Kantara 2 Budget : ‘కాంతార 2’ బడ్జెట్ అంతా? 16 కోట్లు ఎక్కడ, ఇప్పుడు ఖర్చు పెడుతున్నది ఎంత?
‘కాంతార’ మూవీ ముందుగా కేవలం కన్నడ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది. అక్కడే ముందుగా విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ అందుకుంది.
ఒక సినిమాకు ప్రమోషన్స్ చేసి, అది అందరి దృష్టికి తీసుకెళ్లి, హైప్ క్రియేట్ చేసి హిట్ కొట్టడం కంటే కేవలం మౌత్ టాక్‌తో హిట్ అయితే ఆ కిక్కే వేరప్ప. ఇటీవల కాలంలో అలాంటి ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కొన్ని సినిమాలు అయితే కేవలం రీజనల్ భాషల్లో విడుదలయ్యి... అక్కడ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో వేరే భాషల్లో డబ్ అయ్యాయి. అలాంటి వాటిలో గతేడాది విడుదలయిన ‘కాంతార’ కూడా ఒకటి. ‘కాంతార’ను లిమిటెడ్ బడ్జెట్‌లో చేసినా... అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ ఉండేలా చూసుకున్నాడు మేకర్ రిషబ్ శెట్టి. కానీ ‘కాంతార 2’ మాత్రం అలా కాదట. దీని బడ్జెట్ లెక్కలు చూస్తుంటే... ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
లిమిట్ దాటిన బడ్జెట్..
‘కాంతార’ మూవీ ముందుగా కేవలం కన్నడ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది. అక్కడే ముందుగా విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ అందుకుంది. పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేయాలన్న ఆలోచన అసలు రిషబ్ శెట్టికి లేదు. అయినా కూడా ఇతర భాషా మేకర్స్... ఈ మూవీని చూసి ఇష్టపడి ఎన్నో కోట్లు పెట్టి కొనుకున్నారు. అలా డబ్ అయిన ప్రతీ భాషలో కూడా మూవీ సూపర్ హిట్ అందుకుంది. దీంతో ‘కాంతార’కు రెండో భాగం ఉంది అని తెలియగానే ప్రేక్షకుల్లో ఆటోమేటిక్‌గా అంచనాలు పెరిగిపోయాయి. అందుకే దీనిని భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా వైజ్‌గా విడుదల చేయాలని రిషబ్ శెట్టి నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ‘కాంతార 2’ బడ్జెట్ రూ.125 కోట్లు అని టాక్.. శాండిల్‌వుడ్ ప్రేక్షకులను సైతం ఈ బడ్జెట్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బడ్జెట్ తక్కువ.. కలెక్షన్స్ ఎక్కువ..
‘కాంతార’కు అయిన బడ్జెట్ కేవలం రూ.16 కోట్లు మాత్రమే. కానీ, దాని వల్ల రెండో భాగానికి పెరిగిన అంచనాలు... బడ్జెట్‌ను కూడా పెంచేస్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్‌కు ‘కాంతార 2’ను భారీ స్థాయిలో తెరకెక్కించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. రూ. 16 కోట్లతో తెరకెక్కించిన మొదటి భాగం మొత్తంగా రూ. 450 కెట్లను కలెక్ట్ చేసింది. కేవలం సినిమా రంగంలోనే కాదు... రాజకీయ పరంగా కూడా ‘కాంతార’ ఎన్నో అభినందలను అందుకుంది. యూనియన్ మినిస్టర్ అనురాగ్ థాకూర్.. రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార’ గురించి పార్లమెంటులో కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. మన ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా గుర్తింపు అందుకుంటున్నాయో చెప్పడానికి ‘కాంతార’నే ఉదాహరణ అన్నారు.
ప్రీ ప్రొడక్షన్ కోసం స్పెషల్ కేర్..
నిజానికి ‘కాంతార 2’ అనేది ‘కాంతార’కు సీక్వెల్ కాదు... ఇది ఒక ప్రీక్వెల్. ఇప్పటి వరకు సినిమాల్లో విడుదలయ్యింది, ప్రేక్షకులు ఆదరించింది, బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకుంది అంతా రెండో భాగమని, దీనికి మొదటి భాగాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ‘కాంతార’ సక్సెస్ ఈవెంట్స్‌లో రిషబ్ శెట్టి బయటపెట్టాడు. ఇందులో ‘కాంతార’కు ప్రీక్వెల్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. వచ్చే ఏడాది ‘కాంతార 2’తో కచ్చితంగా మీ ముందుకు వస్తానంటూ ‘కాంతార’ 100 రోజుల సెలబ్రేషన్స్‌లో రిషబ్ శెట్టి మాటిచ్చాడు. అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘కాంతార 2’ అనౌన్స్‌మెంట్ జరిగింది. భారీ బడ్జెట్2తో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో.. ప్రీ ప్రొడక్షన్ పనుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది టీమ్. అందుకే 2023 నవంబర్ నుండి పక్కా ప్లానింగ్‌తో ‘కాంతార 2’ షూటింగ్ ప్రారంభం కానుంది.
Also Read: పెళ్ళిళ్లలో డ్యాన్సులు చేసేదాన్ని, ‘బేబీ’ క్లైమాక్స్‌లో నిజంగా ఏడ్చేశా: వైష్ణవి చైతన్య
Join Us on Telegram: https://t.me/abpdesamofficial