అన్వేషించండి

Samantha: నన్ను అర్థం చేసుకునేవారు దొరికారు అంటున్న సమంత - ఇంతకీ ఎవరా వ్యక్తి?

సమంత ప్రస్తుతం న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడ ఓ పార్కుకి వెళ్లిన సామ్ వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లిన సమంత ఈనెల 20న అక్కడ నిర్వహించిన 'ఇండియా డే పెరేడ్’లో పాల్గొంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇక పెరేడ్ తర్వాత అక్కడే ఉంటూ న్యూయార్క్ నగరాన్ని చుట్టేసింది. న్యూయార్క్ లో ఉన్న పర్యాటక ప్రదేశాలకు వెళ్తూ అక్కడి అందాలను ఆస్వాదించడంతోపాటు వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత న్యూయార్క్ లోని ఓ పార్కుకు వెళ్ళింది. అక్కడ కాసేపు వాకింగ్ చేస్తూ ప్రకృతి ఒడిలోనే సేద తీరింది.

అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ఉదయం ఇలా ఉండాలి. నాకు నచ్చిన ప్రదేశం ఇది" అంటూ రాసుకొచ్చింది. అలా న్యూయార్క్ అందాలను ఆస్వాదిస్తున్న సమంతకు కాఫీ కరువైందట. సమంతకు కాఫీ అంటే చాలా ఇష్టం. రోజుకి ఎన్ని సార్లైనా కాఫీ తాగుతుంది. కానీ న్యూయార్క్ పర్యటనలో ఆమెకు కాఫీ కరువైపోయింది. ఎక్కడికి వెళ్లినా చిన్న కప్పులో కాఫీ ఇస్తున్నారు. అది సమంతకు సరిపోవటం లేదేమో, తాజాగా ఆమెకు ఎవరో జంబో సైజు కాఫీ ఇచ్చారు. దీంతో ఆనందంతో వెలిగిపోయిన సమంత.. ‘‘మొత్తానికి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు దొరికారు’’ అంటూ కాఫీ చేతిలో పట్టుకున్న ఫోటోని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. మరి సమంత మనసుని అర్థం చేసుకుని ఆమెకు జంబో గ్లాస్ లో కాఫీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అయితే సామ్ కూడా ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచింది.

ఇదిలా ఉంటే ఇటీవల సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పండిన విషయం తెలిసిందే కదా. ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స కోసం కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆరోగ్యం కాస్త కుదుటపటడంతో పెండింగ్లో ఉన్న 'ఖుషి', 'సిటాడెల్' షూటింగ్స్ ని పూర్తి చేసింది. వీటి తర్వాత మరే ప్రాజెక్టుకు సమంత సైన్ చేయలేదు. ఓ ఏడాది పాటు సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రీసెంట్గా సమంత తన ఖుషి మూవీ కి సంబంధించి ఓ మ్యూజికల్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ తో కలిసి స్టేజ్ పై డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఖుషి ప్రమోషన్స్ లో పాల్గొనలేదు.

తన ఆరోగ్యం బాలేదని , ప్రమోషన్స్ కి రాలేనని మూవీ టీమ్ కి చెప్పిందట. కానీ ఇప్పుడు మాత్రం న్యూయార్క్ లో వెకేషన్ అంటూ ఎంజాయ్ చేస్తోంది. ఇదే విషయంలో సమంతను నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కి రమ్మంటే, ఆరోగ్యం బాలేదని చెప్పి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నావా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన 'ఖుషి' సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Also Read : 'టిల్లు స్క్వేర్'లో రాధిక ఎంట్రీ - సిద్దుకు ఊహించని ట్విస్ట్ ఇస్తుందట!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vrushakarma Review : వృషకర్మ ఫస్ట్ రివ్యూ - క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్... నాగచైతన్య ఏం చెప్పారంటే?
వృషకర్మ ఫస్ట్ రివ్యూ - క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్... నాగచైతన్య ఏం చెప్పారంటే?
Mrithyunjay First Review : మృత్యుంజయ్ ఫస్ట్ రివ్యూ - శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
మృత్యుంజయ్ ఫస్ట్ రివ్యూ - శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Rai Rai Raa Raa Song Lyrics : ట్రెండింగ్‌లో రయ్ రయ్ రా రా - చెర్రీ ఎనర్జిటికల్ స్టెప్స్ విత్ మాస్ ఫిలాసిఫికల్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రయ్ రయ్ రా రా - చెర్రీ ఎనర్జిటికల్ స్టెప్స్ విత్ మాస్ ఫిలాసిఫికల్ లిరిక్స్

వీడియోలు

South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Embed widget