అన్వేషించండి

Devara Movie: సందీప్‌ రెడ్డి వంగాతో 'దేవర' టీం ముచ్చట్లు - జాన్వీపై కొరటాల ఆసక్తికర కామెంట్స్‌! అదిరిపోయిన ప్రొమో

Devara Team With Sandeep Reddy Vanga: దేవర టీం ప్రమోషన్స్‌ జోరు మామూలుగా లేదు. తాజాగా మూవీ టీం డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో ఇంటరాక్ట్‌ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రొమోను తాజాగా విడుదలైంది. 

Devara Movie Team With Sandeep Reddy Vanga: టాలీవుడ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'దేవర'. మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, టీజర్, ట్రైలర్‌, సాంగ్స్‌కి ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది.

ముఖ్యంగా చుట్టమల్లె పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యింది. దీంతో సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా దగ్గరపడుతుండటం దేవర మూవీ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇప్పటికే నార్త్‌లో ప్రమోషన్స్‌ని జోరుగా జరుపుకున్న దేవర టీం సౌత్‌కి వచ్చేసింది. ఈ ప్రమోషన్స్‌లో సంచలన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, యూత్‌లో యమ క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోలను కూడా భాగం చేసింది దేవర టీం. ఇప్పటికే టిల్లు బాయ్‌ సిద్దు జొన్నలగడ్డ, మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివతో కలిసి దేవర ముచ్చట్లు చెప్పించారు.  

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక ఫుల్‌ వీడియో కోసం ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇంటర్య్వూకి సంబంధించిన ప్రోమో రిలీజ్‌ చేసి మరింత క్యూరియాసిటీ పెంచింది దేవర టీం.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రొమో నెట్టింట వైరల్‌ అవుతుంది. సెన్సేషనల్‌ డైరెక్టర్‌, అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ చిత్రాల ఫేం సందీప్‌ రెడ్డి వంగా దేవర టీంను ఇంటర్య్వూలో చేశారు. ఈ ఇంటర్య్వూలో డైరెక్టర్‌ కొరటాల శివ, జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సందీప్‌ రెడ్డి వంగా దేవర మూవీకి సంబంధించిన ఆసక్తిర విషయాలను మూవీ టీం చర్చించారు. ఈ ప్రొమో ఫియర్‌ సాంగ్‌ గురించి సందీప్‌ వంగ ప్రశ్నంచడంతో మొదలైంది. అంతేకాదు యాక్షన్‌ సీన్స్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ విలనీజం.. జాన్వీ కపూర్‌ పర్ఫామెన్స్‌ ఇలా పలు ఆసక్తికర అంశాలపై చర్చించినట్టు కనిపిస్తుంది. చూస్తుంటే ఫుల్‌ వీడియో ఆడియన్స్‌ మంచి కిక్‌ ఇచ్చేలా కనిపిస్తోంది. దీంతో ఈ ఫుల్‌ ఇంటర్య్వూ కోసం ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Also Read: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తున్న తంగలాన్‌ - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

ఈ వీడియో దేవర మూవీ యాక్షన్‌ డ్రామా అని అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్‌. సినిమాలో మొత్తం ఫియర్‌ ఉందని అనగానే టీం అంత నవ్వుతుంది. ఇక జాన్వీనే ఈజ్‌ ద బెస్ట్‌ అని, తను చాలా బాగా నటించిందంటూ కొరటాల కితాబు ఇచ్చారు. ఇక చివరిలో దేవర మూవీ పెద్ద హిట్‌ అవుతుంది, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి పిచ్చెక్కిపోతారంటూ జాన్వీ చేసిన కామెంట్స్‌ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఇక ఎన్టీఆర్‌ సముద్రంలో షార్క్‌తో చేసిన ఫైట్‌ సీన్‌ గురించి చెప్పడం ఉత్కంఠ పెంచుతుంది. ఇలా దేవర మూవీ గురించి స్వయంగా ఎన్టీఆర్‌, కొరటాల మాటల్లోనే వినడం మూవీపై మరిన్ని అంచనాలు పెంచుతుంది. దేవర గురించి కొరటాల, ఎన్టీఆర్‌, సైఫ్‌, జాన్వీ ఎం చెప్పారో తెలియాలంటే ఫుల్‌ ఇంటర్య్వూ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Embed widget