Samantha And Naga Chaithanya: నాగార్జున ఇంటికి షిఫ్ట్ అయిన చైతూ?
సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చంతా టాలీవుడ్ సెలెబ్రిటీ జంట ‘చైతూ-సామ్’గురించే.
![Samantha And Naga Chaithanya: నాగార్జున ఇంటికి షిఫ్ట్ అయిన చైతూ? Divorce rumours: Naga Chaitanya moves into his father’s residence Samantha And Naga Chaithanya: నాగార్జున ఇంటికి షిఫ్ట్ అయిన చైతూ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/20/874f2f22e7cc7d0bb4079c519e704b58_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చైతూ సామ్ జంట నిజంగానే విడిపోనుందా? సోషల్ మీడియాలో చాలా వార్తలు హల్ చల్ చేస్తున్న... వారిద్దరు ఈ వార్తల్ని ఎక్కడా ఖండించడం లేదు. దీంతో అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. ఇద్దరి కుటుంబాలు చాలా తీవ్రంగా ప్రయత్నించినా చై-సామ్ మనసు మార్చుకోవడం లేదట. వీరిద్దరు కలిసుంటున్న ఇంట్లోంచి ఇప్పటికే నాగ చైతన్య తండ్రి నాగార్జున నివసిస్తున్న ఇంటికి వెళ్లిపోయాడని చెబుతున్నారు. సమంత కూడా ముంబై మారిపోయేందుకు అన్ని ప్రయత్నాలు పూర్తి చేసుకుందని కొన్ని సినీ వెబ్ సైట్లు ప్రచురించాయి.
ఇప్పటికే ఇద్దరూ తమ ఇష్టపూర్వకంగానే, పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేశారని సమాచారం. వారిద్దరినీ కలిపి ఉంచేందుకు నాగార్జున చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని అంటున్నారు. విడాకులకు ముందు తొలి విడత కౌన్సిలింగ్ వీరిద్దరికీ పూర్తయినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్. ఆ కౌన్సిలింగ్ తరువాత కూడా వారిద్దరి మనసు మారలేదని, విడాకులకూ మొగ్గుచూపారని సమాచారం. అంతేకాదు సమంత ముంబైలో సెటిలై బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని భావిస్తోందట. ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై శ్రద్ధ పెట్టిందట.
అయితే చైకు గతంలో లవింగ్ హజ్బెంట్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చింది సామ్. హఠాత్తుగా వారిద్దరి మధ్య ఏమైందో తెలియడం లేదు. మజిలీ సినిమాలో చాలా సీన్లలో సామ్ ను అసహ్యించుకున్నట్టు నటించాల్సి వచ్చినప్పుడు చైతూ చాలా ఇబ్బందిపడ్డాడట. నేను నా భార్యను అలా చూడలేనని కూడా చెప్పాడట. ఇద్దరిమధ్య ఇంత ప్రేమ ఇప్పుడు విడిపోయేంత ద్వేషంగా ఎలా మారిందో తెలియక అక్కినేని అభిమానులు బాధపడుతున్నారు.
ఏ మాయ చేశావే సినిమా సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట పెద్దల అంగీకారంతో 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా సామ్ సినిమాలతో చాలా బిజీగానే ఉంది. ఈ ఏడాదిలో సోషల్ మీడియాలో తన పేరు నుంచి అక్కినేని పేరును తీసేయడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ తరువాత విడాకుల వార్తలు బయటకు పొక్కాయి.
Also read: పోస్ట్ కోవిడ్ పరిస్థితులు గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?
Also read: రాశి అందం వెనుక రహస్యాలు ఇవే... ఆమె ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ మీకోసం
Also read: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు
Also read: Keerthy Suresh Latest Photos: మండే బ్లూస్... నీలంరంగులో డ్రెస్ లో కీర్తి సురేష్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)