అన్వేషించండి

Dadasaheb Phalke IFF Awards 2024: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో దక్షిణాది హవా - బెస్ట్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటిగా నయన్‌కు అవార్డులు

Dadasaheb Phalke IFF Awards 2024: 2024 సంవత్సరానికిగానూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రకటన జరిగింది. ఇందులో కేవలం మూడు సినిమాల అనుభవం ఉన్న సందీప్ రెడ్డి వంగాకు ఉత్తమ దర్శకుడిగా పురస్కారం దక్కింది.

Dadasaheb Phalke IFF Awards 2024 Winners: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు సినీ సెలబ్రిటీలు. ఇక 2024 సంవత్సరానికిగానూ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల విన్నర్స్ ఎవరు అనే విషయం బయటికొచ్చింది. షారుఖ్ ఖాన్, రాణీ ముఖర్జీ, నయనతార, సందీప్ రెడ్డి వంగా తదితరులకు అవార్డులు దక్కాయి. ‘జవాన్’ సినిమాలో తన నటనతో ఇంప్రెస్ చేసినందుకు షారుఖ్ ఖాన్‌కు బెస్ట్ యాక్టర్ కేటగిరిలో అవార్డుల దక్కగా.. అదే సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన నయనతారకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ దక్కింది. అంతే కాకుండా ‘జవాన్’ చిత్రానికి మరొక కేటగిరిలో కూడా అవార్డు దక్కింది. అదే మ్యూజిక్ డైరెక్షన్. ఈ సినిమాకు మ్యూజిక్ అందింనందుకు అనిరుధ్‌ రవిచందర్‌కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరిలో అవార్డ్ దక్కింది.

మూడు సినిమాలతోనే..

కేవలం మూడు సినిమాలతోనే సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే తన తాజా చిత్రం ‘యానిమల్’కు ఏకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డునే సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను ఇష్టపడని కొందరు ప్రేక్షకులు.. తీవ్రమైన విమర్శలు కురిపిస్తున్నారు. ఇంతలోనే ఈ చిత్రానికి బెస్ట్ డైరెక్టర్‌గా సందీప్ అవార్డ్ అందుకోవడంతో విమర్శలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక క్రిటిక్స్ కేటగిరిల విషయానికొస్తే.. ‘సామ్ బహదూర్’ చిత్రంలో తన అద్భుతమైన నటనకు క్రిటిక్స్ ఫిదా అయ్యి విక్కీ కౌశల్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డును ప్రకటించారు. ఇక వీరితో పాటు ఇతర దాదాసాహెబ్ ఫాల్కే విజేతలు ఎవరో ఓ లుక్కేయండి..

ఇతర విన్నర్స్..

బెస్ట్ యాక్టర్: షారుఖ్ ఖాన్, జవాన్

బెస్ట్ యాక్ట్రెస్: నయనతార, జవాన్

బెస్ట్ యాక్ట్రెస్: రాణి ముఖర్జీ మిసెస్ ఛాటర్జీ వర్సెస్ నార్వే

బెస్ట్ డైరెక్టర్: సందీప్ రెడ్డి వంగా, యానిమల్

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: అనిరుధ్ రవిచందర్, జవాన్

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): వరుణ్ జైన్, తేరే వాస్తే (జరా హట్కే జరా బచ్కే)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావు, బేషరం రంగ్ (పఠాన్)

బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్: బాబీ డియోల్, యానిమల్

బెస్ట్ యాక్ట్రెస్ట్ ఇన్ టీవీ సిరీస్: రూపాలీ గంగూలీ, అనుపమా

బెస్ట్ యాక్టర్ ఇన్ టీవీ సిరీస్: నీల్ భట్, ఘమ్ హై కిసీకే ప్యార్ మే

టీవీ సిరీస్ ఆఫ్ ది ఇయర్: ఘమ్ హై కిసీకే ప్యార్ మే

బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ వెబ్ సిరీస్: కరిష్మా తన్నా, స్కూప్

ఔట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ: మౌషుమీ చాటర్జీ

ఔట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ది మ్యూజిక్ ఇండస్ట్రీ: కేజే యేసుదాస్

2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులలో ఉత్తమ నటి అవార్డులను ఈసారి ఇద్దరు హీరోయిన్లు పంచుకోనున్నారు. ‘జవాన్’లో హీరోయిన్‌గా నయనతార నటన జ్యూరీని ఎంతగా ఆకట్టుకుందో ‘మిసెస్ ఛాటర్జీ వర్సెస్ నార్వే’లో రాణీ ముఖర్జీ నటన కూడా అంతే ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తోంది.

Also Read: త్రిషపై పొలిటిషియన్ అనుచిత వ్యాఖ్యలు - అతడిని ఖండించడం కూడా ఇష్టం లేదు.. విశాల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget