అన్వేషించండి

Vaishnavi Chaitanya: పెళ్ళిళ్లలో డ్యాన్సులు చేసేదాన్ని, ‘బేబీ’ క్లైమాక్స్‌లో నిజంగా ఏడ్చేశా: వైష్ణవి చైతన్య

'బేబీ' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది.

షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తో ఈమె నటించిన 'బేబీ' సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా సినిమాలో వైష్ణవి తన యాక్టింగ్ తో అందరి చేత ప్రశంసలు అందుకుంది. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి అగ్ర తారలే ఈ తెలుగు అమ్మాయి నటనకి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం 'బేబీ' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న వైష్ణవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

ఈ ప్రోమోలో 'బేబీ' విషయాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలను పంచుకుంది. తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా ఉండవు అనే భయం ఎప్పుడైనా కలిగిందా? అని యాంకర్ అడగ్గా.. "ముందు మనం ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా.. అవకాశం వస్తుందా రాదా అనేది. వాళ్లు వీళ్లు చెప్పారని ట్రై చేయకుండా ఉంటే ఎలా? కానీ ట్రై చేస్తే రాదు అనేది ఏదీ లేదు" అంటూ చెప్పింది. తాను యూట్యూబ్లో వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా సరైన ప్లేస్ ఉండేది కాదని వైష్ణవి తెలిపింది. అక్కడున్న  వాష్ రూమ్స్ కెళ్ళి కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకునేదాన్ని అని పేర్కొంది. ‘‘అది మా అమ్మ చూసి, అసలు ఎందుకు చేస్తున్నావ్ ఇలా? వదిలేసేయ్ ఇవన్నీ అని చెప్తూ ఏడ్చేసింది’’ అని తన జర్నీ గురించి చెప్పింది.

"ఓ మూవీలో చిన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు మనకి కారవాన్స్ లాంటివి ఏవి ఉండవు. ఆ సమయంలో నేను రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవాలి. అప్పుడు పెద్ద ఆర్టిస్టులు ఎవరుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్లి, మేడం మీ రెస్టు రూమ్ యూజ్ చేసుకోవచ్చా? అని అడిగినప్పుడు వాళ్లు అవమానించారు. నేను కెరీర్ స్టార్ట్ చేయకముందు 10th క్లాస్ లోనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నా. అప్పుడు కుటుంబాన్ని పోషించడానికి బర్తడే ఫంక్షన్స్, పెళ్లిళ్లు, ఈవెంట్స్ లో డాన్స్ చేసేదాన్ని. అలా ఒక రోజు మొత్తం డాన్స్ చేస్తే నాకు 700 రూపాయలు ఇచ్చేవారు. అది తీసుకెళ్లి మా అమ్మకు ఇస్తే మా అమ్మ ఏడ్చేసింది" అంటూ తన కుటుంబ పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది.

సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు మీ పేరెంట్స్ తో ముందే మాట్లాడుకున్నారా? అని వైష్ణవిని యాంకర్ అడగ్గా.." అసలు షూటింగ్లో ఇబ్బంది అనే సిచువేషన్ ఏం లేకుండా సీన్ అంతా కంప్లీట్ చేశాను. అవన్నీ మా పేరెంట్స్ కి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. నిజానికి అలాంటి సీన్స్ చేయాలంటే చాలా కష్టం. కానీ అది నా జాబ్. కాబట్టి చేయాలి" అని తెలిపింది. బేబీ సినిమాలో ఎమోషన్స్ సీన్స్ చేసినప్పుడు గ్లిజరిన్ వాడరా? లేక నిజంగానే ఏడ్చారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.." క్లైమాక్స్ సీన్ లో నేను గ్లిజరిన్ తీసుకోలేదు. మ్యూజిక్ పెట్టమని డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేశా. మ్యూజిక్ స్టార్ట్ అయింది నా పక్కనే ఆనంద్ అలా నిలబడడాన్ని చూసి నిజంగా ఏడ్చేశా" అని చెప్పింది.

ఇక సక్సెస్ మీట్ లో ఆడియన్స్ అరుపులు, కేకలు వింటుంటే షాక్ అయ్యాను. వీళ్లంతా నన్ను పొగుడుతున్నారా? తిడుతున్నారా అనే డౌట్ కూడా వచ్చింది. ఆ సమయంలో నీ జర్నీ నువ్వు స్టార్ట్ చేయచ్చు అనే కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది" అంటూ చెప్పుకొచ్చింది. అయితే వైష్ణవి చైతన్య ఇంటర్వ్యూ ప్రోమో చూసిన కొందరు నెటీజన్లు 'ఆ ఇంటర్వ్యూలో వైష్ణవి తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడటంపై కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆమె అలా మాట్లాడేది కాదని, కావాలనే అలా మాట్లాడుతోందని అంటున్నారు. ఆమె ఫేక్ తెలంగాణ స్లాంగ్ వాడుతోందని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : నన్ను అర్థం చేసుకునేవారు దొరికారు అంటున్న సమంత - ఇంతకీ ఎవరా వ్యక్తి?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget