Anupama Parameswaran: స్టేజ్‌పైనే దర్శకుడికి రాఖి కట్టిన అనుపమ - పాపం ఎంత ఫీల్ అయ్యాడో!
Anupama Parameswaran: రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’లో హీరోయిన్‌గా నటించింది అనుపమ పరమేశ్వరన్. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేసిన కార్తిక్ ఘట్టమనేనికి స్టేజ్‌పైనే రాఖీ కట్టి షాకిచ్చింది.
Anupama Parameswaran: మాలీవుడ్ నుండి వచ్చి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది అనుపమ పరమేశ్వరన్. ఈ హీరోయిన్ అంటే చాలామంది తెలుగు యూత్‌కు క్రష్ ఉంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ‘ఈగల్’ అనే సినిమాలో నటించింది అనుపమ. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరీ 9న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుండగా.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది టీమ్. ఇందులో అనుపమ చేసిన పనికి టీమ్ అంతా షాక్ అయ్యారు. ‘ఈగల్’ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి స్టేజ్‌పైకి పిలిచి మరీ రాఖీ కట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాఖీ కట్టింది..
టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు కార్తిక్ ఘట్టమనేని. అంతే కాకుండా యంగ్ హీరో నిఖిల్ లీడ్ రోల్‌గా ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ మూవీ అంతగా వర్కవుట్ అవ్వకపోవడంతో మళ్లీ సినిమాటోగ్రాఫర్‌గానే బిజీ అయ్యాడు. ఇక మాస్ మహారాజ్ లాంటి సీనియర్ హీరోతో కలిసి ‘ఈగల్’ మూవీని తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన టీజర్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తెరకెక్కిస్తున్న క్రమంలో దర్శకుడు కార్తిక్‌ను తాను అన్నయ్యలాగా ఫీల్ అయ్యానని ఒక సందర్భంలో చెప్పింది అనుపమ. అప్పుడు అందమైన అమ్మాయిలు.. అన్నయ్య అనే పదం వాడకూడదు అని చెప్పుకొచ్చాడు రవితేజ. ఇప్పుడు ఏకంగా కార్తిక్‌కు రాఖీనే కట్టేసింది.
చాలా తక్కువమందిని పిలుస్తాను..
ఇప్పటికే కార్తిక్ ఘట్టమనేని సినిమాట్రోఫర్‌గా పనిచేసిన సినిమాల్లో అనుపమ హీరోయిన్‌గా నటించింది. దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరికి రాఖీ కడతావని అడిగినప్పుడు కార్తిక్‌ను స్టేజ్‌పైకి పిలిచింది అనుపమ. ‘‘నాలుగో సినిమా కదా అన్నయ్య అని పిలిచి పిలిచి అలవాటు అయిపోయింది. నేను చాలా తక్కువమందిని అలా పిలుస్తాను’’ అంటూ కార్తిక్‌కు రాఖి కట్టింది అనుపమ. రవితేజ వద్దని చెప్పినా తాను ఈ పని చేయడంతో ఆయనకు సారీ కూడా చెప్పింది. ‘ప్రేమమ్’ అనే సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది అనుపమ. ఆ సినిమాకు కూడా కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.
#AnupamaParameswaran ties rakhi to director Karthik 😂😂 #RaviTeja #Eagle #EAGLEonFEB9th pic.twitter.com/8FwnLGv1vL
— Indian Cinema Hub (@IndianCinemaHub) February 4, 2024
అనుపమతో పాటు కావ్య కూడా..
కార్తిక్ ఘట్టమనేని, రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఈగల్’ మూవీ సంక్రాంతికే విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అప్పటికే ఆ పండగకు సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో ‘ఈగల్’ తప్పుకుంది. ఫైనల్‌గా ఫిబ్రవరీ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌లో కథను ఏ మాత్రం రివీల్ చేయకుండా ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేశాడు కార్తిక్ ఘట్టమనేని. ఇందులో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌తో పాటు కావ్య థాపర్ కూడా నటించింది. నవదీప్, అవసరాల శ్రీనివాస్ లాంటి నటులు కీలక పాత్రలో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్.. ‘ఈగల్’ను నిర్మించారు.
Also Read: ఆమె సినిమాలను తొక్కేయాలని చూస్తుంది - ‘12th ఫెయిల్’ డైరెక్టర్ భార్యపై కంగనా ఫైర్