ్య మార్క్ సెలక్షన్
మొదటి పార్టుతో ప్రీక్వెల్ 'కాంతార ఛాప్టర్ 1' కథకు సంబంధం లేదు. అందువల్ల, మొదటి పది పదిహేను నిమిషాల్లో కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్ళడానికి రిషబ్ శెట్టికి సులువు అయ్యింది. కొత్త కథ, కొత్త క్యారెక్టర్లు కనుక కథనం కాస్త నెమ్మదిగా నడిచినా ప్రేక్షకులు క్షమించారు. మొదటి పార్టుతో సంబంధం లేకుండా సినిమా చూశారు.
ఇప్పటి వరకు పాన్ ఇండియా హిట్స్ అన్నిటికీ సీక్వెల్స్ వచ్చాయి. 'కాంతార'ది మాత్రం ప్రీక్వెల్. అందులోనూ క్యారెక్టర్స్ పరంగా ఎటువంటి సంబంధం లేకుండా కొత్త క్యారెక్టర్లు తీసుకుని చేశారు. అయితే... థీమ్ మాత్రం ఒక్కటే. 'కాంతార'లో ఉన్న దైవ కోలా ప్రతి పార్టులో కామన్ పాయింట్ అని అర్థం అవుతోంది. సో... ఈ రూటులో వెళితే కొత్త కథలతో ఎన్ని సినిమాలు అయినా చేసుకోవచ్చు. సీక్వెల్స్ విషయంలో అన్నీ హిట్ అయ్యాయని చెప్పడానికి లేదు. బోల్తా కొట్టినవి కొన్ని ఉన్నాయి. అయితే... రెబల్ స్టార్ ప్రభాస్ రెండు సీక్వెల్స్ చేయాల్సి ఉంది. 'సలార్ 2', 'కల్కి 2898 ఏడీ 2' చేయాలి. దీపికా పదుకోన్ డిమాండ్స్ వల్ల ఆమెను తప్పించిన సంగతి తెలిసిందే. దాంతో 'కల్కి 2' షూట్ కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది.
Also Read: ఇండియాలో అదరగొట్టిన కాంతార ఛాప్టర్ 1... రిషబ్ శెట్టి సినిమాకు ఫస్ట్ డే నెట్ కలెక్షన్స్ ఎంతంటే?





















