Family Star Nandanandanaa Song: ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న విజయ్!
Family Star First Song: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నుండి మొదటి పాట ‘నంద నందనా’ లిరికల్ సాంగ్ విడుదలయ్యింది. ఇది చూస్తుంటే మరోసారి విజయ్ అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్టు అర్థమవుతోంది.
Family Star First Song Glimpse: టాలీవుడ్‌లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’తో యూత్‌కు ఆకట్టుకున్న తర్వాత ‘గీత గోవిందం’ లాంటి చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యాడు. ఇక ఈ హీరోకు చాలాకాలం నుండి సరైన హిట్ దక్కడం లేదు. అందుకే తనకు ‘గీత గోవిందం’లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడితోనే ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాను చేయడానికి సిద్ధమయ్యాడు. ఏప్రిల్‌లో విడుదలను ఖరారు చేసుకున్న ఈ మూవీ.. అప్పుడే ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేసింది. తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ నుండి మొదటి పాటకు సంబంధించిన లిరికల్ వీడియో విడుదలయ్యింది. ఇక పూర్తి పాట ఎప్పుడు విడుదల అవుతుందో.. ఆ వివరాలను కూడా షేర్ చేసింది మూవీ టీమ్.
‘నంద నందనా’..
పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’లో విజయ్ దేవరకొండకు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన సాంగ్ వీడియో చూస్తే.. ఇందులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్.. తన ముందు సినిమాలకంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుందని క్లారిటీ వస్తుంది. ఇక విజయ్ దేవరకొండ.. ఏ హీరోయిన్‌తో జోడీకట్టినా కెమిస్ట్రీ అదిరిపోతుందని ప్రేక్షకులు భావిస్తుంటారు. తాజాగా విడుదలయిన మొదటి పాట చూస్తుంటే మరోసారి ఆ విషయం నిజమే అనిపిస్తోంది. ‘నంద నందనా’ అంటూ సాగే ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి.
సిద్ శ్రీరామ్ సెంటిమెంట్..
పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి చిత్రం ‘గీత గోవిందం’. అప్పట్లో ఈ సినిమా నుండి కూడా ముందుగా సిద్ శ్రీరామ్ పాడిన ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటను విడుదల చేసి.. ఆ సాంగ్ ద్వారా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది మూవీ టీమ్. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ నుండి కూడా ముందుగా సిద్ శ్రీరామ్ పాడిన పాటనే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది వీరికి ఒక సెంటిమెంట్‌లాగా మారిపోయిందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. అంతే కాకుండా విజయ్ దేవరకొండ చివరిగా హీరోగా కనిపించిన ‘ఖుషి’లో కూడా సిద్ శ్రీరామ్ పాడిన ‘ఆరాధ్య’ అనే పాట పెద్ద హిట్ అయ్యింది.
‘దేవర’ స్థానంలోకి..
2024 సంక్రాంతి సినిమాల రేసులో ముందుగా ‘ఫ్యామిలీ స్టార్’ కూడా తన పేరును నమోదు చేసుకుంది. కానీ మెల్లగా పోటీ పెరుగుతూ ఉండడంతో సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. ఆ తర్వాత ఈ మూవీ ఫిబ్రవరీలో విడుదల అవుతుందని వార్తలు వినిపించాయి. కానీ ఫిబ్రవరీలో కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో అక్కడ నుండి కూడా తప్పుకొని ఏకంగా ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్ చేశాడు ‘ఫ్యామిలీ స్టార్’. ముందుగా ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీని ఏప్రిల్ 5న విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఆ సినిమా ఆలస్యం అవ్వడంతో పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో ఆ స్థానంలో ‘ఫ్యామిలీ స్టార్’ వచ్చాడు.
Also Read: స్టేజ్‌పైనే దర్శకుడికి రాఖి కట్టిన అనుపమ - పాపం ఎంత ఫీల్ అయ్యాడో!