అన్వేషించండి

RC 16: రెహమాన్ సాంగ్స్, దేవిశ్రీ పాటలకు మించి ఉంటాయి: దర్శకుడు బుచ్చిబాబు

Buchibabu Sana: రామ్ చరణ్, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘RC16’. చెర్రీ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న బుచ్చిబాబు, ఈ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు.

Buchibabu Sana About ‘RC16’ Movie: ‘ఉప్పెన’ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన, ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి ‘RC16’ అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ చిత్రంలో చెర్రీ సరనస జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివ రాజ్ కుమార్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్  ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను వ్రిద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘RC16’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన బుచ్చిబాబు    

ఇక తాజాగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న బుచ్చిబాబు సన ‘RC16’ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా మ్యూజిక్ తో బ్లాస్ట్ కాబోతుందన్నారు. రెహమాన్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నట్లు తెలిపారు. చెర్రీ తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ముకాకుండా చూసుకుంటానని తెలిపారు. “నేను ఎక్కడ నుంచి మొదలు పెట్టినా చిరంజీవి గారి దగ్గరి నుంచే మొదలు పెట్టాల్సి వస్తుంది. చిరంజీవి లేకపోతే నా సినీ ప్రయాణం లేదు. ‘ఉప్పెన’ సినిమాకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. హ్యాపీ బర్త్ డే చరణ్ సర్.. మీరు నాకు ఇచ్చిన ‘RC 16’ పనిని మనస్ఫూర్తిగా నిరూపించుకుంటాను. ఇప్పటికే ఈ సినిమాలో 3 పాటలు అయిపోయాయి. ఈ పాటలకు రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ సాంగ్ నుంచే ఆ మూవీ బ్లాస్ అయిపోతుంది. మ్యూజిక్ చాలా గొప్పగా ఉంటుంది. నాకు పాటలంటే చాలా ఇష్టం. ‘ఉప్పెన’లో దేవి గారు ఎలా ఇచ్చారో చూశారు. రెహమాన్ గారు వాటికి మించేలా ఇచ్చారు. తగ్గేదే లే!” అని చెప్పుకొచ్చారు.

జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్, టైటిల్ ఇదేనా?

నిజానికి ‘ఉప్పెన’ సినిమా తర్వాత మూడేళ్లు ఖాళీగానే ఉన్నారు బుచ్చిబాబు. చాలా మంది హీరోలు, నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయాలి అనుకున్నా నో చెప్పారు. తను చేపట్టే తర్వాతతి ప్రాజెక్ట్ పెద్దదిగా ఉండాలని భావించారు. అనుకున్నట్లుగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ‘RC16’ సినిమా చేస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. 'పెద్ది' అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో వాస్తవం ఎంత అనేది చిత్రబృందం నుంచి ప్రకటన వస్తే తప్ప తెలియదు. అటు రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  

Read Also: కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు చూస్తారు - ఏయం రత్నం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Embed widget