అన్వేషించండి

Beauty Tips: రాశి అందం వెనుక రహస్యాలు ఇవే... ఆమె ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ మీకోసం

మెరిసే చర్మం రాశిఖన్నా సొంతం. ఆమె తన అందాన్ని కాపాడుకునేందుకు పాటించే ఇంటి చిట్కాలను మనతో పంచుకుంటోంది.

టాలీవుడ్లో జోరు మీదున్న హీరోయిన్లలో రాశిఖన్నా ఒకరు. తెలుగుతో పాటూ తమిళ, కన్నడ, మలయాళ మూవీలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఎనిమిది సినిమాల దాకా ఉన్నాయని అంచనా. ఇంత బిజీలో కూడా చర్మ సౌందర్యానికి ప్రాముఖ్యత ఇస్తుంది రాశి. ఎక్కువగా ఇంటి చిట్కాలనే పాటిస్తుంది. ఆ చిట్కాలు మీకోసం...

1. సెలెబ్రిటీలకు కూడా మొటిమల సమస్య సాధారణమే. ముఖంపై మొటిమ వస్తున్నట్టు అనిపించగానే రాశి బొప్పాయి గుజ్జును అప్లయ్ చేస్తుంది. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య నుంచి బయటపడొచ్చు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మొటిమలను నిరోధిస్తుంది. 

2. ఆమె మెరిసే చర్మం వెనుక రహస్యం ముల్తాని మిట్టి. తరచూ ముల్తాని మిట్టితో ఫేస్ ప్యాక్ లు వేసుకుంటుంది రాశి. ముల్తానిమిట్టి చర్మరంధ్రాల్లోని నూనెను తీసివేస్తుంది. టానింగ్ నుంచి, పిగ్మెంటేషన్ నుంచి కాపాడుతుంది. 

3. అప్పుడప్పుడు అలోవెరా జెల్ ను కూడా అప్పుడప్పుడు చర్మాన్ని మెరిపించేందుకు ఉపయోగిస్తుంది. రాశినే కాదు, మీరు కూడా రోజూ కలబంద రసాన్ని ముఖానికి పట్టిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. పొడిచర్మం ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. ముఖంపై చారలు, మొటిమలను ఇట్టే మాయం చేస్తుంది. 

4. తినే ఆహారం కూడా చర్మసౌందర్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే రాశి తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తన డైట్ లో భాగంగా తీసుకుంటుంది.  బ్రాకోలి, స్వీట్ పొటాటోలు, టమోటాలు, ఎరుపు, పసుపు క్యాప్సికమ్, గ్రీన్ టీ, ద్రాక్ష పండ్లు, సోయా వంటివి, వాల్ నట్స్, అరటి పండు, పాలకూర వంటివి మీరు కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే... మీ చర్మం మెరుపులీను తుంది. 

5. చాలా మంది అతిగా మేకప్ వేసుకుంటారు. సినిమాల్లో చేసేప్పుడు రాశికి కూడా తప్పదు. కానీ షూటింగ్ పూర్తవ్వగానే మేకప్ మొత్తం తీసేస్తుంది రాశి. చర్మ రంధ్రాలకు తాజా గాలితో ఊపిరులూదుతుంది. నిత్యం మేకప్ ల వల్ల చర్మ రంధ్రాలు పూడుకుపోతాయి. అందుకే ఎవరైనా సరే ఉదయమంతా ఎంత మేకప్ వేసుకున్నా, రాత్రి మాత్రం మొత్తం మేకప్ ను తొలగించడం అత్యవసరం. 

Also read: బెల్లం, పంచదారల్లో ఏది ఆరోగ్యానికి మంచిది?

Also read: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు

Also read: ఏ వయసులో ప్రోటీన్ షేక్స్ తీసుకుంటే మేలు? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
GV Prakash Kumar: జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Embed widget