'Hanuman' Director Prasanth Varma: ఆ డైరెక్టర్ నన్ను దారుణంగా అవమానించాడు - ఆఫీసు బాయ్‌లా ట్రీట్ చేశాడు
Hanuman Director Prashanth Varma: ఓసారి రెకమండేషన్‌తో ఓ డైరెక్టర్ దగ్గరికి వెళ్లాను. అప్పుడాయన దారుణంగా అవమానించారు. ఆయనతో మాట్లాడిన రెండు నిమిషాలకే రేయ్ నీళ్లు తీసుకురారా? అన్నాడు.
Prasanth Varma ABout His Struggles: 'హనుమాన్' మూవీతో సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు యంగ్ టాలంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సూపర్ మ్యాన్ జానర్లో హనుమాన్ తెరకెక్కించి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోతుంది. ప్రశాంత్ వర్మ మేకింగ్‌కు ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు. అతడి పనితనాన్ని మెచ్చకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బరిలో పోటిగా మూడు అగ్ర హీరోల సినిమాలు ఉన్నప్పటికీ వాటిని వెనక్కి నెట్టుకుంటూ పోతుంది. రోజురోజుకు మూవీ కలెక్షన్లను, థియేటర్లను పెంచుకుంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది.
మొత్తానికి ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక్క తెలుగులోనే కాదు రిలీజైన మిగతా భాషల్లోనూ ఈ సినిమా షాకింగ్ రెస్సాన్స్ అందుకుంటోంది. బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంతటి బిగ్ హిట్ ఇచ్చిన ఈ టాలంటెడ్ డైరెక్టర్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. మూవీ సక్సెస్ నేపథ్యంలో ఓ చానల్‌తో ముచ్చటించిన ప్రశాంత్ వర్మ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఇంటర్య్వూలో ప్రారంభంలో అతడు ఎదర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
ఆఫీస్ బాయ్ కంటే దారుణంగా చూశాడు
ఇంజనీరింగ్ చదివిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ మీద ఉన్న ఇష్టంతో షార్ట్ ఫిలింస్ తీయడం ప్రారంభించానని చెప్పాడు. అతడు మాట్లాడుతూ.. "చదువుకుంటూనే షార్ట్ ఫిలింస్, డాక్యూమెంటరీలు తీశాను. ఇందులో సర్టిఫికెషన్లు కూడా అందుకున్నాను. వాటిని ఓ సూటుకేసులో పెట్టుకుని అస్టిస్టెంట్ డైరెక్టర్‌గా చాన్స్‌లు కోసం తిరిగాను. వెళ్లిన ప్రతి చోటుకి వాటిని తీసి చూపించేవాడిని. అవి చూసి వారు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేవారు. దీంతో వాటిని తీసుకువెళ్లేడిని కాదు. ఓసారి రెకమండేషన్‌తో ఓ డైరెక్టర్ దగ్గరికి వెళ్లాను.
అప్పుడాయన దారుణంగా అవమానించారు. ఆయనతో మాట్లాడిన రెండు నిమిషాలకే రేయ్ నీళ్లు తీసుకురారా? అన్నాడు. నేను ఆఫీసు బాయ్‌ని అన్నాడుకున్న. కానీ ఆ తర్వాత నన్నే చూస్తూ నికే రా చెప్పేది నీళ్లు తీసుకురా అన్నాడు. దీంతో వెంటనే కిచెన్‌లో నుంచి నెమ్మదిగా ఆఫీసు నుంచి వెళ్లిపోయాను.ఈ సంఘటన జరిగి తొమ్మిదేళ్లు అవుతుంది. కానీ ఇటీవల ఆయన సాయం కోసం నా దగ్గరికి వచ్చారు. కానీ నేను అదేది పెట్టుకొకుండా ఆయనకు కావాల్సిన సాయం చేసి పంపించాను. ఆయనకు నేను గుర్తులేను. నేను కూడా గతాన్ని తవ్వాలి అనుకోలేదు" అని చెప్పుకొచ్చారు.
ఇవన్ని వదిలేసి వెళ్లిపోదామనుకున్నా
"ఒకసారి ఓ స్టార్ డైరెక్టర్, నిర్మాత మాట్లాడుకుంటుంటే నేను వారికి కొంచం దూరంలో నిలబడి ఉన్నాను. అప్పుడు వారు నన్ను చూసి నీకు ఇక్కడ ఎంట్రా పని వెళ్లిపో అంటూ దారుణంగా తిట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తే నా భుజంపై చేయివేసి మా వాడే అంటూ అందరికి పరిచయం చేశాడు. ఇండస్ట్రీలో ఇది కామనే. కానీ ఈ సంఘటనలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ఇంట్లో ఒక్కమాట అనేవారు కాదు. ఎప్పుడు ఒక్కమాట పడని నేను ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో అవమానాలు పడ్డాను. ఒకానోక టైంలో ఇండస్ట్రీ నాకు సెట్ కాదు వెళ్లిపోదాం అనుకున్నా. కానీ మెల్లిమెల్లిగా నిలదొక్కుకున్నాను" అని చెప్పాడు.
Also Read: ‘బుక్ మై షో’పై ‘గుంటూరు కారం’ లీగల్ యాక్షన్ - ఫేక్ ఓట్లే కారణం!