Mr Bachchan: 'మిస్టర్ బచ్చన్'లో ఒరిజినల్ రవితేజ - ఆ రోల్, మూవీపై దర్శకుడు హరీష్ శంకర్ రివ్యూ ఏమిటంటే?
Harish Shankar On Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'మిస్టర్ బచ్చన్'లో ఏం ఉంటుంది? అనేది దర్శకుడు స్వయంగా చెప్పారు. అవి ఏమిటో ఆయన మాటల్లో...
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan Movie). దీనికి హరీష్ శంకర్ దర్శకుడు. ఇంతకు ముందు రవితేజతో 'మిరపకాయ్' వంటి సూపర్ హిట్ సినిమా తీశారు. వాళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆగస్టు 15న 'మిస్టర్ బచ్చన్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుంది? అందులో ఏముంది? అనేది దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా చెప్పారు.
ఒరిజినల్ రవితేజను మిస్ అవుతున్నా! కానీ...
Harish Shankar On Ravi Teja Role In Mr Bachchan: రవితేజ అభిమానిగా 'మిస్టర్ బచ్చన్' సినిమా తీశానని దర్శకుడు హరీష్ శంకర్ పేర్కొన్నారు. ''ప్రేక్షకులు నా సినిమా నుంచి ఆశించే అంశాలు అన్నీ 'మిస్టర్ బచ్చన్'లో ఉంటాయి. హండ్రెడ్ పర్సెంట్ పక్కా అది! ఓ అభిమానిగా గత నాలుగైదు సినిమాల నుంచి ఒరిజినల్ రవితేజను మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉంది నాలో! ఈ సినిమాలో ఆ ఒరిజినల్ రవితేజను చూస్తారు. ఆయన నుంచి ప్రేక్షకులు ఏయే అంశాలు ఆశిస్తారో అవన్నీ ఉంటాయి'' అని హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆర్కెస్ట్రాలో పని చేసే రవితేజ... రీమిక్స్ అందుకే చేయలేదు!
Ravi Teja Character In Mr Bachchan Revealed: 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'వెల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్ రీమిక్స్ చేశారు హరీష్ శంకర్. 'సుబ్రమణ్యం ఫర్ సేల్'లో 'గువ్వా గోరింకా'తో రీమిక్స్ చేశారు. 'మిస్టర్ బచ్చన్' బ్యాక్ డ్రాప్ 85 నుంచి 90 వరకు ఉండటంతో పాత సినిమాల సాంగ్స్ చాలా వినిపిస్తాయని, అందుకే ఈ సినిమాలో రీమిక్స్ చేయలేదని హరీష్ శంకర్ తెలిపారు.
హిందీ సినిమా 'రైడ్' స్ఫూర్తితో, అందులో మెయిన్ పాయింట్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టు పలు మార్పులు, చేర్పులు చేసి హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' తెరకెక్కించారు. హిందీ సినిమా సీరియస్ టెంపోలో సాగితే... 'మిస్టర్ బచ్చన్' చాలా వినోదాత్మకంగా ఉంటుందని వివరించారు. రవితేజ క్యారెక్టర్ పరంగా కూడా చాలా మార్పులు ఉన్నాయని చెప్పారు. ఫస్టాఫ్ అంతా 'స్వామి రారా' సత్య కామెడీ హైలైట్ అయితే... సెకండాఫ్ వచ్చేసరికి 'చమ్మక్' చంద్ర కామెడీ బావుంటుందని చెప్పారు.
Also Read: చిరు, పవన్, చరణ్ కోసం కథ రాస్తున్న దర్శకుడు హరీష్ శంకర్... మెగా మల్టీస్టారర్ వర్కవుట్ అవుతుందా?
'మిస్టర్ బచ్చన్' టైటిల్ సూచించినది సైతం రవితేజ అని హరీష్ శంకర్ చెప్పారు. 'నామ్ తో సునా హోగా' క్యాప్షన్ అనుకున్నప్పుడు 'మిస్టర్ బచ్చన్' అయితే చాలా బావుంటుందని మాస్ మహారాజా చెప్పడంతో వెంటనే ఓకే చేశామన్నారు. కానీ, ఇప్పుడు ఆ క్యాప్షన్ లేదు అనుకోండి. 'మిరపకాయ్'కు తొలుత 'రొమాంటిక్ రిషి' అనుకోగా... రవితేజ చెప్పడంతో ఆ టైటిల్ ఫిక్స్ చేశామన్నారు. ఈసారి కూడా సెంటిమెంట్ కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Also Read: హరీష్ శంకర్ vs టాలీవుడ్ మీడియా... స్టార్టింగ్ to 'మిస్టర్ బచ్చన్' వరకు - ఏం జరిగిందో తెల్సా?