News
News
X

Gopichand First Look Ramabanam : 'రామ బాణం'లో విక్కీగా దూసుకొస్తున్న గోపీచంద్ - ఫస్ట్ లుక్, గ్లింప్స్ చూశారా? యాక్షన్ గురూ!

Gopichand first look Ramabanam : గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'రామ బాణం'. మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు

FOLLOW US: 
Share:

మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీవాస్ (Sriwass) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'రామ బాణం'.  'లక్ష్యం', 'లౌక్యం' వంటి విజయాల తర్వాత హీరో, దర్శకుడి కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది. ఈ రోజు సినిమాలో గోపీచంద్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
 
విక్కీగా గోపీచంద్!
'రామ బాణం'లో విక్కీ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ రోజు ఆయన క్యారెక్టర్ ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. యాక్షన్ ఎపిసోడ్ నుంచి ఈ స్టిల్ విడుదల చేసినట్లు అర్థం అవుతోంది. గోపీచంద్ (Gopichand Ramabanam First Look)కు యాక్షన్ హీరో ఇమేజ్ ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని శ్రీవాస్ మాంచి యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేసినట్లు ఉన్నారు.
 
''భావోద్వేగం ధైర్యంగా మారితే? ఆవేశంతో విక్కీ వచ్చేస్తాడు'' అని చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్ గ్లింప్స్ చూస్తే... యాక్షన్ ఎపిసోడ్స్ లో షాట్స్ బావున్నాయి. గోపీచంద్ లుక్ స్టయిలిష్ గా ఉంది.

Also Read : ఎర్ర చీర కట్టి, గన్ను పట్టి 'అమ్మోరు'లా మారిన అందాల రాక్షసి

View this post on Instagram
 
A post shared by People Media Factory (@peoplemediafactory)

ఇది గోపీచంద్ 30వ సినిమా. 'కార్తికేయ 2', 'ధమాకా' సినిమాలతో విజయాలు అందుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న తాజా చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రానికే నట సింహం బాలకృష్ణ 'రామ బాణం' టైటిల్ ఖరారు చేసింది. అన్నట్టు... ఆయన హీరోగా నటించిన 'డిక్టేటర్' సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించారు.   

Also Read 'శ్రీదేవి శోభన్ బాబు' రివ్యూ : చిరంజీవి కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?  

'రామ బాణం' సినిమాలో గోపిచంద్ సరసన కథానాయికగా డింపుల్ హయతి నటిస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.  

సంక్రాంతికి టైటిల్ వెల్లడి!
'జయం', 'నిజం', 'వర్షం'... గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించిన మూడు సినిమాల్లో చివర 'అం' ఉంది. ఆ సినిమాలు పక్కన పెడితే... కథానాయకుడిగా చేసిన 'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం', 'శౌర్యం', 'శంఖం', 'సాహసం', 'లౌక్యం', 'సౌఖ్యం', 'పంతం' ఉన్నాయి. ఎక్కడో ఒకటి అరా తప్పిస్తే మిగతా సినిమాలు అన్నీ హిట్టే. 

'అన్‌స్టాపబుల్‌ 2' టాక్ షోలో ఆ సెంటిమెంట్ ప్రకారం, అక్షర బలం కూడా చూసి గోపీచంద్ కొత్త సినిమాకు బాలకృష్ణ టైటిల్ పెట్టారు. 'రామ బాణం' అని చెప్పారు. ఇప్పుడు సినిమాకు అదే టైటిల్ ఖరారు చేశారు. 

''ఎదురే లేని టైటిల్... గోపీచంద్ 30వ సినిమాకు 'రామ బాణం' టైటిల్ ఖరారు చేశాం. 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కలయికలో హ్యాట్రిక్ సినిమా ఇది'' అని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పేర్కొంది.   ఒక్కసారి 'అన్‌స్టాపబుల్‌ 2' షోలో ఏం జరిగింది? అనేది గుర్తు చేసుకుంటే... ''నీకు టైటిల్ చివరలో సున్నా... నాకు మధ్యలో సున్నా... ఇదొక సెంటిమెంట్! నా షోకి వచ్చావ్ కదా! ఇప్పుడు నీ సినిమాకు నేను టైటిల్ పెడతా! ఓకేనా?'' అని బాలకృష్ణ అడిగారు. ''మీరు చూస్తే మంచి ముహూర్తం చూసి పెడతారు సార్! అదిరిపోతుంది. పెట్టించేసుకో'' అని ప్రభాస్ అన్నారు. ''అక్షర బలం కూడా ఉండాలయ్యా! కేవలం  ముహూర్తం ఉంటే సరిపోదు'' అని చెప్పిన బాలకృష్ణ... 'రామ బాణం' (Rama Banam Movie) టైటిల్ సూచించారు. ''బాలయ్య పెట్టిన టైటిల్ అని చెప్పండి. ఇక దానికి ఎదురు ఉండదు'' అన్నారు. వంద రోజుల వేడుకకు తాను ముఖ్య అతిథిగా వస్తానని గోపీచంద్‌కు బాలకృష్ణ మాట ఇచ్చారు.

Published at : 18 Feb 2023 05:25 PM (IST) Tags: gopichand Maha Shivratri Ramabanam Movie Gopichand30 First Look

సంబంధిత కథనాలు

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..

Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..

18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు

18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు

Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు

Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు

Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్‌తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!

Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్‌తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?