Samantha: కొత్త ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతున్న సమంత - ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటన
Samantha: ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీ యాక్టర్‌గా వెలిగిపోయింది సమంత. కానీ తన అనారోగ్య సమస్య వల్ల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. అలాంటి సామ్.. తన ఫ్యాన్స్ కోసం ఒక ఎగ్జైటింగ్ న్యూస్‌ను షేర్ చేసింది.
Samantha: చాలామంది సినీ సెలబ్రిటీలు.. తమ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్ గురించి కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తమ పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కునే ఇబ్బందుల గురించి బయటపెడితే.. దానివల్ల మిగతావారికి కూడా స్ఫూర్తి దొరుకుతుందని వారు భావిస్తుంటారు. అందులో హీరోయిన్ సమంత కూడా ఒకరు. గత కొన్నాళ్లుగా సమంత.. మాయాసైటీస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. దీని గురించి సందర్భం దొరికినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటుంది. కానీ తాజాగా ఈ విషయంలో సమంత ఓ నిర్ణయానికి వచ్చింది. తను ఎదుర్కుంటున్న సమస్యల గురించి ప్రతీ వారం ఒక పోడ్కాస్ట్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటన..
మయాసైటిస్‌కు చికిత్స తీసుకోవడం కోసం సమంత కొన్నాళ్లు సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించింది. తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తిచేసి కొన్నాళ్ల పాటు ఫారిన్ వెళ్లి చికిత్స అందుకుంది. ప్రస్తుతం సమంత చేతిలో సినిమాలు ఏమీ లేవు. కానీ తాజాగా తను వర్క్‌ను మళ్లీ ప్రారంభించినట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ ఇచ్చింది సామ్. దాంతో పాటు ఒక హెల్త్ పోడ్కాస్ట్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. తన స్నేహితులతో కలిసి ఈ పోడ్కాస్ట్‌ను మొదలుపెట్టనున్నట్టు తెలిపింది. ఇప్పటికే మయాసైటిస్ అటాక్ అయినప్పటి నుండి ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో పలుమార్లు చెప్తూ వచ్చింది సమంత. ఇప్పుడు ఏకంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికోసం హెల్త్ పోడ్కాస్ట్‌నే ప్రారంభించనుంది.
చాలా ఎంజాయ్ చేశాను..
‘అవును. నేను మళ్లీ వర్క్‌ను ప్రారంభిస్తున్నాను. కానీ మధ్యకాలంలో పూర్తిగా నాకేం పనిలేకుండా అయిపోయింది. అందుకే నేను నా ఫ్రెండ్‌తో కలిసి ఫన్ చేస్తున్నాను. అదే హెల్త్ పోడ్కాస్ట్. అది అనుకోకుండా ప్రారంభించిందే కానీ చేయడం ప్రారంభించిన తర్వాత నాకు చాలా చాలా నచ్చింది. ఇది నేను చాలా ఆసక్తితో ప్రారంభించాను. వచ్చే వారం నుండి పోడ్కాస్ట్ ప్రారంభమవుతుందని చెప్పడం నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మీలో కొందరికి అయినా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇది చేసే క్రమంలో నేను చాలా ఎంజాయ్ చేశాను’ అంటూ తన కొత్త హెల్త్ పోడ్కాస్ట్ గురించి ప్రచారం చేసింది సమంత.
ఒకే హాలీవుడ్ సినిమా..
ఇప్పటికే చాలా సందర్భాల్లో పలు హెల్త్ టిప్స్‌ను షేర్ చేస్తూ.. తన ఫ్యాన్స్‌ను ఆరోగ్యంగా ఉండమని చెప్తూనే ఉంటుంది సామ్. ఇప్పుడు అందరికీ ఉపయోగపడే విధంగా పోడ్కాస్ట్ ప్రారంభించడం మంచి విషయమని ఫ్యాన్స్.. తనను ప్రశంసల్లో ముంచేస్తున్నారు. తాజాగా సమంత.. రాజ్, డీకే దర్శకులతో కలిసి ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌ను ముగించింది. ఇందులో వరుణ్ ధావన్‌తో తను జోడీకట్టింది. ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఖుషి’లో తను చివరిసారిగా కనిపించి అలరించింది. ప్రస్తుతం తన చేతిలో ఒక ఇంగ్లీష్ సినిమా కూడా ఉంది. ‘చెన్నై స్టోరీస్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ఇంగ్లీష్ మూవీ ద్వారా సామ్.. హాలీవుడ్‌కు పరిచయం కానుంది.
Also Read: ‘స్త్రీ 2’లో గెస్ట్ రోల్ చేస్తున్న యంగ్ హీరో - సినిమాటిక్ యూనివర్స్ కోసం!