Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ రాజు వచ్చేశాడు - రాఘవ లారెన్స్ రాజసం అదిరిందిగా!
‘చంద్రముఖి 2’ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మూవీలోని రాజుగా నటిస్తున్న రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
Chandramukhi 2: రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మూవీ ‘చంద్రముఖి 2’. ఈ సినిమాకు పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. మరో లీడ్ రోల్ లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తోంది. గతంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మూవీలోని రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మూవీ టీమ్.
రాజుగా మెప్పించనున్న రాఘవ లారెన్స్..
‘చంద్రముఖి 2’ సినిమాలోని రాఘవ లారెన్స్ పాత్రపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ టీమ్ ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో మూవీపై హైప్ పెరిగిందనే చెప్పాలి. రాజు వేషధారణలో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నాడు. ఆయన నడిచి వస్తున్న ఫోజ్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు మేకర్స్. రాఘవ కళ్లల్లో రాజసం ఉట్టిపడేలా ఉందా పోస్టర్. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ‘చంద్రముఖి’ సినిమాలో రాజు పాత్రతోనే కథ అంతా ముడిపడి ఉంటుంది. ఆ సినిమాలో రాజుగా రజనీకాంత్ నటించి మెప్పించారు. అందుకే ఈ సినిమాలో కూడా రాజు పాత్రపై చాలా అంచనాలు ఉన్నాయి. ‘చంద్రముఖి 2’ సినిమాలో రాజుగా రాఘవ లారెన్స్ ను ఎలా చూపిస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది.
18 ఏళ్ల తర్వాత..
దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. 2005 లో వచ్చిన ఆ సినిమాలో రజనీకాంత్, జ్యోతికలు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ మూవీలో వారు ప్రేక్షకులను నవ్వించారు, భయపెట్టారు అలా భారీ సక్సెస్ ను అందుకున్నారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు.అయతే మధ్యలో ఇదే థీమ్ తో విక్టరీ వెంకటేష్ ‘నాగవల్లి’ అనే సినిమా చేసినా ఆ సినిమా అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఈ రెండు సినిమాలకు పి. వాసు నే దర్శకత్వం వహించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ‘చంద్రముఖి 2’కు సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ మూవీకు కూడా పి. వాసు దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కూడా ఈ మూవీలో నటిస్తుండటంతో మూవీపై ఆసక్తి నెలకొంది. మరి కొద్ది రోజుల్లోనే కంగనా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేస్తారని టాక్. మరి ఈ మూవీలో కంగనా ఎలా కనిపిస్తుందో చూడాలి.
వినాయక చవితి సందర్భంగా..
ఇక ఈ సినిమాలో స్టార్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అంతేకాక ఈ మూవీకి లెజండరీ సంగీత దర్శకుడు ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. వచ్చే సెప్టెంబర్ లో వినాయక చవితి సందర్భంగా మూవీను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
View this post on Instagram
Also Read: చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని చూసి అలా ఫీల్ అయ్యేవాడిని : ఆనంద్ దేవరకొండ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial