మేఘా ఆకాష్ పెళ్లి సందడి: మెహందీ వేడుకలో రొమాంటిక్‌ ఫోటోలు చూశారా?

Published by: Satya Pulagam

హీరోయిన్ మేఘా పెళ్లి సందడి

యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి సందడి మొదలైంది. ఈ రోజు మెహందీ వేడుక జరిగింది. ఆ ఫోటోలను ఆవిడ షేర్ చేశారు.

ఆగస్టు 23న నిశ్చితార్థం

తనకు నిశ్చితార్థం అయ్యిందని ఆగస్టు 23న మేఘా ఆకాష్ తెలిపారు. ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ

నిశ్చితార్థం తర్వాత స్నేహితులతో కలిసి శ్రీలంక వెళ్లారు మేఘా ఆకాష్. అక్కడ బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. లేడీస్ గ్యాంగ్ తో దిగిన ఫోటోలు ఆవిడ షేర్ చేశారు.

రజనీకాంత్‌కు ఆహ్వానం...

సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేటా' సినిమాలో మేఘా ఆకాష్ నటించారు. తాను రజనికి పెద్ద ఫ్యాన్ అని పేర్కొన్నారు. తన పెళ్లికి ఆయన్ను కూడా ఆహ్వానించారు.

సెప్టెంబర్ 13న మెహందీ వేడుక

సెప్టెంబర్ 13న తమ మెహందీ వేడుక జరిగిందని మేఘా ఆకాష్ వివరించారు. ఆ ఫోటోల్లో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడింది. 

మేఘా ఆకాష్ భర్త పేరు ఏమిటంటే?

మేఘా ఆకాష్ చేసుకోబోయే అబ్బాయి పేరు సాయి విష్ణు. ఆయనొక వ్యాపారవేత్త అని తెలిసింది. 

భర్తతో రొమాంటిక్ ఫోజులు

 మెహందీ వేడుక తర్వాత భర్తతో కలిసి మేఘా ఆకాష్ రొమాంటిక్ ఫోటో సెషన్ నిర్వహించారు. 

తెలుగు ఏయే సినిమాలు చేశారంటే?

నితిన్ 'లై', 'చల్ మోహన్ రంగ'తో పాటు శ్రీ విష్ణు 'రాజా రాజా చోర', మరొక సినిమా చేశారు మేఘా ఆకాష్. 

విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు

 మేఘా ఆకాష్ నటించిన 'సకుటుంబానాం'తో పాటు మరొక సినిమా విడుదలకు రెడీగా ఉంది.