'యానిమల్' బ్యూటీ త్రిప్తి దిమ్రి క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు
రణ్‌బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది
ఒక్క సినిమాతోనే కుర్రకారు మనసు దొచేసి నేషనల్ క్రష్‌గా మారి రష్మికకు గట్టి పోటీ ఇచ్చింది
ఆ తర్వాత త్రిప్తికి బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి
ఇటీవల విక్కీ కౌశల్ బ్యాడ్‌న్యూస్ సినిమాతో మంచి హిట్ అందుకుంది ఈ భామ
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ లుక్, ఫోటోల షూట్స్‌తో అలరిస్తుంది
తాజాగా ఈ యానిమల్ భామ వింటెజ్ లుక్‌తో సర్‌ప్రైజ్ చేసింది త్రిప్తి దిమ్రి
ఆమె వింటేజ్ లుక్‌కి నెటిజన్స్, ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు
సో క్యూట్ అని, 70's 80'sలో ఇలాంటి గ్లామర్ ఉండేది, ఇప్పుడు అంతకంటే గ్లామరస్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు
ప్రస్తుతం త్రిప్తి దిమ్రి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి