ఆ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న 'బ్రో' నిర్మాతలు!
మరో కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగులో విడుదలకు సిద్ధమైంది. రక్షిత్ శెట్టి నటించిన 'సప్త సాగర దాచే ఎల్లో' అనే మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో ఇతర భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాలను టాలీవుడ్ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కన్నడ, మలయాళ ఇండస్ట్రీస్ నుంచి ఈ మధ్యకాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు తెలుగులో కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయి. వాటిలో 'కాంతారా', 'చార్లీ777', '2018' వంటి సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. రీసెంట్ టైంలో కన్నడ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా విడుదలై భారీ సక్సెస్ అందుకున్న 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' అనే మూవీ ఇటీవల తెలుగులో 'హాస్టల్ బాయ్స్' పేరుతో విడుదలై మంచి రెస్పాన్స్ అందుతుంది.
ఇప్పుడు మరో కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైంది. 'అతడే శ్రీమన్నారాయణ', '777చార్లీ' వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. ఒకప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన మాజీ ప్రియుడుగా టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం ఉన్న ఈ హీరో ఇప్పుడు తన సినిమాలతో హీరోగా తెలుగులోనూ మంచి క్రేజ్ అందుకున్నాడు. ఈ హీరో నటించిన ముఖ్యంగా '777 చార్లీ' పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా కన్నడలో సినిమాలు చేసే రక్షిత్ శెట్టి నుంచి ఓ సినిమా వస్తుందంటే టాలీవుడ్ లోనూ ఆ మూవీపై మంచి హైప్ ఉంటుంది.
ఎందుకంటే రక్షిత్ శెట్టి క్వాలిటీ ఉండే కంటెంట్ ని మాత్రమే ఎంచుకొని సినిమాలు చేస్తారు. అలా ఇటీవల రక్షిత్ శెట్టి ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటించిన 'సప్త సాగర దాచే ఎల్లో' అనే చిత్రం కన్నడలో సూపర్ హిట్ అయింది. రుక్మిణి వసంత హీరోయిన్గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న కన్నడలో విడుదలై క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచింది. దర్శకుడు హేమంతరావు సినిమాలో లవ్ స్టోరీని చూపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ మూవీకి చరణ్ రాజ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమాని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో రిలీజ్ చేస్తోంది.
నిజానికి ఈమధ్య కన్నడ సూపర్ హిట్ మూవీస్ ని తెలుగులో గీతా ఆర్ట్ సంస్థ వాళ్ళు ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. కానీ మొదటిసారి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం. ఈ మేరకు తాజాగా మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనౌన్స్ చేసింది. 'సప్త సాగరాలు దాటి' అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న తెలుగులో ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. విడుదలకు కేవలం వారం రోజులు ఉంది కాబట్టి తెలుగులోనూ ప్రమోషన్స్ చేసి ట్రైలర్ రిలీజ్ చేస్తే కచ్చితంగా సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మరి కన్నడ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని క్లాసిక్ లవ్ స్టోరీ గా పేరు తెచ్చుకున్న ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ని ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.
#SaptaSagaraluDhaati in Telugu on 22nd of September😍❤️
— People Media Factory (@peoplemediafcy) September 15, 2023
Get ready to witness the Heart Warming Tale 💓 #SSESideA #SSDFromSep22 https://t.co/VOz727glTu
Also Read : రతిక మా కొడుకును వాడుకుంది, ‘బిగ్ బాస్’ నుంచి బయటకు రాగానే పెళ్లి చేసేస్తాం: పల్లవి ప్రశాంత్ తల్లి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial