Hanuman Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద 'హనుమాన్' దూకుడు.. అదుర్స్ అనిపిస్తున్న కలెక్షన్స్
Hanuman Movie Collections: బాలీవుడ్ అవైయిటెడ్ మూవీ 'ఫైటర్' విడుదలయ్యే వరకు హనుమాన్ దూకుడు ఇలాగే కొనసాగేలా ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
Hanuman Day 2 Collections: ఈ సంక్రాంతికి పోటీ పోటీగా నాలుగు సినిమాలు విడుదలై బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాయి. ఫస్ట్ వార్‌గా 'గుటూరు కారం', 'హనుమా'న్ వంటి భారీ చిత్రాలు విడుదలై దూసుకుపోతాయి. రివ్యూస్‌తో సంబంధం లేకుండ గుంటూరు కారం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సూపర్ మ్యాన్ జానర్లో వచ్చిన 'హనుమాన్' ఫస్ట్ షో నుంచే బ్లాక్‌బాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తక్కువ థియేటర్లోకి వచ్చిన 'హనుమాన్' మెల్లిమెల్లిగా థియేటర్ల ఆక్యూపెన్సీని పెంచుకుంది. ఇక కలెక్షన్స్ లోనూ రోజురోజుకు దూకుడు చూపిస్తుంది. మొదటి రోజు కంటే రెండోవ రోజు.. కలెక్షన్ల పెంచుకుంటూ పోతుంది. పాన్ ఇండియాగా పదకొండ భాషల్లో రిలీజైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకుంది.తెలుగులోనే కాదు ఇతర భాషల్లో హను-మాన్ భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద హనుమాన్ దూసుకుపోతుంది.
బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద 'హనుమాన్' దూకుడు
నిజానికి కంటెంట్ బాగుంటే హిందీ ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండ ఏ సినిమానైనా ఆదరిస్తారు. తాజాగా ఇది మరోసారి రుజువైంది. మన తెలుగు సినిమాలైన బాహుబలి, సాహో, కేజీఎఫ్, దసరా హిందీ వెర్షన్లు అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి. ఇప్పుడు హనుమాన్ హిందీ వెర్షన్ కూడా ఆ దిశగా పరుగులు తీస్తోంది. మొదటి రోజు కంటే రెండో రోజు ఈ సినిమా అక్కడ మరింత రెస్పాన్స్ దక్కించుకుంది. బి-టౌన్ బాక్సాఫీసు వద్ద హనుమాన్ ఫస్ట్‌డే కలెక్షన్స్ రూ. 2.15 కోట్ల గ్రాస్ ఉండగా.. రెండ రోజుకు 88 శాతం పుంచుకుని రూ. 4.05 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ పిండితుల నుంచి సమాచారం. మొత్తం రెండు రోజుల్లో హనుమాన్ హింది వెర్షన్ రూ. 6.2 కోట్ల నెట్‌కు చేరుకుంది. రెండో రోజు కంటే ఈరోజు (మూడో రోజు) వసూళ్లు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రజెంట్ బాలీవుడ్ అవైయిటెడ్ మూవీ ఫైటర్ విడుదలయ్యే వరకు హనుమాన్ దూకుడు కొనసాగేలా ఉందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాగే కొనసాగితే హనుమాన్ ఫైనల్ రన్‌లో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందంటున్నారు. ఇక వీకెండ్స్‌లో కూడా సినిమా ఇదే జోరును కొనసాగిస్తే మాత్రం రూ. 100 క్షబ్‌లో చేరడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా 'హనుమాన్' చిత్రం విడుదలై మూడు రోజులవుతున్న ఇప్పటివరకు ఏ ఒక్క నెగిటివ్ రివ్యూ వినిపించలేదు. ఇందంతా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన అద్భుతమే. విడుదలైన ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా ఫస్ట్‌డే రూ. 21 కోట్ల కలెక్షన్లు రాబట్టింది
ఇక సెకండ్ డే కూడా ఆడియన్స్ ఆకట్టుకుని రూ. 12.45 కోట్లు రాబట్టిందని సమాచారం. ఇక మూడవ రోజు కూడా హనుమాన్ వసూళ్లలో అదే జోరు కనబరుస్తోంది రానున్న రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించడం ఖాయమంటున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్‌లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టేకింగ్, మేకింగ్ స్టైల్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి అతడిపైనే ఉంది. అంతా ఇప్పుడు ప్రశాంత్ వర్మ గురించే మాట్లాడుకుంటున్నారు. అది కూడా గుంటూరు కారం వంటి పెద్ద సినిమాకు పోటీ పడి మరి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం విశేషం. ఈ దెబ్బకు స్టార్ హీరోలు ప్రశాంత్ వర్మ అప్రోచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రి వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.
Also Read: నాగార్జున 'నా సామి రంగ' ఓటీటీ పార్ట్‌నర్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..