Sugar and Jaggery: బెల్లం, పంచదారల్లో ఏది ఆరోగ్యానికి మంచిది?
ఈ విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. రెండూ చెరుకు నుంచే కదా వచ్చేది... ఏది వాడినా మంచిదే అనుకుంటారు. కానీ అది నిజం కాదు.
ఏ ఆహార పదార్థమైన దాని తయారీ విధానంపైనే మంచి చెడు ఆధారపడి ఉంటుంది. చెరకు నుంచి రసాన్ని తీసి వేడి చేసి, పాకంగా మార్చి, అచ్చులుగా పోస్తారు. ఇలా బెల్లం తయారవుతుంది. కానీ పంచదార తయారీలో రసాయనాలు కలుస్తాయి. చెరకు నుంచి రసాన్ని తీసి శుద్ధి చేస్తారు. తరువాత క్రిస్టలైజేషన్, సెంట్రిఫ్యూజన్ వంటి ప్రక్రియలు చేపడతారు. తయారీ విధానాన్ని బట్టి చూసినా, పోషక విలువలు బట్టి చూసినా పంచదార కన్నా బెల్లాన్ని తినడమే ఉత్తమం అని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా పంచదారకు బదులు బెల్లాన్నే ఎంచుకుంటారు. కేవలం చెరకుతో తయారుచేసే బెల్లమే కాదు, తాటి చెట్లు, కోకోనట్ సాప్, డేట్ పామ్ నుంచి కూడా తయారుచేసే బెల్లాలు అందుబాటులో ఉంటున్నాయి.
పంచదార కేవలం తీపిరుచినే అందిస్తుంది... కానీ బెల్లం తీపితో పాటూ ఎన్నో పోషకాలను శరీరంలోకి చేరుస్తుంది. ఆయుర్వేదంలో బెల్లాన్ని తరచూ వాడుతుంటారు. ప్రతిరోజూ చిన్న బెల్లం ముక్క తినమని చెబుతారు ఆయుర్వేద వైద్యులు.
1. మోకాళ్ల నొప్పి బాధిస్తుంటే అల్లం, బెల్లం రెండూ కలిపి రోజూ తినడం అలవాటు చేసుకోండి. వాతపు నొప్పులు తగ్గిపోతాయి.
2. బెల్లంలో ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలను, ఎముకలను గట్టిపరుస్తాయి. కనుక పిల్లలకు రోజుకో చిన్న ముక్క బెల్లాన్ని తినిపించండి.
3. మహిళలను వేధించే ప్రధాన సమస్య రక్త హీనత. దీనికి బెల్లంతో చెక్ పెట్టచ్చు.
4. బెల్లంలో కూడా కొన్ని రసాయనాలు ఉపయోగిస్తారు. ముఖ్యంగా తెల్లబెల్లానికి దూరంగా ఉండి, గానుగ బెల్లాన్ని వాడడం మొదలుపెట్టండి.
5. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జింక్, సెలీనియం వంటివి కూడా లభిస్తాయి. ఇవి ఫ్రీరాడికల్స్ పోరాడతాయి. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
6. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉండాలంటే బెల్లం తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ కార్బో హైడ్రైట్లు వంటివి ఉంటాయి. ఇవి శరీరంపై ముడతలు, చారలు పడకుండా కాపాడతాయి.
6. కాలేయాన్ని శుభ్రపరచడం బెల్లంతో సాధ్యమవుతుంది. శరీరంలోని టాక్సిన్లను సహజసిద్ధంగానే శుధ్ది చేసి బయటికి పంపిస్తుంది.
7. అమ్మాయిల్లో మొటిమల సమస్య వేధిస్తుంటే బెల్లాన్ని తినండి. ఇది చర్మాన్ని అందంగా మారుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా మొటిమలు త్వరగా పోయేలా చేస్తుంది.
కాబట్టి ఇంట్లో పంచదారకు బదులు బెల్లాన్ని వాడితే అన్ని విధాలా మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు.
Also read: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు
Also read: షుగర్ వ్యాధి ఒంట్లో చేరి ఏం చేస్తుందో తెలుసా... జాగ్రత్త పడండి