Thangalaan OTT: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తున్న తంగలాన్ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!
Vikram Thangalaan OTT Update: చియాన్ విక్రమ్ తంగలాన్ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ సినిమాను డిజిటల్ ప్రీమియర్‌కు ఇచ్చేందుకు సదరు ఓటీటీ సంస్థ ప్లాన్ చేస్తుంది!
Thangalaan OTT Release: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా స్వతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న విడుదలైన బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్ లుక్, యాక్షన్, పర్ఫామెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. వన్ మ్యాన్ షోగా విక్రమ్ తంగలాన్ మూవీని తనదైన నటనతో నడిపించాడంటూ పాజిటివ్ రివ్యూస్ అందుకున్నాడు. మొత్తంగా చాలా గ్యాప్ తర్వాత తంగలాన్‌తో విక్రమ్ సాలీడ్ హిట్ అందుకున్నాడు. థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది.
భారీ ధరకు ఓటీటీ ఢీల్
తంగలాన్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని భారీ ధరకు కోనుగోలు చేసింది. దాదాపు రూ. 35 కోట్లకు తంగలాన్‌ను డిజిటల్ హక్కులను కోనుగోలు చేసిందట నెట్‌ఫ్లిక్స్. ఇది అన్ని భాషలకు కలిపి అని సమాచారం. థియేటర్లో విడుదలైన మంచి విజయం సాధించింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ ఇచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని సమాచారం. సెప్టెంబర్ 20న అన్ని దక్షిణాది భాషల్లో ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారట. తాజా బజ్ ప్రకారం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్‍కు రానుందనే టాక్. అయితే, హిందీ వెర్షన్‌ను మాత్రం కాస్తా ఆలస్యంగా రిలీజ్ చేయనున్నారట. సెప్టెంబర్ 27న తంగలాన్ హిందీ వెర్షన్ అందుబాటులో ఉంచనునుందని టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.
#Thangalaan coming to #Netflix pic.twitter.com/KuuP9ezcCq
— Movies Available On (@moviesavailable) September 10, 2024
ముందుగానే ఓటీటీకి
నిజానికి ఓ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీకి తీసుకురావాలనేది ఒప్పందం. అయితే మూవీ రిజల్ట్, దానికి ఉన్న బజ్ బట్టి డిజిటల్ ప్రీమియర్‌కు తీసుకువస్తున్నారు. ప్లాప్ సినిమాలు నెలలు గడిచిన ఓటీటీకి రావడం. అలాగే బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు నెల రోజులకే ఓటీటీకి వస్తున్నాయి. అదీ ఆ ఓటీటీతో ఉన్న ఢీల్ బట్టి సినిమాను ఓటీటీకి తీసుకువస్తున్నారు. అయితే విక్రమ్ లాంటి స్టార్ హీరో సినిమాను నెల రోజుల్లోనే ఓటీటీకి తీసుకురావడం గమనార్హం. ముందుగా ఈ సినిమాను రెండు నెలల తర్వాత ఓటీటీకి తీసుకురావాలని మేకర్స్ ఒప్పందం. కానీ, సినిమా థియేట్రికల్ రన్‌ను కొద్ది ముగిసింది.
తమిళనాడులో కొన్ని థియేటర్లోనే ఈ సినిమా ఆడుతుంది. దీంతో ఈ సినిమాను అనుకున్న తేదీ కంటే ముందుగానే ఓటీటీకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుందట. ఈ మేరకు మేకర్స్ చర్చ జరుపుతున్న సమాచారం. అంతా ఒకే అయితే సెప్టెంబర్ 20 నుంచి సినిమాను డిజిటల్ ప్రీమియర్‌కు తీసుకువస్తుందని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. మరి సెప్టెంబర్ 20న ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందా అనేది చూడాలి!. కాగా నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.
Also Read: SSRMB29 స్టోరీ లీక్ - 18వ శతాబ్దం కాలంలోకి మహేష్ బాబు, హైదరాబాద్‌లో భారీ సెట్