Operation Valentine and Fighter: ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘ఫైటర్’ సినిమాల మధ్య పోలికపై స్పందించిన డైరెక్టర్
Operation Valentine and Fighter: ఆపరేషన్ వాలంటైన్ వరుణ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా. అయితే, ఈ సినిమాకి సంబంధించి పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్.
Operation Valentine and Fighter: వరుణ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఎయిర్ ఫోర్స్ థీమ్ తో తెరకెక్కించారు ఈ సినిమా. పుల్వామా అటాక్ ఆధారంగా తీసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా నటించాడు. అయితే, హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ సినిమా కూడా ఎయిర్ ఫోర్స్ యాక్షన్ థీమ్ తో తెరకెక్కించారు. దీంతో ఈ రెండు సినిమాలకు పోలిక ఉందంటూ వస్తున్న వార్తలపై డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ స్పందించారు. అసలు రెండు సినిమాలకు పోలిక లేదని క్లారిటీ ఇచ్చారు.
నేను ఫైటర్ సినిమా చూడలేదు..
ఆపరేషన్ వాలంటైన్ టీజర్, కాన్సెప్ట్ తెలిసిన వెంటనే చాలామంది ఫైటర్ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, దానికి దీనికి సంబంధం లేదు అని అన్నారు శక్తి ప్రతాప్ సింగ్. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడారు ఆయన. “మాది పూర్తిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి తెరకెక్కించిన సినిమా. నేను అసలు ‘ఫైటర్’ సినిమా చూడనేలేదు. ఆడియెన్స్ కి కచ్చితంగా.. ఒక యునీక్ సినిమా అందిస్తాననే నమ్మకం మాకు ఉంది. మేం సినిమాలో ఎవ్వరికీ తెలియని, ఎయిర్ ఫోర్స్ లో కామన్ గా జరిగే విషయాలే చెప్పాం. ఈ సినిమా కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాదు.. పైలెట్స్ మధ్య ఉండే స్నేహం, వాళ్ల మధ్య ఉండే సంబంధాలను చెప్తుంది” అని డైరెక్టర్ చెప్పారు.
ఎయిర్ ఫోర్స్ థీమ్..
ఇక ఈ సినిమాని వైమానిక దాడులు, దేశభక్తి థీమ్ తో తెరకెక్కించారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. వరణ్ తేజ్ నటించిన తొలి హిందీ చిత్రం ఇది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. మార్చి 1న సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మొదట జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ ని వాయిదా వేశారు. ఇక ఇప్పుడు సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా ముమ్మరంగా చేస్తున్నారు చిత్ర బృందం. దాంట్లో భాగంగానే ఇటీవల పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు వరుణ్ తేజ్.
బాలీవుడ్ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్.. ఈ మూవీని డైరెక్ట్ చేశారు. నవదీప్, రుహానీ శర్మ ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేయగా.. హిందీ ట్రైలర్ సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా విడుదలయ్యింది. ట్రైలర్ రిలీజ్ అంచనాలు పెంచేసింది. ఇక అభిమానులు అయితే, హిట్ గ్యారెంటీ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వామ్మో, మృణాల్ - అన్ని కోట్లు పెట్టి కంగనా రనౌత్ ఫ్యామిలీ ఆస్తులను కొనేసిందట!