Rajamouli: మురళీమోహన్ నా శత్రువు - రాజమౌళి షాకింగ్ కామెంట్స్!
సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ గురించి దర్శకధీరుడు రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన నా శత్రువు అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
SS Rajamouli about Murali Mohan: తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మురళీ మోహన్. చిన్న పాత్రలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. చిరునవ్వు చెరగని ముఖంతో అందరితో ప్రేమగా మెలిగే మురళీ మోహన్ సినీ రంగంలోకి అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని మురళీ మోహన్ కు ఘన సన్మానం చేశారు.
మురళీ మోహన్ గురించి రాజమౌళి షాకింగ్ కామెంట్స్
ఈ వేడుకలో పలువురు ప్రముఖులు ఆయన గురించి మాట్లాడారు. మురళీ మోహన్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమాల పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు. ఇక ఈ వేడుకలో పాల్గొన్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మురళీ మోహన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
“నా వయసు 50 ఏళ్ళు. ఆయన సినిమాల్లోకి అడుగు పెట్టి 50 ఏళ్ళు. ఇక ఆయన గురించి నేనేం చెప్తాను? చిన్నప్పుడు నేను ఎన్టీఆర్ కు వీరాభిమానిని. ఆయన సినిమాలు అన్నీ చూసేది. కానీ, మా అమ్మ, పెద్దమ్మతో పాటు మా కుటుంబలో లేడీస్ చాలా మంది మురళీ మోహన్ అభిమానులు. వాళ్లంతా నన్ను మురళీ మోహన్ సినిమాలకు తీసుకెళ్ళే వాళ్ళు. ఎన్టీఆర్ సినిమాలని ఒక్కసారి చూస్తే, మురళీ మోహన్ సినిమాలని రెండు, మూడు సార్లు చూసేవాడిని. ఆయనకు నా చిన్నప్పుడు మహిళల్లో ఎంతో ఫాలోయింగ్ ఉండేది. నిజానికి చిన్నప్పుడు ఆయన నాకు పెద్ద శత్రువు. మా వాళ్లు నన్ను ఎన్టీఆర్ సినిమాలను కాదని, మురళీ మోహన్ సినిమాలకు తీసుకెళ్ళే వాళ్ళని బాగా కోపం. ఆయన గొప్పతనం నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తెలిసింది. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా ఆయన గొప్పగా సక్సెస్ అయ్యారు. 25 సినిమాలు తీస్తే, అందులో దాదాపు 23 సినిమాలు విజయం సాధించాయి. అయినా, తనకు నచ్చినట్టు సినిమా నిర్మాణం జరగట్లేదని భావించారు. నిర్మాతగా తప్పుకున్నారు. ఆయన క్యారెక్టర్ కు హ్యాట్సాఫ్. చిరునవ్వుతో, మంచితనంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మురళీ మోహన్ నిదర్శనం. ఆయన ఇప్పటికీ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తారు” అని రాజమౌళి ప్రశంసలు కురిపించారు.
గోల్డెన్ జూబ్లీ వేడుకలో పాల్గొన్న పలువురు ప్రముఖులు
ఇక మురళీ మోహన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నారా చంద్రబాబు నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, ఎంపీలు రఘురామ కృష్ణం రాజు, సుజనా చౌదరి, నటుడు కోటా శ్రీనివాసరావు, సంగీత దర్శకుడు కీరవాణి, ఫిల్మ్ మేకర్స్ రాజమౌళి, అశ్వనీదత్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Read Also: కొత్త ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతున్న సమంత - ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటన