SSRMB 29 Movie: SSRMB29 స్టోరీ లీక్ - 18వ శతాబ్దం కాలంలోకి మహేష్ బాబు, హైదరాబాద్‌లో భారీ సెట్
Mahesh Babu SSMB 29 Movie: మహేష్ బాబు-డైరెక్టర్ రాజమౌళి SSMB29 మూవీకి సంబంధించిన ఓ సాలీడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
SSRMB29 Movie is a 18th Century Perodic Drama? దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతోన్న సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రకటించారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ SSRMB29గా పేరు మార్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం మహేష్ బాబు కూడా పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఇది వరకు ఎన్నడు చూడని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు.
18వ శతాబ్దం కాలం
ఇది భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని చక్కన్న ఎప్పుడో ఈ మూవీపై సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలుపెట్టనుంది. తొలి షెడ్యూల్ విదేశాల్లో జరగునుందట. ఫారిన్ అడవుల్లో భారీ ఛేజింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లో తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ సాలీడ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. జెమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమా ఉండనుందని మొన్నటి వరకు వినిపించిన టాక్. అయితే ఇప్పుడు ఈ సినిమా స్టోరీకి సంబంధించిన ఓ లీక్ బయటకు వచ్చింది. ఇదోక పీరియాడికల్ యాక్షన్ డ్రామా అని, 18 శతాబ్ధపు కాలం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుందట.
హైదరాబాద్ లో భారీ సెట్
ఆ కాలం నాటికి సంబంధించి భారీ సెట్స్‌ను ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ఇందులో నటీనటులంతా 18 శతాబ్దపు కాలానికి చెందిన గిరిజన తెగకు సంబంధించిన లుక్‌లో కనిపించనున్నారట. ఇందుకోసం హైదరబాద్‌లో ఓ భారీ సెట్‌ని ప్లాన్ చేస్తోందట జక్కన్న టీం. దాదాపు 200పైగా మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమా నటిస్తున్నారని గుసగుస. ఇప్పటికే ఈపాత్రలకు సంబంధించిన నటీనటులను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తున్నారట. ఈ నెల చివరిలో ప్రధాన తారాగణంతో వర్క్ షాప్స్ మొదలుపెట్టి డిసెంబర్‌లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించేందుకు జక్కన్న అండ్ టీం ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్.
హీరోయిన్ గా ఇండోనేషియన్ నటి?
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విదేశీ నటీనటులు కూడా నటించనున్నారని ముందు నుంచి టాక్. ఇందులో మహేష్ సరసన ఓ హాలీవుడ్ నటి హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ మహేష్ జోడీగా నటించనుందని భోగట్టా. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాకు ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న మూవీకి కెఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్. ఈ సినిమా కోసం నిపుణులైన హాలీవుడ్ టెక్నిషియన్లు వర్క్ చేయనున్నారని టాక్. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ సంస్థ ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read: కౌన్ బనేగా కరోడ్ పతిలో పవన్ కల్యాణ్ క్వశ్చన్.. ఇంతకీ అమితాబ్ ఏం అడిగారో తెలుసా?