అన్వేషించండి

Mrunal Thakur: వామ్మో, మృణాల్ - అన్ని కోట్లు పెట్టి కంగనా రనౌత్ ఫ్యామిలీ ఆస్తులను కొనేసిందట!

Mrunal Thakur: బ్యాక్ టు బ్యాక్ ఫీల్ గుడ్ సినిమాలతో మెస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది మృణాల్ ఠాకూర్. తాజాగా కంగనా రనౌత్ కుటుంబానికి చెందిన ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందంటూ వార్తలు బయటికొచ్చాయి.

Mrunal Thakur Buys Flat: సినీ సెలబ్రిటీలు తాము చేసే సినిమాలను బట్టి, అందుకునే రెమ్యునరేషన్ బట్టి తమ డ్రీమ్ హౌజ్‌ను ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో మంచి క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్ కూడా ఫైనల్‌గా తన ఇల్లు మారాలని డిసైడ్ అయ్యింది. ముంబాయ్‌లో కంగనా రనౌత్ కుటుంబ సభ్యులకు చెందిన ఒక జోడీ ఫ్లాట్ (అంటే రెండు ఫ్లాట్స్ కాంబినేషన్)ను మృణాల్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ ఫ్లాట్స్‌ను తన టేస్ట్‌కు తగినట్టుగా మార్చుకుంటోంది. అసలు విషయం ఏంటంటే ఈ ఫ్లాట్స్ ధర ఎంతో బయటికొచ్చింది. దీని ధర విని ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అన్ని కోట్లా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

త్వరలోనే షిఫ్ట్..

ముంబాయ్‌లో కంగనా రనౌత్ తండ్రి, అన్నకు చెందిన జోడీ ఫ్లాట్స్‌ను మృణాల్ ఠాకూర్ కొనుగోలు చేసినట్టు బాలీవుడ్‌లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కంగనా రనౌత్ తండ్రి అమర్‌దీప్ సింగ్ రనౌత్, అన్న అక్షత్ దీప్ రనౌత్‌ల పేర్ల మీద ఈ ఫ్లాట్స్ ఉన్నాయని సమాచారం. అయితే వారి దగ్గర నుండి రూ.10 కోట్లు పెట్టి మృణాల్ ఠాకూర్ వాటిని కొనుగోలు చేసిందట. ప్రస్తుతం మృణాల్.. తన పాత ఇల్లు ఓబ్రాయ్ స్ప్రింగ్స్‌లోనే నివాసముంటుంది. కొత్త ఫ్లాట్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్న ఈ భామ.. కంగనా ఫ్యామిలీ నుండి ఆ ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు తన టేస్ట్‌కు తగినట్టుగా ఆ ఫ్లాట్స్ ఇంటీరియర్‌ను మార్చుకుంటోంది. త్వరలోనే అన్ని పనులు పూర్తయిపోయి కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వనుందట మృణాల్.

హాట్ టాపిక్..

బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్న మృణాల్ ఠాకూర్.. ఇంత ఖర్చుపెట్టి ఫ్లాట్స్ కొనుగోలు చేయడం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నాని హీరోగా వచ్చిన ‘హాయ్ నాన్న’తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఇప్పటికే తెలుగులో ‘సీతారామం’ అనే సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ చిత్రం ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచింది. మళ్లీ అలాంటి క్లాసిక్ చిత్రం మృణాల్ కెరీర్ మొత్తంలో చేయలేదు అనుకునేలోపే ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకులను పలకరించింది. దీంతో ఈ హీరోయిన్ స్క్రిప్ట్ సెలక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మృణాల్.. ఒక సినిమా చేస్తుంది అంటే అందులో కంటెంట్ బాగుంటుందని వారు ఫిక్స్ అయిపోయారు.

స్క్రిప్ట్ సెలక్షన్ సూపర్..

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేతిలో పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీ స్టార్’ ఉంది. ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాట విడుదల అవ్వగా.. అందులో విజయ్ దేవరకొండతో మృణాల్ కెమిస్ట్రీ అదిరిపోయిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. వెంటవెంటనే సినిమాలు చేయాలని తొందరపడకుండా తనకు నచ్చే పాత్రలు, ప్రాధాన్యత ఉండి తనకు సూట్ అయ్యే పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ ముందుకెళ్తోంది మృణాల్. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయినా కూడా ప్రస్తుతం తనకు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా టాలీవుడ్ వల్లే ఏర్పడింది అనడంలో ఆశ్చర్యం లేదు.

Also Read: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో దక్షిణాది హవా - బెస్ట్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటిగా నయన్‌కు అవార్డులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget