By: ABP Desam | Updated at : 16 Apr 2022 03:38 PM (IST)
బండ్ల గణేష్ వర్సెస్ విజయసాయిరెడ్డి
ట్విట్టర్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. ఒకరి గురించి ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ముందుగా ఈ ట్వీట్ వార్‌ను బండ్ల గణేష్ ప్రారంభించారు. విజయసాయిరెడ్డి ఓ కులాన్ని నిందిస్తున్నారని ఆరోపిస్తూ ట్వీట్లతో బండ్ల గణేష్ విమర్శలు ప్రారంభించారు.
మీకు కులం నచ్చకుంటే ...కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టoడి ... చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి
అధికారం శాశ్వతం కాదు
రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు
ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు
నేను కమ్మ వాణ్ణే కానీ టిడిపి కాదు@VSReddy_MP గారు — BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
తర్వాత విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. " వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి అంటూ విరుచుకుపడ్డారు.
నీకు నచ్చకుంటే వ్యక్తి పేరు పెట్టి తిట్టు
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
కానీ కులాన్ని కాదు...నిన్ను జైల్ కు పంపింది... కమ్మ వారు కాదు...
త్వరలో నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి...
ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో తెలుసు
అన్నిటికీ సిద్ధపడే చేస్తున్నా
.@VSReddy_MP
వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి @VSReddy_MP
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
అంతే కాదు షర్మిల జగన్‌తో విభేదించడానికి కూడా కారణం విజయసాయిరెడ్డేనన్నట్లుగా మరో ట్వీట్ చేశారు.
అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయం @VSReddy_MP
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
మొత్తంగా బండ్ల గణేష్ ట్వీట్ వైసీపీని టార్గెట్ చేయలేదు. ఒక్క విజయసాయిరెడ్డినే టార్గెట్ చేశారు. సీఎం జగన్‌ను విజయసాయిరెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారన్నట్లుగా మాట్లాడారు.
జగన్ గారు ...ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు.. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
నాకు కుల పిచ్చి లేదు
నా కులాన్ని నేను ప్రేమిస్తాను
ప్రతి కులాన్ని గౌరవిస్తాను @VSReddy_MP
బండ్ల గణేష్ ట్వీట్లు విజయసాయిరెడ్డిని బాధపెట్టేయేమో కానీ ఆయన కూడా స్పందించారు. ఆయన ట్వీట్ల భాష గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారందరికీ తెలుసు. ఉన్నత విద్యావంతుడైనప్పటికీ అత్యంత దిగువ స్థాయిలో ఆయన ట్వీట్ల లాంగ్వేజ్ ఉంటుంది. బండ్ల గణేష్ పైనా అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఆకులు..వక్కలు..పక్కలు...ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో...గణేశా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2022
విజయసాయిరెడ్డి స్పందిస్తే ఇక బండ్ల గణేష్ ఎందుకు ఊరుకుంటారు. వెంటనే స్పందించారు. ఒకటికి.. రెండు తిట్లతో ట్వీట్లు పెట్టారు.
ఎస్ నేను కుక్కనే కానీ దానిలా విశ్వాసం ఉన్నవాడిని.. నీలా పిచ్చికుక్కను కాదు తెలుసుకో దొంగ సాయి.. మేము ఏం చేసుకున్నా మా సొంతానికి చేసుకున్నాం కష్టపడ్డాం నీలా దోచుకోలేదు దొంగ సొమ్ము దాచుకోలేదు. ఒక్కటి గుర్తు పెట్టుకో దొంగసాయి. https://t.co/4uIl7FDisd
— BANDLA GANESH. (@ganeshbandla) April 16, 2022
విజయసాయిరెడ్డి , బండ్ల గణేష్ కు అసలు ఎక్కడా తేడా వచ్చింది..? వారి మధ్య ఉన్న గొడవలేమిటన్నది ఎవరికీతెలియదు. బండ్లకు ఎందుకు ఆవేశం వచ్చింది ? దాని వెనుక ఏం ఉంది అన్నది ఆయన బయటపెడితేనే తెలియాల్సి ఉంది.
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !
3 Years of YSR Congress Party Rule : యువత ఆశలు గల్లంతు - మూడేళ్లలో జాబ్ క్యాలెండర్ హామీ నిలబెట్టుకోలేకపోయిన సీఎం జగన్ !
3 Years of YSR Congress Party Rule : దూరమైన ఫ్యామిలీ, ఆత్మీయులు - మూడేళ్లలో జగన్ కొత్త శత్రువులను పెంచుకున్నారా ?
Telugu Desam Party : సై అంటున్న సైకిల్ పార్టీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!