Ileana Marriage: ఎట్టకేలకు మైఖేల్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఇలియాన - ఏం చెప్పిందంటే!
పెళ్లి కబురు చెప్పకుండానే బిడ్డకు తల్లయిన ఇలియాన దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంది. పెళ్లి అయ్యిందా? లేదా? అనేది కూడా స్పష్టం చేయలేదు. ఈ క్రమంలో తాజాగా మైఖేల్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది ఈ భామ.
Ileana DCruz confirms her marriage with Michael Dolan: ఇలియాన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన ఆమె సడెన్‌గా కనుమరుగైంది. ఇక్కడ కెరీర్ పీక్‌లో ఉండగానే బాలీవుడ్‌కు మాకాం మార్చింది. దీంతో టాలీవుడ్ ఆఫర్స్ కొల్పోయింది. బాలీవుడ్‌లో వరుస ప్లాప్స్ రావడంతో అక్కడ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్‌తో కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఆమె ఆ తర్వాత బ్రేకప్ చేసుకుంది. అయితే బ్రేకప్‌తో కొంతకాలం డిప్రెషన్‌కు వెళ్లిన ఇలియాన కొంతకాలం పాటు మీడియాకు దూరంగా ఉంది. కొన్నెళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉన్న ఆమె సడెన్‌గా తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించి అందరికి షాకిచ్చింది.
పెళ్లి కాకుండానే తల్లయిందా?
అసలు ఇలియానకు పెళ్లయిందా? భర్త ఎవరూ? అంటూ ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటిపై ఇలియాన ఎప్పుడు స్పందించలేదు. దీంతో పెళ్లి కాకుండానే తల్లయిందంటూ ఆమెను ట్రోల్ చేశారు. అయినా కూడా ఇలియాన ఆ బిడ్డకు తండ్రి ఎవరనేది రివీల్ చేయలేదు. ఇక బిడ్డపుట్టినట్టు ప్రకటించి బాబు పేరు పేరు ఫీనిక్స్ డోలన్ అని కూడా వెల్లడించింది. కానీ బిడ్డ తండ్రిని మాత్రం పరిచయం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా ట్రోలో చేశారు. ఫైనల్‌గా తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ డోలన్ అంటూ పరిచయం చేసిన ఆమె పెళ్లిని మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది. అసలు పెళ్లయిందా? లేదా? ఎప్పుడు చేసుకుంటుందో కూడా చెప్పలేదు. పెళ్లి విషయంపై ప్రశ్న ఎదురైనప్పుడల్లా దానిని దాటేసే ప్రయత్నం చేసింది. అసలు ఇలియాన పెళ్లయిందా? లేదా? అంతా డైలామాలో ఉన్నారు.
'వైవాహిక జీవితం అందంగా ఉంది'
ఇక అంతా ప్రియుడితో సహజీవనం చేసి పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిందంటూ ఫిక్స్ అయిపోయారు. ఈక్రమంలో తాజాగా మైఖేల్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది ఇల్లీ బేబి. తాజాగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో తన లైఫ్ పార్ట్‌నర్ మైఖేల్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఇంటర్య్వూలో రిలేషన్‌షిప్‌లో మైఖేల్ సపోర్ట్ ఎలా ఉందని అడగ్గా ఇలియాన ఇలా చెప్పుకొచ్చింది. మైఖేల్‌తో తన వైవాహిక జీవితం చాలా అందంగా సాగుతుందని బదులిచ్చింది. "నేను మైఖేల్‌ని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే నేను దీని గురించి చెప్పడం వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలుసు. నేను నా రిలేషన్ గురించి మాట్లాడిన ప్రతిసారి మరుసటి రోజు ఎలా ఉంటుందో తెలుసు. కానీ మా వైవాహకి బంధంలో తన సపోర్టు చాలా ఉంది. మైఖేల్ నన్ను అత్యంత చెత్త పరిస్థితిల్లో చూశాడు. అలాగే నా సక్సెస్ ఫుల్ లైఫ్‌ని కూడా చూశాడు.
Also Read: 'కల్కి'కి ప్రభాస్ రెమ్యునరేషన్ తెలిస్తే అవాక్కావ్వాల్సిందే! - బడ్జెట్ లో 25 శాతం, ఎన్ని కోట్లంటే!
ఈ రెండు స్థితుల్లోనూ అతను చాలా స్టెబుల్‌గా ఉన్నాడు. క్లిష్టమైన పరిస్థితిల్లో, అలాగే ఉత్తమమైన సమయాల్లోనూ మైఖేల్ ఒకేలా తన ప్రేమ పంచాడు. మొదటి నుంచి అదే ప్రేమ, సపోర్టు ఇస్తూ వచ్చాడు. ఎలా Do Aur Do Pyaar సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది కదా. అచ్చం అలాగే మైఖేల్ నన్ను ప్రేమించాడు" అంటూ ఇలియాన భావోద్వేగానికి లోనైంది. దీంతో ఇలియాన పెళ్లిపై క్లారిటీ వచ్చేసిందంటున్నారు. ఎట్టకేలకు మైఖేల్‌ను పెళ్లాడినట్టు చెప్పేయడంతో ఆమె ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఈ దెబ్బతో ట్రోలర్స్‌కి చెక్ పడిందంటున్నారు. ఎట్టకేలకు ఇల్లీ బేబీ పెళ్లి కబురు చెప్పేసిందని, సంప్రదాయంగా పెళ్లి తర్వాతే ఆమె తల్లయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.