అన్వేషించండి

Grooming Gang Scandal: వేల మంది బ్రిటన్ బాలికల జీవితాలతో ఆడుకున్న పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగులు - ఇప్పుడు కూడా ఉన్నాయా ?

UK: యూకేలో పాకిస్థానీలు బ్రిటన్ బాలికల్ని టార్గెట్ చేసుకుని చేసిన ఓ భారీ గ్రూమింగ్ గ్యాంగ్స్ స్కాండల్ సంచలనంగా మారుతోంది. అసలు ఈ గ్రూమింగ్ గ్యాంగ్ స్కాండల్ అంటే ఏమిటి ?

What is UKs Pakistani grooming gangs scandal: బ్రిటన్ లో చాలా కాలంగా పాకిస్తాన్ కు చెందిన వారు స్థిరపడుతూ వస్తున్నారు. వీరి ఆలోచనలు ఎలా ఉంటాయో కానీ.. ఇరవై ఏళ్ల కిందటి నుంచి పాకిస్తాన్ కు చెందిన యువకులు గ్రూమింగ్ గ్యాంగులుగా ఏర్పడ్డారు. వారి పని .. బ్రిటన్ జాతీయులైన, శ్వేత జాతీయులైన అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడం.. వారితో శారీరక సంబంధాలు పెట్టుకోవడం.. బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేసేవారు. 2000లు ప్రారంభంలో ఈ ఘటనలు విపరీతంగా బయటపడ్డాయి, ముఖ్యంగా యోర్క్‌షైర్, రోచ్డేల్, టోటెన్‌హామ్, మరియు ఇతర ప్రాంతాలలో బ్రిటన్ బాలికలు అనేక మంది ఈ గ్యాంగుల ధాటి బలైపోయారు. 

ఈ ఘటనలన్నీ యాధృచ్చికంగా జరగలేదని గ్యాంగులుగా ఏర్పడి చేశారని బ్రిటన్ పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. అందుకే బ్రిటన్ లో దీన్ని "గ్రూమింగ్ గ్యాంగ్ స్కాండల్" అని పిలుస్తున్నారు.ఈ గ్రూమింగ్ గ్యాంగ్ లలలో ఉండేవారంతా పాకిస్తాన్ కు చెందిన వారే.  2,65,000 మంది జనాభా కలిగిన రోథర్‌హామ్ పట్టణంలో..  1997 నుండి 16 సంవత్సరాల కాలంలో కనీసం 1,400 మంది బాలికలపై ఒక ముఠా మాదకద్రవ్యాలు ఇచ్చి, అత్యాచారం చేసి, లైంగిక దోపిడీ చేసిందని 2014లో ఓ విచారణ గుర్తించింది.        

Also Read: పావు గంట టైమ్ ఇస్తారు - ఎంత లెక్కపెడితే అంత బోనస్ - ఈ కంపెనీ రూటే వేరు!

దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ  గ్రూమింగ్ గ్యాంగుల అరాచకాలపై ఆ దేశంలో గగ్గోలు రేగింది.  రోథర్‌హామ్ ముఠాలపై దర్యాప్తు చేయడానికి నేషనల్ క్రైమ్ ఏజెన్సీ UKలో అతిపెద్ద ఆపరేషన్ స్టవ్‌వుడ్‌ను ప్రారంభించిం. ఇప్పటివరకు దాదాపు 30 మంది వ్యక్తులకు దీర్ఘకాలిక జైలు శిక్షలను విధించేలా చేసింది. పశ్చిమ ఇంగ్లాండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో   స్వతంత్ర విచారణ  1,000 మందికి పైగా బాధితులు ఉన్నారని అంచనా వేసింది. మాంచెస్టర్ సమీపంలోని రోచ్‌డేల్‌లో జరిగిన మరో దర్యాప్తులో  "ఒక ముఠా" 13 మంది పిల్లలపై లైంగిక హింసకు పాల్పడినందుకు అక్కడి కోర్టులు దాదాపు 40 మంది పురుషులకు శిక్ష విధించాయని తేలింది.

ప్రస్తుతం ఈ గ్రూమింగ్ గ్యాంగుల కార్యకలాపాలు ఉన్నాయో లేదో స్పష్టత లేదు కానీ బ్రిటన్ ప్రధానమంత్రిగా స్టార్మర్ ఎన్నిక కావడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.ఎందుకంటే 2008 మరియు 2013 మధ్య ఇంగ్లాండ్,  వేల్స్‌కు ప్రాసిక్యూషన్ సర్వీస్ అధిపతిగా స్టార్మర్ ఉన్నారు. గ్రూమింగ్ గ్యాంగులపై బహిరంగ విచారణను నిర్వహించడానికి స్టార్మర్  అప్పట్లో అంగీకరించలేదు. ఇది జాతుల మధ్య వైరం తెస్తుందని అది దేశానికి మంచిది కాదన్నారు. అందుకే స్మార్మర్ ప్రధానిగా ఎన్నికయినప్పుడు ఎలాన్ మస్క్ స్పందించారు. 

పాకిస్తాన్ యువకులు శ్వేతజాతీయులైన బాలికలపై ఇలాంటి దురాగతాలకు పాల్పడటంపై పాకిస్తాన్ భిన్నంగా స్పందిదంచింది. ఇస్లామోఫోబియాను పెంచుతున్నారని.. అంతకు మించి ఆ కేసుల్లో ఏం లేదని చెబుతోంది.                 

Also Read : Airplane Crash : గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం - నిలిచిపోయిన విమాన రాకపోకలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Book A APSRTC Ticket In AP Whatsapp Governance: ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
AP WhatsApp Governance: వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
Pothugadda Review - 'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO 100th Launch Journey | సైకిల్ మీద తిప్పలు, ఎడ్ల బండి మోతలు..అన్నీ దాటి ఈ రోజు సెంచరీ | ABP DesamMaha Kumbh 2025 Prayag Raj Drone VisualsMaha Kumbh 2025 Mouni Amavasya | మౌని అమావాస్య రోజు కుంభమేళాలో మహా అపశృతి | ABP DesamCM Yogi Adityanath Request Devotees | నాలుగు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న యోగి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Book A APSRTC Ticket In AP Whatsapp Governance: ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
AP WhatsApp Governance: వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
Pothugadda Review - 'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
Trump on US Plane Crash: విమాన ప్రమాదంలో 64 మంది మృతి! 18 మృతదేహాలు వెలికితీత, ఘటనపై ట్రంప్ అసహనం
విమాన ప్రమాదంలో 64 మంది మృతి! 18 మృతదేహాలు వెలికితీత, ఘటనపై ట్రంప్ అసహనం
Union Ministers Convoy Accident: విశాఖలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో ప్రమాదం- దెబ్బతిన్న 3 వాహనాలు
విశాఖలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో ప్రమాదం- దెబ్బతిన్న 3 వాహనాలు
Budget 2025: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - బడ్జెట్‌ ముందు వీటి తేడాలు తెలుసుకోండి
కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - బడ్జెట్‌ ముందు వీటి తేడాలు తెలుసుకోండి
Srikalahasti Temple Issue: శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం వివాదం- సిబ్బందిపై వేటు వేసిన అధికారులు: నారా లోకేష్
Srikalahasti Temple Issue: శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం వివాదం- సిబ్బందిపై వేటు వేసిన అధికారులు: నారా లోకేష్
Embed widget