Acharya Jagan : ఒకే వేదికపై చిరంజీవి , జగన్ ! ఆ రోజు సంచలన ప్రకటన ఉంటుందా ?

విజయవాడలో నిర్వహించనున్న ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీంతో సినీ వర్గాల్లోనే కాదు రాజకీయంగానూ ఆసక్తి ప్రారంభమయింది.

FOLLOW US: 

చిరంజీవి ( Chiranjeevi )  కొత్త సినిమా ఆచార్య ( Acharya ) విడుదలకు సిద్ధంగా ఉంది.  ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుద‌ల కానున్న‌ట్లు మేక‌ర్స్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను (  Pre Release Event ) ఏప్రిల్ 23న విజ‌యవాడ‌లోని సిద్దార్థ జూనియ‌ర్ కాలేజ్‌లో నిర్వహించ‌నున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ( AP CM Jagan )  రానున్నారు. ఆచార్య సినిమా నిర్మాతలు ఒకరైన నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) ప్రముఖ లాయర్. ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన వ్యక్తిగత కేసులను చూస్తూంటారు. అక్రమాస్తుల కేసులో వాదనలు వినిపిస్తూ ఉంటారు.  ఇటీవల టిక్కెట్ల వివాదంపై జరిగిన చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. 

ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి వర్సెస్ బండ్ల గణేష్ ! చరిత్రలు బయట పెట్టేసుకుంటున్నారుగా

చిరంజీవితోనూ జగన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో వారి ఆహ్వానం మేరకు సీఎం జగన్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. సినిమా టికెట్లు, థియేటర్ల విషయంలో సినీ పరిశ్రమ ( Film Industry ) , అనుబంధ పరిశ్రమలు ఏపీలో ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇబ్బంది పడ్డాయి. ఈ సమస్యలని తొలగించడానికి చిరంజీవి ముందుండి పలు మార్లు జగన్ ని కలిశారు.  ఆ ప్రయత్నాలు ఫలించి టిక్కెట్ రేట్లు ( Ticket Rates ) పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ తర్వాత పలు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. 

నెల్లూరు వైసీపీలో వర్గపోరు, కాకాణి రాక-అనిల్ సభ ఎవ్వరూ తగ్గేదేలే!

చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) జనసేన పార్టీ పెట్టి .. జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ( YSR Congress Party )  పూర్తి వ్యతిరేకిగా ఉన్నారు.  మరో సోదరుడు నాగబాబు ( Nagababu ) కూడా జగన్ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి జగన్ కు సన్నిహితంగా వ్యవహరించడం కూడా రాజకీయంగా కలకలం రేపే అవకాశం ఉంది. ఇటీవల చిరంజీవి  సీఎం జగన్‌ను కలిసినప్పుడు ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని చిరంజీవి కొట్టేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో వైదొలిగానని ప్రకటించారు. రాజ్యసభ సీటు అనే ప్రశ్నే రాదన్నారు. 

Published at : 16 Apr 2022 04:03 PM (IST) Tags: Acharya chiranjeevi jagan Acharya pre-release ceremony

సంబంధిత కథనాలు

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!