Kanguva Box Office Day 1 Prediction: ‘కంగువ’ ఓపెనింగ్ కలెక్షన్స్ ‘భారతీయుడు 2’ను దాటేనా? బాక్సాఫీస్ అంచనాలు ఏం చెప్తున్నాయంటే?
భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కంగువ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ పై ట్రేడ్ వర్గాలు ఆసక్తికర అంచనాలు వేస్తున్నాయి.
Kanguva Day 1 Collection Prediction: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘కంగువ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సినిమా పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు బాలీవుడ్ స్టార్స్ దిశా పటానీ, బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించడంతో నార్త్ లోనూ ఈ సినిమాకు మాంచి క్రేజ్ ఉంటుందని భావించారు. కానీ, ఈ సినిమా విడుదలయ్యాక అంచనాలు తారుమారు అవుతున్నాయి. తొలి షో నుంచే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మౌత్ టాక్ సినిమాపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ట్రేడ్ వర్గాలు కీలక అంచనాలు వేస్తున్నాయి.
తమిళనాడు మినహా, ఇతర రాష్ట్రాల్లో అంతంత మాత్రమే!
రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అదే స్థాయిలో వసూళ్లు సాధించాలంటే గ్రౌండ్ లెవెల్ లో మంచి బజ్ అవసరం. కానీ, సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి అనుకున్న స్థాయిలో సక్సెస్ టాక్ రావట్లేదు. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ బాగానే ఉంది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ. 10 కోట్లు వసూళు అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకు అవి చాలా తక్కువే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సూర్య సొంత రాష్ట్రం తమిళనాడులో ‘కంగువ’ సినిమా భారీ స్థాయిలో విడుదల అయ్యింది. అయినప్పటికీ, అక్కడ శివకార్తికేయన్ ‘అమరన్’ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ సినిమా ఆధిపత్యం చెలాయించలేకపోయింది. ‘అమరన్’ సినిమా కారణంగా ఈ సినిమాకు ప్రతికూల పరిస్థితి ఎదురయ్యింది. తమిళనాడు తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ సినిబా బాగానే ఆడుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పోల్చితే, కేరళ, కర్ణాటకలో కాస్త తక్కువగానే ఆదరణ ఉంది. నార్త్ లో కూడా ఈ చిత్రానికి అంతంత మాత్రంగానే ఆదరణ లభిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తొలి రోజు కలెక్షన్స్ అంచనా ఎంతంటే?
మొత్తం మీద ‘కంగువ’ ఇండియన్ భాక్సాఫీస్ దగ్గర తొలి రోజు రూ.22 కోట్ల నుంచి రూ. 25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ నాడులో ఈ సినిమా రూ. 14 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’తో పోల్చితే తక్కువగానే వసూళ్లు సాధించే అవకాశం ఉంది. కమల్ మూవీ తొలి రోజు రూ. 26 కోట్లు వసూళు చేసింది.
2024లో కోలీవుడ్ టాప్ ఓపెనర్లు
⦿ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ – రూ. 45 కోట్లు
⦿ వెట్టయన్ – రూ. 32 కోట్లు
⦿ భారతీయుడు 2 – రూ. 26 కోట్లు
⦿ అమరన్ – రూ. 21.80 కోట్లు
⦿ రాయన్ – రూ. 13.70 కోట్లు
Read Also: మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?