అన్వేషించండి

Kaantha Teaser: హీరో వర్సెస్ డైరెక్టర్ - దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ అదుర్స్

Kaantha Teaser Out: దుల్కర్ సల్మాన్, సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'కాంత'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Dulquer Salmaan's Kaantha Teaser Released: దుల్కర్ సల్మాన్, సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా 'కాంత'. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలో స్టార్ హీరోగా దుల్కర్, డైరెక్టర్‌గా సముద్ర ఖని కనిపించనున్నారు. రెట్రో లుక్‌లో మరోసారి దుల్కర్ అదరగొట్టారు. సెప్టెంబర్ 12న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు.

సినిమా పేరు 'శాంత' కాదు 'కాంత'

'మోడర్న్ స్టూడియోస్' దర్శక శిఖామణితో రూపొందించబోతున్న చిత్రం 'శాంత' తెలుగులో మొదటి హారర్ ఫిల్మ్ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా... సముద్ర ఖని సినిమాలో సీనియర్ డైరెక్టర్ రోల్ చేస్తున్నారు. ఓ సినిమా విషయంలో డైరెక్టర్, హీరోకు మధ్య జరిగే ఘర్షణ బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో అప్పటి హీరో, డైరెక్టర్ మధ్య ఏం జరిగింది?, ఒకరికొకరు ప్రేమ, అనుబంధంతో ఉన్న ఇద్దరు బద్ద శత్రువులుగా ఎందుకు మారాల్సి వచ్చింది? అనేది ఆసక్తిని పెంచేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా డైరెక్టర్ సముద్రఖనిని డామినేట్ చేస్తుండగా... 'సినిమా పేరు శాంత కాదు కాంత' అంటూ టైటిల్‌నే మార్చేయడం మరింత హైప్ క్రియేట్ చేసింది. 

Also Read: ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రిష్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అరేబియా కడలి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీకి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా... స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ పిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మిస్తున్నారు. ఝును మ్యూజిక్ అందిస్తుండగా... రానా (Rana Daggubati) కూడా ఓ కీలక రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన డిటెక్టివ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో 'మహానటి' సినిమాలో శివాజీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్ సేమ్ రోల్‌లోనే అదరగొట్టారు. ఈ మూవీలోనూ 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో స్టార్ హీరోగా న్యూ హెయిర్ స్టైల్, సూట్‌తో ఇంటెన్స్ లుక్‌లో అదరగొట్టారు. 

దుల్కర్ వరుస మూవీస్

మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). రీసెంట్‌గా వచ్చిన 'లక్కీ భాస్కర్' బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలిచింది. పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీతో డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ మనసు దోచుకుంటున్నారు. 'సీతారామం' మూవీ ఆయనకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. కురుప్, కనులు కనులు దోచాయంటే, జనతా హోటల్, అందమైన జీవితం మూవీస్ మంచి టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా 'కాంత' మూవీ కూడా హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget