Tharun Bhascker: ‘కీడా కోలా’ తీసినందుకు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా: తరుణ్ భాస్కర్
తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’. ఈ శుక్రవారం థియటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు.
'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం.. చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. ఇందులో తరుణ్ భాస్కర్ తో సహా బ్రహ్మానందం, చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని విజి సైన్మా బ్యానర్‌పై కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ కామెడీ మూవీని నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి యువ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ''పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల విషయంలో నాకు భయం ఉండేది. థియేటర్ బయటే తిరిగేవాడిని. కానీ ‘కీడా కోలా’ చిత్రానికి ఆ భయం లేదు. కచ్చితంగా విజయం సాధిస్తుందని, సక్సెస్ మీట్ నిర్వహిస్తామని చాలా నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే నేను సినిమా చూశాను. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. బలుపు అనుకుంటారేమో అనే భయంతో నేను గతంలో ఎప్పుడూ ఇలా చెప్పలేదు. సినిమా విజయానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. క్రైమ్ కామెడీ నా ఫేవరేట్ జోనర్. ఈ సినిమా తీసినందుకు ఒక ఫిలిం మేకర్ గా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అని అన్నారు.
''కింద పడినా, నిలబడినా మనకు వెనకుండి ఎప్పుడూ సపోర్ట్ గా నిలిచే వారిని మనం మర్చిపోతుంటాం. నేను వాళ్ళని గుర్తుపెట్టుకుంటా. నా స్నేహితులు ఉపేంద్ర, కౌశిక్, వివేక్, సాయి నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ థాంక్స్. మీకు ఇది 150 రూపాయలు పెట్టి చూసే సినిమా అయ్యుండొచ్చు. కానీ నాకు మాత్రం జీవితంలో నేను ఏమి కలిగి ఉన్నాననేది మరోసారి తెలియజెప్పిన సినిమా ఇది. నాకు ఏముంది, నాకు ఎవరున్నారు అనేది తెలియజేసింది. ఈ సినిమా ఆడుతుందా ఆడదా అనేది మర్చిపోండి. ఈ సినిమా మా గురించి కాదు, స్పెషల్ గా ప్రేక్షకుల కోసం డిజైన్ చేసింది. లైఫ్‌లో ప్రతీ స్టేజ్‌లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎన్ని సమస్యలున్నా నవ్వు కలిగించాలనే ప్రయత్నమే ఈ సినిమా. నవంబర్ అంతా నవ్వుకోవచ్చు''
Also Read: జాయింట్ కలెక్టర్ జాబ్ వదిలేసి, సినిమాల్లో కోట్లు సంపాదిస్తున్న నటుడు!
''కీడా కోలాతో మిమ్మల్ని నవ్వించడానికి చాలా స్మార్ట్ గా కష్టపడ్డాం. డైరెక్షన్ పరంగా, రైటింగ్ పరంగా మిమ్మల్ని నవ్వించాడానికి చాలా కష్టపడ్డాం. పాత డైలాగ్స్ తో జోకులు వెయ్యడానికి మేం ట్రై చేయలేదు. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు మార్కెట్ వుంది కాబట్టి నేను దానికి సీక్వల్ చేయొచ్చు. కానీ నేను ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే కొత్తగా నవ్విద్దాం.. ఏదైనా కొత్తగా చేయాలనే జీల్ తో చాలా డిఫెరెంట్ గా ఈ సినిమా చేశాం. సౌండ్ పరంగా, యాక్టింగ్, మ్యూజిక్ పరంగా మీరు నవ్వుతారు. కెమెరా పరంగా కూడా నవ్వుతారు. ఇందులో విజువల్ హ్యుమర్ వుంది. అన్ని రకాల కామెడీతో చిన్న భయంతో భక్తితో ఈ సినిమా చేశాం. అన్ని ప్రాబ్లమ్స్ మర్చిపోయి ఈ సినిమా చూడండి. థియేటర్లో ఖచ్చితంగా మీరు నవ్వుతారు. మీరు నవ్వితే మేము హ్యాపీ. నవంబర్ 3న మీ ప్రాబ్లమ్స్ మర్చిపోండి, నవ్వుకోండి'' అని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.
'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ దాస్యం.. ఫస్ట్ మూవీతోనే అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో మరో విజయాన్ని సాధించాడు. బ్యాక్ టూ బ్యాక్ రెండు హిట్లు కొట్టినా సరే అతను డైరెక్టర్ గా వెంటనే మూడో సినిమా చేయలేదు. నటుడుగా, రైటర్ గా, హోస్ట్ గా చేసి మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. 'మహానటి' 'ఫలక్ నుమా దాస్' 'మిడిల్ క్లాస్ మెలోడీస్' 'మీకు మాత్రమే చెప్తా' 'సీతారామం' 'దాస్ కా ధమ్కీ' 'హాస్టల్ బాయ్స్' వంటి చిత్రాల్లో నటించాడు. మధ్యలో 'ఒకే ఒక జీవితం' 'ఓరి దేవుడా' సినిమాలకు డైలాగ్స్ రాశారు. అయితే ఐదేళ్ల తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకొని ఇప్పుడు 'కీడా కోలా' సినిమాతో నవ్వించడానికి వస్తున్నాడు. మరి ఈ చిత్రం డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ కు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Also Read: ‘బిగ్ బాస్’ బ్యూటీ హీరోయిన్‌గా ‘బేబీ’ మేకర్స్ కొత్త సినిమా - క్లాప్ కొట్టిన నాగచైతన్య
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial