Lavanya Tripathi's heroic role : ఎర్ర చీర కట్టి, గన్ను పట్టి 'అమ్మోరు'లా మారిన అందాల రాక్షసి
అందాల రాక్షసి అమ్మోరులా మారితే? ఎర్ర చీర కట్టి విలన్లను ఇరగదీస్తే? జస్ట్ శాంపిల్ అన్నట్లు విడుదల చేసిన 'పులి మేక' వీడియో గ్లింప్స్ లావణ్యా త్రిపాఠిని కొత్త కోణంలో చూపించింది.
లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi)కి అందాల రాక్షసి ఇమేజ్ ఉంది. అభిమానులు ఆమెను ముద్దుగా సొట్టబుగ్గల సుందరి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి ఒక్కసారి అమ్మోరులా మారితే? ఎర్ర చీర కట్టి విలన్ల ఒంట్లోఎరుపు రంగులో రక్తం బయటకు వచ్చేలా కొడితే? ఆ రేర్ మూమెంట్ చూడాలంటే 'పులి - మేక' వెబ్ సిరీస్ విడుదల వరకు వెయిట్ చేయాలి.
అమ్మోరులా మారిన లావణ్యా త్రిపాఠి
పోలీస్ అధికారి కిరణ్ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటించిన వెబ్ సిరీస్ 'పులి - మేక' (Puli Meka Web Series). ఆమె ఖాకీ చొక్కా వేయడం ఇదే తొలిసారి. ఇందులో యువ కథానాయకుడు ఆది సాయి కుమార్ ఫోరెన్సిక్ డాక్టర్ పాత్రలో నటించారు. పోలీస్ రోల్ చేయడమే కాదు, మాంచి యాక్షన్ సీన్లు కూడా చేశారు.
''లావణ్యా త్రిపాఠి ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రను 'పులి - మేక'లో చేశారు'' అని వెబ్ సిరీస్ బృందం పేర్కొంది. మహా శివరాత్రి సందర్భంగా శనివారం లావణ్యా త్రిపాఠి క్యారెక్టర్ టీజర్‌ను మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
Also Read : 'శ్రీదేవి శోభన్ బాబు' రివ్యూ : చిరంజీవి కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
లావణ్యా త్రిపాఠి టీజర్ చూస్తే... ఎర్ర చీర కట్టి, గన్ను చేత పట్టి, ముఖానికి పసుపు రాసుకుని వీర శూర మహంకాళిలా, అమ్మోరులా కనిపించారు. అంతే కాదు... ఫైట్స్ కూడా చేశారు. శుక్రవారం రామ్ చరణ్ వెబ్ సిరీస్ టీజర్ విడుదల చేశారు. అది చూస్తే...
పోలీసులను చంపే సీరియల్ కిల్లర్!
హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి కిరణ్ (లావణ్యా త్రిపాఠి)కి పై అధికారి (సుమన్) 72 గంటలు టైమ్ ఇస్తాడు. ఈలోపు ఆమె పట్టుకుందా? లేదా? సేమ్ కిల్లర్ మరో మర్డర్ చేశాడని ఆది సాయి కుమార్ డైలాగ్స్ బట్టి అర్థం అవుతోంది. ఆ కిల్లర్ ఎవరు? అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. ఒకరి తర్వాత మరొకరు... పోలీస్ శాఖలో వ్యక్తులను టార్గెట్ చేస్తూ సీరియల్ కిల్లర్ చంపేస్తుంటాడు. అతడిని ఎలా, ఎవరు పట్టుకున్నారు? అనేది కథ.
'మీకు పెళ్ళైందా మేడమ్?' ఆది సాయి కుమార్ అడగటం... 'ఆర్ యు సీరియస్?' అని లావణ్యా త్రిపాఠి అనడం చూస్తే... ఇద్దరి మధ్యలో ఏమైనా లవ్ ట్రాక్ లాంటిది ఏమైనా ఉందేమో అనిపిస్తోంది. పోలీస్ గా లావణ్యా త్రిపాఠి డ్రస్సింగ్, యాటిట్యూడ్ సెట్ అయ్యింది. సిరీస్ చూస్తే ఆమె ఎలా చేశారో తెలుస్తుంది.
Also Read : 'వినరో భాగ్యము విష్ణు కథ' రివ్యూ : కిరణ్ అబ్బవరానికి హిట్ వచ్చిందా? లేదా?
పోలీస్ శాఖతో పాటు ఆస్ట్రాలజీతో మిళితమైన కథతో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌గా 'పులి - మేక'ను తెరకెక్కించారని తెలిసింది. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'జీ 5' ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన సిరీస్ ఇది.
గోపీచంద్ 'పంతం' తీసిన దర్శకుడే!
'పులి - మేక'కు కె. చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించారు. మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా 'పంతం' సినిమాకు దర్శకత్వం వహించినది ఆయనే. చక్రవర్తి రెడ్డికీ ఇదే తొలి వెబ్ సిరీస్. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ (Kona Venkat) కు చెందిన కోన ఫిలిం కార్పోరేషన్ సంస్థతో కలిసి జీ 5 ఓటీటీ ఈ సిరీస్ నిర్మించింది.
సుమన్, 'బిగ్ బాస్' సిరి హనుమంతు, 'ముక్కు' అవినాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న 'పులి - మేక' వెబ్ సిరీస్‌కు ఛాయాగ్రహణం : సూర్య కళా, కూర్పు : చోటా కె. ప్రసాద్, కళా దర్శకత్వం : బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : గిరిధర్ మామిడిపల్లి, కౌముది నేమాని, సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, రచన : కోన వెంకట్, వెంకటేష్ కిలారు, దర్శకత్వం : కె. చక్రవర్తి రెడ్డి.